మీరు ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుండి వేరే నియోజకవర్గానికి లేదా వేరే జిల్లాకు ఇల్లు మారారా? కానీ మీ Voter ID Card లో ఇంకా పాత చిరునామానే ఉందా? కానీ మీ Voter ID Card లో ఇంకా పాత చిరునామానే ఉందా? అయితే వెంటనే Voter ID లో Address Change చేయడం తప్పనిసరి. ఎందుకంటే వేరే నియోజకవర్గానికి మారినప్పుడు మీ పేరు పాత Voter List నుండి తొలగించబడి కొత్త నియోజకవర్గంలో చేర్చబడాలి — లేకుంటే మీరు ఓటు వేయలేరు. ఈ ఆర్టికల్ లో Voter ID Address Change Outside Constituency Telugu 2026 process ను Form 8 ద్వారా step-by-step గా వివరించాం. Election Commission of India అందించే అధికారిక Voter Services Portal ద్వారా ఈ సేవను పూర్తి ఉచితంగా (Free) online లో చేయవచ్చు.

Quick Summary — Voter ID Address Change Outside Constituency Telugu 2026
| Details | Information |
|---|---|
| Time Required | 10–15 నిమిషాలు |
| Fee | పూర్తిగా ఉచితం (Free) |
| Form | Form 8 |
| Portal | Voter Services Portal |
| Processing Time | 15-30 రోజులు |
| Helpline | 1950 (Free, 24×7) |
Voter ID Address Correction vs Shifting — తేడా ఏమిటి?
Form 8 లో Address Update కు మూడు వేర్వేరు పరిస్థితులు ఉంటాయి. మీ పరిస్థితికి సరిపోయే option ను ఎంపిక చేయాలి. క్రింది పట్టికలో వాటి మధ్య తేడాలను చూడండి.
| Feature | Address Correction | Shifting Within Constituency | Shifting Outside Constituency |
|---|---|---|---|
| ఉద్దేశ్యం | ఇప్పటికే ఉన్న చిరునామాలో అక్షర దోషం లు (Spelling Mistakes) లేదా కొన్ని పదలను సరిదిద్దడం. | అదే అసెంబ్లీ నియోజకవర్గంలో కొత్త ఇంటికి మారడం. | వేరే అసెంబ్లీ నియోజకవర్గానికి లేదా వేరే రాష్ట్రానికి మారడం. |
| Form లో Selection | Form 8 → “Correction of Entries” | Form 8 → “Shifting of Residence” (Within AC) | Form 8 → “Shifting of Residence” (Outside AC) |
| EPIC Number | అదే ఉంటుంది | అదే ఉంటుంది | అదే ఉంటుంది |
| Voter List పై ప్రభావం | ఉన్న entry అప్డేట్ అవుతుంది. | పేరు కొత్త Booth / Part కి ట్రాన్స్ఫర్ అవుతుంది. | పాత list నుండి తొలగించబడి కొత్త list లో చేర్చబడుతుంది. |
| అవసరమైన Proof | సరైన చిరునామా చూపించే document. | ప్రస్తుత కొత్త నివాసం యొక్క Proof. | కొత్త ప్రాంతంలో నివాసం యొక్క Proof. |
గమనిక: మీరు అదే ఇంట్లో ఉంటూ Voter Card లో చిరునామా spelling తప్పుగా ఉంటే —Address Correction ఎంచుకోండి. ఇల్లు మారారంటే —Shifting ఎంచుకోండి.
ప్రస్తుత చిరునామా తప్పుగా ఉండి, లేద Address డీటైల్స్ లో అక్షర దోషం లు (Spelling Mistakes) ఉంటే, ఓటర్ ID లో చిరునామా సవరించుట పూర్తి స్టెప్ బై స్టెప్ గైడ్ ద్వారా సరిచేసుకోగలరు.
ఒకవేళ మీరు అదే నియోజకవర్గంలో ఇల్లు మారితే, అదే నియోజకవర్గంలో (Same Constituency) ఇల్లు మారినప్పుడు Form 8 ద్వారా చిరునామా మార్పు పూర్తి గైడ్ ద్వారా సరిచేసుకోగలరు.
Voter ID లో Address Change ఎందుకు అవసరం?
మీరు వేరే నియోజకవర్గానికి ఇల్లు మారినప్పుడు Voter ID లో కొత్త చిరునామా update చేయడం చాలా అవసరం:
- మీ పేరు పాత Voter List నుండి తొలగించబడి కొత్త నియోజకవర్గంలో చేర్చబడుతుంది.
- మీరు కొత్త ప్రాంతంలో మీ స్థానిక Polling Booth వద్ద ఓటు వేయగలరు.
- Voter Card ని గుర్తింపు కార్డ్‌గా వాడినప్పుడు Address mismatch సమస్యలు రావు.
- ప్రభుత్వ పథకాల లబ్ధి పొందేందుకు Address proof గా ఉపయోగపడుతుంది.
- డిజిటల్ e-EPIC Card డౌన్‌లోడ్ చేసుకోవడం సులభమవుతుంది.
- రెండు చోట్ల (పాత + కొత్త) ఓటర్‌గా నమోదు అవుతారు — ఇది చట్టప్రకారం నేరం. అందుకే తొలగించడం అవసరం.
Form 8 అంటే ఏమిటి? | Form 8 Online Apply Telugu
Form 8 అనేది ఓటర్ కార్డ్‌లో ఉన్న వివరాలను సరిదిద్దడానికి ఉపయోగించే అధికారిక ఫారం. ఇది Election Commission of India ద్వారా అందించబడుతుంది. Election Commission Mobile Number Update or Add కోసం Form 8 అధికారిక ఫారం. దీన్నే “Correction of Entries in Electoral Roll” form అంటారు.
Form 8 ద్వారా మీరు:
- పేరు సరిదిద్దుకోవచ్చు.
- పుట్టిన తేదీ మార్చుకోవచ్చు.
- అడ్రస్ సరిచేయవచ్చు.
- ఫోటో అప్డేట్ చేయవచ్చు.
- మొబైల్ నంబర్ Add లేదా మార్చుకోవచ్చు.
Voter ID Address Change కు అవసరమైన Documents
Form 8 Voter ID Address Change Online కోసం ఈ క్రింది documents సిద్ధంగా ఉంచుకోవాలి: (Election Commission of India నిర్దేశించిన documents ఇవి).
- EPIC Number (మీ Voter ID Number). ఒకవేళ మీ వద్ద Voter Card లేకపోయినా లేదా Voter Card Number తెలియక పోయిన చింతించాల్సిన అవసరం లేదు Electoral Roll Search ద్వారా ఎలా తెలుసుకోవాలో ఈ గైడ్ లో వివరించబడింది.
- Aadhaar Number (eSign కోసం).
- Mobile Number – Aadhaar తో లింక్ అయినది (OTP verification కోసం).
- చిరునామా రుజువు పత్రం (కింది వాటిలో ఏదైనా ఒకటి):
- ఆధార్ కార్డు. (కొత్త చిరునామాతో అప్డేట్ అయినది)
- పాస్‌పోర్ట్.
- డ్రైవింగ్ లైసెన్స్.
- విద్యుత్ బిల్లు / నీటి బిల్లు.
- రేషన్ కార్డ్.
- బ్యాంక్ పాస్‌బుక్ (ఫోటో తో).
- అద్దె ఒప్పందం.
- ఆస్తి పన్ను రశీదు.
- గమనిక: eSign ప్రక్రియ పూర్తి చేయాలంటే, మీ ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్ తప్పనిసరిగా active గా ఉండాలి. అలాగే, ఆధార్‌లో ఉన్న పేరు మరియు ఓటర్ కార్డ్‌లో ఉన్న పేరు పూర్తిగా ఒకే విధంగా ఉండాలి.
- Aadhaar Mobile Link లేకపోతే:
మీ ఆధార్‌కు మొబైల్ నంబర్ లింక్ చేయబడకపోతే లేదా ఇప్పటికే లింక్ అయిన నంబర్‌ను మార్చుకోవాలనుకుంటే, Unique Identification Authority of India (UIDAI) 2026 నియమాల ప్రకారం రూపొందించిన ఆధార్ మొబైల్ నెంబర్ లింక్ / మార్చుట 2026 పూర్తి గైడ్ సహాయం తో ముందుగా Aadhaar Mobile Number Update పూర్తి చేసుకోండి. - పేరు సరిపోకపోతే:
- ఒకవేళ ప్రస్తుతం మీ ఓటర్ కార్డ్‌లో ఉన్న పేరు, ఆధార్‌లో ఉన్న పేరుతో ఒకే విధంగా లేకపోతే, మొదటిగా ఫారం 8 లో ఉన్న Correction of Entries in Existing Electoral Roll ఆప్షన్ ద్వారా పేరు ను ఆధార్ కార్డ్ లో ఉన్న విదం గా మార్చుకోవాలి. అప్పుడు మాత్రమే మనం eSign ద్వారా అప్లికేషన్ సబ్మిట్ చేయగలం.
- Voter Card లో పేరు సరిచేయడం ఎలా – పూర్తి గైడ్
- eSign చేయలేని పరిస్థితిలో:
- ఒకవేళ మీ ఆధార్‌కు మొబైల్ నెంబర్ లింక్ లేకపోవడం లేదా పేరు సవరణకు సమయం లేకపోతే, ఈ ఆర్టికల్‌లో వివరించిన Step 7 వరకు ఉన్న ప్రక్రియను అనుసరించి, ఫిల్ చేసిన అప్లికేషన్‌ను Download చేసుకుని మీ BLO / ERO కు సమర్పించవచ్చు. ఈ విధానంలో Aadhaar eSign అవసరం ఉండదు.
- అయితే, మొబైల్ నెంబర్‌ను ఆధార్‌కు లింక్ చేయడం మరియు పేరు సవరించుకోవడం తర్వాత eSign ద్వారా అప్లికేషన్ సమర్పించడం ఉత్తమమైన విధానం. ఈ విధానంలో BLO / ERO కి భౌతికంగా ఏ విధమైనా డాక్యుమెంట్ సమర్పించవలసిన పని లేదు.
- Aadhaar Mobile Link లేకపోతే:
- అప్లోడ్ చేయబోయే డాక్యుమెంట్ కాపీ క్రింది భాగంలో మీ సంతకం చేసి 2 MB లోపాల స్పష్టంగా PDF లేద JPEG రూపం లో అప్లోడు చెయ్యాలి.
వేరే నియోజకవర్గం లోకి Voter ID చిరునామా మార్పు స్టెప్ బై స్టెప్ ప్రక్రియ (Form 8)
Step 1: Voter Service Portal లో Login లేద Sign-UP అవ్వండి

Form 8 online apply Telugu లో చేయడానికి మొదట మీ browser లో Voter Services Portal ను తెరవండి.
కొత్త User అయితే (Sign-UP):
- Sign-UP ఆప్షన్ పై క్లిక్ చెయ్యాలి.
- Mobile Number, Email ID (తప్పనిసరి కాదు) మరియు Captcha నమోదు చేసి Continue పై క్లిక్ చెయ్యాలి.
- తరువాత పేజిలో First Name మరియు Last Name నమోదు చేసి Resend OTP పై క్లిక్ చెయ్యాలి.
- మీ ఫోన్ కి వచ్చిన OTP ని verify చేసి Register అవ్వగలరు.
ఇప్పటికే Account ఉంటే (Login):
- Login ఆప్షన్ పై క్లిక్ చేసి Mobile Number / Email ID / EPIC No మరియు Captcha నమోదు చేసి Request OTP పై క్లిక్ చెయ్యాలి.
- OTP verify చేసి Portal లో Login అవ్వగలరు.
Step 2: Correction Of Entries (Form 8) ను ఎంపిక చెయ్యండి

- Voter Service Portal dashboard లో Fill Form 8 పై క్లిక్ చెయ్యాలి.
- తుదిపరి పేజి లో Application For Self or Other elector అని అడుగుతుంది. ఇక్కడ Self ను ఎంపిక చేసుకోండి. ఒకవేళ మీరు మీ వెరే వల్ల Voter card లో చిరునామా మార్పు చేయాలనుకుంటే Other elector ను ఎంపిక చేసుకోవాలి.
- EPIC నెంబర్ ఎంటర్ చేసి Submit పై క్లిక్ చెయ్యండి.
- ఒకవేళ మీకు మీ EPIC Number తెలియకపోతే, మీ “వివరాలు లేక ఫోన్ నెంబర్” తో Electoral Roll Search ద్వారా తెలుసుకోగలరు.
Search in Electoral Roll
- ఒకవేళ మీకు మీ EPIC Number తెలియకపోతే, మీ “వివరాలు లేక ఫోన్ నెంబర్” తో Electoral Roll Search ద్వారా తెలుసుకోగలరు.
- తుదిపరి పేజి లో మీకు Electoral Roll లో ఉన్న మీ డీటైల్స్ కనిపిస్తాయి, ఒకసారి verify చేసి ok పై క్లిక్ చెయ్యండి.
Step 3: Shifting of Residence ను ఎంపిక చేయండి

- ఈ పేజి లో “Application for” వద్ద “Shifting of Residence” ను టిక్ చేసి, తరువాత “Outside Assembly Constituency” ను ఎంపిక చేసి క్రింద ఉన్న OK పై క్లిక్ చేయండి.
- మీకు కావాలనుకుంటే ఇక్కడ నుండి Application ను తెలుగులో కూడా ఫిల్ చేయవచ్చు. అప్లికేషన్ ఫారమ్ కుడి పై భాగంలో Language Change ఆప్షన్ ఉంటుంది. అక్కడ నుండి భాషను తెలుగు గా మార్చుకోవచ్చు. ఒకవేళ మీరు ఇంగ్లీష్ లోనే కొనసాగాలనుకుంటే అలాగే వదిలేయవచ్చు.
Step 4: మారిన రాష్ట్రం, జిల్లా మరియు అసెంబ్లీ / పార్లమెంటరీ నియోజకవర్గాన్ని ఎంపిక చేయండి

A. State/UT వద్ద మారిన రాష్ట్రం, District దగ్గర మారిన జిల్లా పేరు, Select A C దగ్గర మారిన కొత్త అసెంబ్లీ పేరు ఎపికచేసుకోవాలి.
తరువాత Next పై click చెయ్యండి.
Step 5: Personal Details నమోదు చెయ్యండి
B. Details వద్ద: (తప్పనిసరి కాదు)
- మీ పేరు మరియు EPIC నంబర్ already fill అయ్యి ఉంటుంది.
- Aadhaar Number వద్ద టిక్ చేసి Aadhaar నంబర్ ఎంటర్ చెయ్యండి.
- Mobile Number మరియు Email వద్ద మీ details ఎంటర్ చేసి Next పై క్లిక్ చెయ్యాలి.
C. I Submit application for దగ్గర “Shifting of Residence” select చేసి ఉంటుంది.
Step 6: కొత్త చిరునామా నమోదు చేయండి మరియు Address Proof Upload చేయండి

- Application for Shifting of Residence దగ్గర:
- మీ ఇంటి నెంబర్, వీధి పేరు, గ్రామం లేదా పట్టణం పేరు, పోస్ట్ ఆఫీస్ ఉన్న ఊరి పేరు, పిన్ కోడ్, మండలం మరియు జిల్లా పేరును మీరు అప్లోడ్ చేస్తున్న సపోర్టింగ్ డాక్యుమెంట్‌లో ఉన్న విధంగానే ఖచ్చితంగా నమోదు చేయాలి.
- Document Name దగ్గర మీ వద్ద ఉన్న Supporting Document Name ను డ్రాప్ డౌన్ లిస్ట్ లో ఎంపికచేసుకోని, పక్కన Upload Address Proof దగ్గర అప్లోడు చెయ్యాలి.
- గమనిక:
- డాక్యుమెంట్ కాపీ పై మీ సంతకం చేసి సైజ్ 2 MB లోపు , JPG / JPEG / PNG / PDF రూపం లో అప్లోడు చెయ్యాలి. PDF రూపం లో అప్లోడు చెయ్యడం ఉత్తమం.
- అప్లికెంట్ పేరు మీద లేదా మారాలనుకుంటున్న అదే చిరునామాలో ఇప్పటికే ఓటర్‌గా నమోదైన తల్లిదండ్రులు / భార్య లేదా భర్త / పెద్దవయసు పిల్లలలో ఎవరి పేరులోనైనా ఉన్న Address Proof యొక్క Self-Attested Copy ను అప్లోడ్ చేయాలి.
- గమనిక:
- తరువాత Next పై click చెయ్యండి.
Step 7: Declaration
- D. Declaration వద్ద ఉన్న Declaration పూర్తి గా చదివి Place దగ్గర మీ ఊరి పేరు నమోదు చేసి Next పై click చెయ్యండి.
- E. Submission దగ్గర Name to be printed on EPIC. వద్ద కొత్త గా రాబోయే ఓటర్ కార్డ్ పై ప్రింట్ అయ్యే డీటైల్స్ కనిపిస్తాయి. వాటిని ఒకసారి verify చేసుకొండి. ఒకవేళ తప్పుగా ఉంటే వాటిని మందుగా కానీ లేద చిరునామా బదిలీ అయిన తరువాత సరిచేసుకోండి.
- Captcha నమోదు చెసి Preview and Submit పై క్లిక్ చెయ్యండి. తరువాత పేజి లో మీకు మనం ఇప్పటి వరకు నమోదు చేసిన డీటైల్స్ కనిపిస్తాయి, వాటిని ఒకసారి verify చేసుకొని, తప్పులు ఉంటే Keep Editing పై క్లిక్ చేసి సరిచేయండి లేకపోతే Download పై క్లిక్ చేసి Application సేవ్ చేసుకొని eSign & Submit పై క్లిక్ చెయ్యండి.
- గమనిక: eSign ప్రక్రియ పూర్తి చేయాలంటే, మీ ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్ తప్పనిసరిగా Active గా ఉండాలి. అలాగే, ఆధార్‌లో ఉన్న పేరు మరియు ఓటర్ కార్డ్‌లో ఉన్న పేరు పూర్తిగా వరుస క్రమం మరియు స్పెల్లింగ్ తో సహ ఒకే విధంగా ఉండాలి . ఒకవేళ ఈ రెండు సరిపోలకపోతే, మీరు ఫిల్ చేసిన అప్లికేషన్‌ను Download చేసుకుని మీ BLO / ERO కు సమర్పించవచ్చు. ఈ విధానంలో Aadhaar eSign అవసరం ఉండదు మరియు అప్లికేషన్ భౌతికంగా (Physical Verification) ధృవీకరించబడుతుంది.
- గమనిక: మీ ఆధార్‌కు మొబైల్ నంబర్ లింక్ అయి ఉండి, అలాగే ఆధార్‌లో ఉన్న పేరు మరియు ఓటర్ కార్డ్‌లో ఉన్న పేరు వరుస క్రమం మరియు స్పెల్లింగ్ తో సహ ఒకే విధంగా సరిపోతే, eSign ప్రక్రియను ఫాలో అవ్వాలి. ఈ విధానంలో అప్లికేషన్ ఆన్‌లైన్‌లోనే వెరిఫికేషన్ జరుగుతుంది మరియు భౌతిక ధృవీకరణ (Physical Verification) అవసరం ఉండదు.
- eSign పేజీకి చేరుకోవడానికి కొంత సమయం పడవచ్చు. అందువల్ల దయచేసి కొద్దిసేపు వేచి ఉండాలి. ఈ సమయంలో Back, Cancel లేదా Reload / Refresh చేయకూడదు. eSign పేజీ పూర్తిగా ఓపెన్ అయ్యే వరకు వేచి ఉండాలి.
Step 8: Aadhaar OTP తో eSign & Submit చేయండి

- ఈ పేజి లో Enter Aadhaar వద్ద మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి Get OTP పై క్లిక్ చెయ్యాలి.
- Enter Your Aadhaar OTP వద్ద మీ Mobile కి వచ్చిన OTP ఎంటర్ చేసి, క్రింద “I hereby state” పక్కన ఉన్న బాక్స్ పై టిక్ చేసి Submit పై క్లిక్ చెయ్యాలి.
- ఈ పేజి లో మీకు Reference Number వస్తుంది, ఆ నెంబర్ ని Save చేసుకొని, Download Acknowledgement పై క్లిక్ చేసి Acknowledgement Slip ని save చేసుకోవాలి.
- ఇక్కడి తో Voter ID లేక EPIC card Voter ID Address correction process 2026 విజయవంతం గా పూర్తి అవుతుంది. Reference Number సహాయంతో మన Application status ను తెలుసుకోవోచ్చు .
Track Voter ID Address Update Application Status
- Voter Services Portal (Official Website)
వెబ్‌సైట్ ను ఓపెన్ చేసి. Mobile నెంబర్ సహాయం తో లాగిన్ అవ్వండి. - Voter Service Portal Dashboard లో “Track Application Status” ను ఎంపిక చేసుకోండి.
- మీ Reference Number లేదా Mobile Number ఎంటర్ చెసి, Submit పై క్లిక్ చెయ్యాలి.
- స్టేటస్ తక్షణమే కనిపిస్తుంది.
లేదా నేరుగా కాల్ చేయండి: 1950 (Voter Helpline — ఉచితం, 24×7)
Address Update తర్వాత ఎంత సమయం పడుతుంది?
- 15 – 30 రోజులు పడుతుంది.
- BLO వెరిఫికేషన్ తర్వాత అప్రూవల్ జరుగుతుంది.
- Approval తర్వాత కొత్త EPIC Card postal ద్వారా అందుతుంది.
సాధారణ తప్పులు – వీటిని జాగ్రత్తగా చేయండి
- కొత్త చిరునామా Address Proof Document లో స్పష్టంగా ఉందో confirm చేసుకోండి.
- Upload చేసే document స్పష్టంగా చదవగలిగేలా ఉండాలి.
- మరబోయే రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం పేరు సరిగా నమోదుచెయ్యాలి.
- Reference Number మరియు Acknowledgement Slip save చేసుకోండి.
- తప్పుడు format లో document upload చేయడం (JPG / JPEG / PNG / PDF మాత్రమే valid).
- File size 2MB కంటే ఎక్కువ ఉండటం — compress చేయండి.
- Aadhaar తో link కాని Mobile Number use చేయడం (eSign fail అవుతుంది).
- Wrong EPIC Number ఎంటర్ చేయడం.
- తప్పుడు documents సమర్పించడం — ఇది చట్టప్రకారం నేరం.
Application Reject అయ్యే కారణాలు
- Aadhaar OTP verify కాకపోవడం.
- Wrong EPIC Number.
- సాంకేతిక కారణాలు వలన.
Offline లో Voter Card చిరునామా బడలీ ఎలా చేయాలి?
Internet access లేకపోయినా లేదా online process నచ్చకపోతే, offline voter card Address change కూడా చేయవచ్చు.
Step 1: Form 8 తీసుకోండి
- Voter Services Portal (Official Website) వెబ్‌సైట్ లో Form 8 Download చేసుకోవోచ్చు .
- లేదా దగ్గర్లో ఉన్న BLO (Booth Level Officer) దగ్గర తీసుకోండి
Step 2: Form Fill చేయండి
- అన్ని details clearly blue/black pen తో రాయండి.
- Shifting of Residence — Outside Constituency ఎంపిక చేసి కొత్త చిరునామా వివరాలు రాయండి.
- Photo section లో కొత్త passport size ఫోటో అతికించండి.
- Signature వేయండి.
Step 3: Submit చేయండి
- మీ BLO దగ్గర లేదా Electoral Registration Office (ERO) లో submit చేయండి.
- Acknowledgment receipt తప్పకుండా తీసుకోండి.
తరచూ అడిగే ప్రశ్నలు | FAQ – Voter Card Address Change Telugu
1. Form 8 submit చేయడానికి ఎంత రుసుము అవుతుంది?
పూర్తిగా ఉచితం (Free). ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
2. Process పూర్తి కావడానికి ఎంత సమయం పడుతుంది?
సాధారణంగా 15–30 రోజులు పడుతుంది. BLO వెరిఫికేషన్ తర్వాత అప్రూవల్ జరుగుతుంది.
3. Aadhaar Mobile Link లేకపోతే apply చేయగలమా?
చేయగలం కాని, eSign చేయకుండా application download చేసి BLO / ERO కు physically submit చేయవచ్చు.
4. Application status ఎలా చెక్ చేయాలి?
Voter Services Portal లో “Track Application Status” ద్వారా లేదా 1950 helpline కు call చేయడం ద్వారా తెలుసుకోవచ్చు.
5. Upload చేసే document maximum size ఎంత?
2 MB లోపు ఉండాలి. Format: JPG / JPEG / PNG / PDF మాత్రమే valid.
6. Aadhaar లో పేరు, Voter Card లో పేరు వేర్వేరుగా ఉంటే ఏమి చేయాలి?
ముందుగా Form 8 లో “Correction of Entries” ద్వారా పేరు సరిచేసుకున్న తర్వాత address change కు apply చేయాలి.
7. రెండు చోట్ల ఓటర్‌గా ఉంటే ఏమవుతుంది?
ఇది చట్టప్రకారం నేరం. అందుకే పాత నియోజకవర్గం నుండి పేరు తొలగించి కొత్త చోట చేర్చుకోవడం తప్పనిసరి.
8. కొత్త EPIC Card ఎప్పుడు వస్తుంది?
Approval తర్వాత కొత్త EPIC Card postal ద్వారా మీ కొత్త చిరునామాకు అందుతుంది.
ముఖ్యమైన Links | Important Links
| Portal / Service | Details |
|---|---|
| Voter Helpline Portal | Voter Services Portal (Official Website) |
| Voter Helpline App | ECINET |
| Toll Free Number | 1950 |
Related Articles
కొత్త ఓటర్ కార్డ్ కు అప్లై చేయుటకు Online Guide 2026ఓటర్ కార్డ్ ను డౌన్లోడ్ online Telugu 2026
ఓటర్ కార్డ్ లో పేరు ను సవరించుట Online 2026
ఓటర్ కార్డ్ లో ఫోటో అప్డేట్ Online 2026
సారాంశం | Conclusion
Voter ID Address Change Outside Constituency Telugu 2026 — ఇప్పుడు మీకు పూర్తిగా అర్థమైందని భావిస్తున్నాం. వేరే నియోజకవర్గంలో ఇల్లు మారినప్పుడు Form 8 ద్వారా Shifting of Residence చేయడం ఇప్పుడు చాలా సులభం — Online లేదా Offline రెండు పద్ధతుల్లో చేయవచ్చు.
సరైన Aadhaar మరియు EPIC details సిద్ధంగా ఉంటే, Online application 10–15 నిమిషాల్లో పూర్తి చేయవచ్చు. Approval కి సాధారణంగా 15–30 రోజులు పడుతుంది.
ఈ గైడ్ అధికారికంగా Election Commission of India విడుదల చేసిన మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడింది. తాజా 2026 Form 8 విధానం ప్రకారం వివరాలు అందించబడ్డాయి. దయచేసి అప్లై చేసే ముందు అధికారిక పోర్టల్ లో తాజా సూచనలు పరిశీలించండి.
ఈ పోస్ట్ మీకు ఉపయోగపడిందా? మీ friends మరియు family తో share చేయండి. Government Schemes , Application Process and other useful information కి సంబంధించిన మరిన్ని సేవల కోసం మా Web site esachivalayam.in ను follow చేయండి.