Voter ID Address Change Online Telugu 2026 – అదే నియోజకవర్గంలో (Same Constituency) ఇల్లు మారినప్పుడు Form 8 ద్వారా చిరునామా మార్పు పూర్తి గైడ్

మీరు అదే నియోజకవర్గంలో ఇల్లు మారారా? కానీ మీ Voter ID Card లో ఇంకా పాత చిరునామానే ఉందా? అయితే వెంటనే Voter ID లో Address Change చేయడం అవసరం. ఎందుకంటే మీరు కొత్త ఇంటికి మారినప్పుడు Polling Booth కూడా మారే అవకాశం ఉంటుంది. ఈ ఆర్టికల్ లో Voter ID Address Change Telugu 2026 process ను Form 8 ద్వారా step-by-step గా వివరించాం. Election Commission of India అందించే అధికారిక Voter Services Portal ద్వారా ఈ సేవను పూర్తి ఉచితంగా (Free) online లో చేయవచ్చు.

Voter ID Address Change Online Telugu 2026 Form 8 ద్వారా చిరునామా మార్పు పూర్తి గైడ్

Quick Summary — Voter ID Address Change Telugu 2026

DetailsInformation
Time Required10–15 నిమిషాలు
Feeపూర్తిగా ఉచితం (Free)
FormForm 8
PortalVoter Services Portal 
Processing Time15 –30 రోజులు
Helpline1950 (Free, 24×7)

Voter ID Address Correction vs Shifting — తేడా ఏమిటి?

Form 8 లో Address Update కు మూడు వేర్వేరు పరిస్థితులు ఉంటాయి. మీ పరిస్థితికి సరిపోయే option ను ఎంపిక చేయాలి. క్రింది పట్టికలో వాటి మధ్య తేడాలను చూడండి.

FeatureAddress CorrectionShifting Within ConstituencyShifting Outside Constituency
ఉద్దేశ్యంఇప్పటికే ఉన్న చిరునామాలో అక్షర దోషం లు (Spelling Mistakes) లేదా కొన్ని పదలను సరిదిద్దడం.అదే అసెంబ్లీ నియోజకవర్గంలో కొత్త ఇంటికి మారడం.వేరే అసెంబ్లీ నియోజకవర్గానికి లేదా వేరే రాష్ట్రానికి మారడం.
Form లో SelectionForm 8 → “Correction of Entries”Form 8 → “Shifting of Residence” (Within AC)Form 8 → “Shifting of Residence” (Outside AC)
EPIC Numberఅదే ఉంటుందిఅదే ఉంటుందిఅదే ఉంటుంది
Voter List పై ప్రభావంఉన్న entry అప్‌డేట్ అవుతుంది.పేరు కొత్త Booth / Part కి ట్రాన్స్ఫర్ అవుతుంది.పాత list నుండి తొలగించబడి కొత్త list లో చేర్చబడుతుంది.
అవసరమైన Proofసరైన చిరునామా చూపించే document.ప్రస్తుత కొత్త నివాసం యొక్క Proof.కొత్త ప్రాంతంలో నివాసం యొక్క Proof.

గమనిక: మీరు అదే ఇంట్లో ఉంటూ Voter Card లో చిరునామా spelling తప్పుగా ఉంటే —Address Correction ఎంచుకోండి. ఇల్లు మారారంటే —Shifting ఎంచుకోండి.

ప్రస్తుత చిరునామా తప్పుగా ఉండి, లేద Address డీటైల్స్ లో అక్షర దోషం లు (Spelling Mistakes) ఉంటే, ఓటర్ ID లో చిరునామా సవరించుట పూర్తి స్టెప్ బై స్టెప్ గైడ్ ద్వారా సరిచేసుకోగలరు.

Voter ID లో Address Change ఎందుకు అవసరం?

మీరు అదే నియోజకవర్గంలో ఇల్లు మారినప్పుడు Voter ID లో కొత్త చిరునామా update చేయడం చాలా అవసరం:

  • సరైన Polling Booth వద్ద Verification సులభం అవుతుంది.
  • మీ పేరు సరైన Booth / Part కి ట్రాన్స్ఫర్ అవుతుంది.
  • Voter Card ని గుర్తింపు కార్డ్ గా వాడినప్పుడు Address mismatch సమస్యలు రావు.
  • ప్రభుత్వ పథకాల లబ్ధి పొందేందుకు Address proof గా ఉపయోగపడుతుంది.
  • డిజిటల్ e-EPIC Card డౌన్‌లోడ్ చేసుకోవడం సులభమవుతుంది.

Form 8 అంటే ఏమిటి? | Form 8 Online Apply Telugu

Form 8 అనేది ఓటర్ కార్డ్‌లో ఉన్న వివరాలను సరిదిద్దడానికి ఉపయోగించే అధికారిక ఫారం. ఇది Election Commission of India ద్వారా అందించబడుతుంది. Election Commission Mobile Number Update or Add కోసం Form 8 అధికారిక ఫారం. దీన్నే “Correction of Entries in Electoral Roll” form అంటారు.

Form 8 ద్వారా మీరు:

  • పేరు సరిదిద్దుకోవచ్చు.
  • పుట్టిన తేదీ మార్చుకోవచ్చు.
  • అడ్రస్ సరిచేయవచ్చు.
  • ఫోటో అప్డేట్ చేయవచ్చు.
  • మొబైల్ నంబర్ Add లేదా మార్చుకోవచ్చు.

Voter ID Address Change కు అవసరమైన Documents

Form 8 Voter ID Address Change Online కోసం ఈ క్రింది documents సిద్ధంగా ఉంచుకోవాలి: (Election Commission of India నిర్దేశించిన documents ఇవి).

  • EPIC Number (మీ Voter ID Number). ఒకవేళ మీ వద్ద Voter Card లేకపోయినా లేదా Voter Card Number తెలియక పోయిన చింతించాల్సిన అవసరం లేదు Electoral Roll Search ద్వారా ఎలా తెలుసుకోవాలో ఈ గైడ్ లో వివరించబడింది.
  • Aadhaar Number (eSign కోసం).
  • Mobile Number – Aadhaar తో లింక్ అయినది (OTP verification కోసం).
  • చిరునామా రుజువు పత్రం (కింది వాటిలో ఏదైనా ఒకటి):
    • ఆధార్ కార్డు.
    • పాస్‌పోర్ట్.
    • డ్రైవింగ్ లైసెన్స్.
    • విద్యుత్ బిల్లు / నీటి బిల్లు.
    • రేషన్ కార్డ్.
    • బ్యాంక్ పాస్‌బుక్ (ఫోటో తో).
    • అద్దె ఒప్పందం.
    • ఆస్తి పన్ను రశీదు.
  • గమనిక: eSign ప్రక్రియ పూర్తి చేయాలంటే, మీ ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్ తప్పనిసరిగా active గా ఉండాలి. అలాగే, ఆధార్‌లో ఉన్న పేరు మరియు ఓటర్ కార్డ్‌లో ఉన్న పేరు పూర్తిగా ఒకే విధంగా ఉండాలి.
    • Aadhaar Mobile Link లేకపోతే:
      మీ ఆధార్‌కు మొబైల్ నంబర్ లింక్ చేయబడకపోతే లేదా ఇప్పటికే లింక్ అయిన నంబర్‌ను మార్చుకోవాలనుకుంటే, Unique Identification Authority of India (UIDAI) 2026 నియమాల ప్రకారం రూపొందించిన ఆధార్ మొబైల్ నెంబర్ లింక్ / మార్చుట 2026 పూర్తి గైడ్ సహాయం తో ముందుగా Aadhaar Mobile Number Update పూర్తి చేసుకోండి.
    • పేరు సరిపోకపోతే:
      • ఒకవేళ ప్రస్తుతం మీ ఓటర్ కార్డ్‌లో ఉన్న పేరు, ఆధార్‌లో ఉన్న పేరుతో ఒకే విధంగా లేకపోతే, మొదటిగా ఫారం 8 లో ఉన్న Correction of Entries in Existing Electoral Roll ఆప్షన్ ద్వారా పేరు ను ఆధార్ కార్డ్ లో ఉన్న విదం గా మార్చుకోవాలి. అప్పుడు మాత్రమే మనం eSign ద్వారా అప్లికేషన్ సబ్మిట్ చేయగలం.
      • Voter Card లో పేరు సరిచేయడం ఎలా – పూర్తి గైడ్
    • eSign చేయలేని పరిస్థితిలో:
      • ఒకవేళ మీ ఆధార్‌కు మొబైల్ నెంబర్ లింక్ లేకపోవడం లేదా పేరు సవరణకు సమయం లేకపోతే, ఈ ఆర్టికల్‌లో వివరించిన Step 6 వరకు ఉన్న ప్రక్రియను అనుసరించి, ఫిల్ చేసిన అప్లికేషన్‌ను Download చేసుకుని మీ BLO / ERO కు సమర్పించవచ్చు. ఈ విధానంలో Aadhaar eSign అవసరం ఉండదు.
      • అయితే, మొబైల్ నెంబర్‌ను ఆధార్‌కు లింక్ చేయడం మరియు పేరు సవరించుకోవడం తర్వాత eSign ద్వారా అప్లికేషన్ సమర్పించడం ఉత్తమమైన విధానం. ఈ విధానంలో BLO / ERO కి భౌతికంగా ఏ విధమైనా డాక్యుమెంట్ సమర్పించవలసిన పని లేదు.
  • అప్లోడ్ చేయబోయే డాక్యుమెంట్ కాపీ క్రింది భాగంలో మీ సంతకం చేసి 2 MB లోపాల స్పష్టంగా PDF లేద JPEG రూపం లో అప్లోడు చెయ్యాలి.

Voter ID Address Change Online Telugu 2026 Step-by-Step Process (Form 8) — చిరునామా మార్పు ప్రక్రియ

Step 1: Voter Service Portal లో Login లేద Sign-UP అవ్వండి

Voter Service Portal లో Login మరియు Sign-UP చేయడం ఎలా - Step 1

Form 8 online apply Telugu లో చేయడానికి మొదట మీ browser లో Voter Services Portal ను తెరవండి.

కొత్త User అయితే (Sign-UP):

  • Sign-UP ఆప్షన్ పై క్లిక్ చెయ్యాలి.
  • Mobile Number, Email ID (తప్పనిసరి కాదు) మరియు Captcha నమోదు చేసి Continue పై క్లిక్ చెయ్యాలి.
  • తరువాత పేజిలో First Name మరియు Last Name నమోదు చేసి Resend OTP పై క్లిక్ చెయ్యాలి.
  • మీ ఫోన్ కి వచ్చిన OTP ని verify చేసి Register అవ్వగలరు.

ఇప్పటికే Account ఉంటే (Login):

  • Login ఆప్షన్ పై క్లిక్ చేసి Mobile Number / Email ID / EPIC No మరియు Captcha నమోదు చేసి Request OTP పై క్లిక్ చెయ్యాలి.
  • OTP verify చేసి Portal లో Login అవ్వగలరు.

Step 2: Correction Of Entries (Form 8) ను ఎంపిక చెయ్యండి

Voter Service Portal లో Form 8 Correction of Entries ఎంపిక చేయడం - Step 2
  • Voter Service Portal dashboard లో Fill Form 8 పై క్లిక్ చెయ్యాలి.
  • తుదిపరి పేజి లో Application For Self or Other elector అని అడుగుతుంది. ఇక్కడ Self ను ఎంపిక చేసుకోండి. ఒకవేళ మీరు మీ వెరే వల్ల Voter card లో Mobile Number మార్పు చేయాలనుకుంటే Other elector ను ఎంపిక చేసుకోవాలి.
  • EPIC నెంబర్ ఎంటర్ చేసి Submit పై క్లిక్ చెయ్యండి.
    • ఒకవేళ మీకు మీ EPIC Number తెలియకపోతే, మీ “వివరాలు లేక ఫోన్ నెంబర్” తో Electoral Roll Search ద్వారా తెలుసుకోగలరు.
      Search in Electoral Roll
  • తుదిపరి పేజి లో మీకు Electoral Roll లో ఉన్న మీ డీటైల్స్ కనిపిస్తాయి, ఒకసారి verify చేసి ok పై క్లిక్ చెయ్యండి.

Step 3: Shifting of Residence ను ఎంపిక చేయండి

Voter ID Address Change Form 8 Step 3 Shifting of Residence ఎంపిక చేసే విధానం
  • ఈ పేజి లో “Application for” వద్ద “Shifting of Residence” ను టిక్ చేసి, తరువాత “Within Assembly Constituency” ను ఎంపిక చేసి క్రింద ఉన్న OK పై క్లిక్ చేయండి.
  • మీకు కావాలనుకుంటే ఇక్కడ నుండి Application ను తెలుగులో కూడా ఫిల్ చేయవచ్చు. అప్లికేషన్ ఫారమ్ కుడి పై భాగంలో Language Change ఆప్షన్ ఉంటుంది. అక్కడ నుండి భాషను తెలుగు గా మార్చుకోవచ్చు. ఒకవేళ మీరు ఇంగ్లీష్ లోనే కొనసాగాలనుకుంటే అలాగే వదిలేయవచ్చు.

Step 4: Personal Details నమోదు చెయ్యండి

A. State, District & Assembly/Parliamentary Constituency వద్ద details already fill అయ్యి ఉంటాయి — వాటిని ఒకసారి verify చేసుకొని Next పై క్లిక్ చెయ్యాలి.

B. Details వద్ద: (తప్పనిసరి కాదు)

  • మీ పేరు మరియు EPIC నంబర్ already fill అయ్యి ఉంటుంది.
  • Aadhaar Number వద్ద టిక్ చేసి Aadhaar నంబర్ ఎంటర్ చెయ్యండి.
  • Mobile Number మరియు Email (తప్పనిసరి కాదు) వద్ద మీ details ఎంటర్ చేసి Next పై క్లిక్ చెయ్యాలి.

C. I Submit application for దగ్గర “Shifting of Residence” select చేసి ఉంటుంది.

Step 5: కొత్త చిరునామా నమోదు చేయండి మరియు Address Proof Upload చేయండి

Voter ID Address Change Form 8 Step 5 కొత్త చిరునామా నమోదు చేసి Address Proof Upload చేసే విధానం
  • Application for Shifting of Residence దగ్గర:
    • మీ ఇంటి నెంబర్, వీధి పేరు, గ్రామం లేదా పట్టణం పేరు, పోస్ట్ ఆఫీస్ ఉన్న ఊరి పేరు, పిన్ కోడ్, మండలం మరియు జిల్లా పేరును మీరు అప్లోడ్ చేస్తున్న సపోర్టింగ్ డాక్యుమెంట్‌లో ఉన్న విధంగానే ఖచ్చితంగా నమోదు చేయాలి.
  • Document Name దగ్గర మీ వద్ద ఉన్న Supporting Document Name ను డ్రాప్ డౌన్ లిస్ట్ లో ఎంపికచేసుకోని, పక్కన Upload Address Proof  దగ్గర అప్లోడు చెయ్యాలి.
    • గమనిక:
      • డాక్యుమెంట్ కాపీ పై మీ సంతకం చేసి సైజ్ 2 MB లోపు , JPG / JPEG / PNG / PDF రూపం లో అప్లోడు చెయ్యాలి. PDF రూపం లో అప్లోడు చెయ్యడం ఉత్తమం.
      • అప్లికెంట్ పేరు మీద లేదా మారాలనుకుంటున్న అదే చిరునామాలో ఇప్పటికే ఓటర్‌గా నమోదైన తల్లిదండ్రులు / భార్య లేదా భర్త / పెద్దవయసు పిల్లలలో ఎవరి పేరులోనైనా ఉన్న Address Proof యొక్క Self-Attested Copy ను అప్లోడ్ చేయాలి.
  • తరువాత Next పై click చెయ్యండి.

Step 6: Declaration

  • D. Declaration వద్ద Declaration పూర్తి గా చదివి Place దగ్గర మీ ఊరి పేరు నమోదు చేసి Next పై click చెయ్యండి.
  • E. Submission దగ్గర Captcha  నమోదు చెసి Preview and Submit పై క్లిక్ చెయ్యండి. తరువాత పేజి లో మీకు మనం ఇప్పటి వరకు నమోదు చేసిన డీటైల్స్ కనిపిస్తాయి, వాటిని ఒకసారి verify చేసుకొని, తప్పులు ఉంటే Keep Editing పై క్లిక్ చేసి సరిచేయండి లేకపోతే Download పై క్లిక్ చేసి Application సేవ్ చేసుకొని eSign & Submit పై క్లిక్ చెయ్యండి.
  • గమనిక: eSign ప్రక్రియ పూర్తి చేయాలంటే, మీ ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్ తప్పనిసరిగా Active గా ఉండాలి. అలాగే, ఆధార్‌లో ఉన్న పేరు మరియు ఓటర్ కార్డ్‌లో ఉన్న పేరు పూర్తిగా వరుస క్రమం మరియు స్పెల్లింగ్ తో సహ ఒకే విధంగా ఉండాలి. ఒకవేళ ఈ రెండు సరిపోలకపోతే, మీరు ఫిల్ చేసిన అప్లికేషన్‌ను Download చేసుకుని మీ BLO / ERO కు సమర్పించవచ్చు. ఈ విధానంలో Aadhaar eSign అవసరం ఉండదు మరియు అప్లికేషన్ భౌతికంగా (Physical Verification) ధృవీకరించబడుతుంది.
  • గమనిక: మీ ఆధార్‌కు మొబైల్ నంబర్ లింక్ అయి ఉండి, అలాగే ఆధార్‌లో ఉన్న పేరు మరియు ఓటర్ కార్డ్‌లో ఉన్న పేరు వరుస క్రమం మరియు స్పెల్లింగ్ తో సహ ఒకే విధంగా సరిపోతే, eSign ప్రక్రియను ఫాలో అవ్వాలి. ఈ విధానంలో అప్లికేషన్ ఆన్‌లైన్‌లోనే వెరిఫికేషన్ జరుగుతుంది మరియు భౌతిక ధృవీకరణ (Physical Verification) అవసరం ఉండదు. eSign పేజీకి చేరుకోవడానికి కొంత సమయం పడవచ్చు. అందువల్ల దయచేసి కొద్దిసేపు వేచి ఉండాలి. ఈ సమయంలో Back, Cancel లేదా Reload / Refresh చేయకూడదు. eSign పేజీ పూర్తిగా ఓపెన్ అయ్యే వరకు వేచి ఉండాలి.

Step 7: Aadhaar OTP తో eSign & Submit చేయండి

Form 8 Aadhaar OTP ద్వారా eSign చేసి Submit చేయడం - Voter Card Name Correction Step 7
  • ఈ పేజి లో Enter Aadhaar వద్ద మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి Get OTP పై క్లిక్ చెయ్యాలి.
  • Enter Your Aadhaar OTP వద్ద మీ Mobile కి వచ్చిన OTP ఎంటర్ చేసి, క్రింద “I hereby state” పక్కన ఉన్న బాక్స్ పై టిక్ చేసి Submit పై క్లిక్ చెయ్యాలి.
  • ఈ పేజి లో మీకు Reference Number వస్తుంది, ఆ నెంబర్ ని Save చేసుకొని, Download Acknowledgement పై క్లిక్ చేసి Acknowledgement Slip ని save చేసుకోవాలి.
  • ఇక్కడి తో Voter ID లేక EPIC card Voter ID Address correction process 2026 విజయవంతం గా పూర్తి అవుతుంది. Reference Number సహాయంతో మన Application status ను తెలుసుకోవోచ్చు .

Track Voter ID Address Update Application Status

  1. Voter Services Portal (Official Website)
    వెబ్‌సైట్‌ ను ఓపెన్ చేసి. Mobile నెంబర్ సహాయం తో లాగిన్ అవ్వండి.
  2. Voter Service Portal Dashboard లో “Track Application Status” ను ఎంపిక చేసుకోండి.
  3. మీ Reference Number లేదా Mobile Number ఎంటర్ చెసి, Submit పై క్లిక్ చెయ్యాలి.
  4. స్టేటస్ తక్షణమే కనిపిస్తుంది.

లేదా నేరుగా కాల్ చేయండి: 1950 (Voter Helpline — ఉచితం, 24×7)

Address Update తర్వాత ఎంత సమయం పడుతుంది?

  • 15 – 30 రోజులు పడుతుంది.
  • BLO వెరిఫికేషన్ తర్వాత అప్రూవల్ జరుగుతుంది.
  • Approval తర్వాత కొత్త EPIC Card postal ద్వారా అందుతుంది.

సాధారణ తప్పులు – వీటిని జాగ్రత్తగా చేయండి

  • కొత్త చిరునామా Address Proof Document లో స్పష్టంగా ఉందో confirm చేసుకోండి.
  • Upload చేసే document స్పష్టంగా చదవగలిగేలా ఉండాలి.
  • Reference Number మరియు Acknowledgement Slip save చేసుకోండి.
  • తప్పుడు format లో document upload చేయడం (JPG / JPEG / PNG / PDF మాత్రమే valid).
  • File size 2MB కంటే ఎక్కువ ఉండటం — compress చేయండి.
  • Aadhaar తో link కాని Mobile Number use చేయడం (eSign fail అవుతుంది).
  • Wrong EPIC Number ఎంటర్ చేయడం.
  • తప్పుడు documents సమర్పించడం — ఇది చట్టప్రకారం నేరం.

Application Reject అయ్యే కారణాలు

  • Aadhaar OTP verify కాకపోవడం.
  • Wrong EPIC Number.
  • సాంకేతిక కారణాలు వలన.

Offline లో Voter Card చిరునామా సవరణ ఎలా చేయాలి?

Internet access లేకపోయినా లేదా online process నచ్చకపోతే, offline voter card Address change కూడా చేయవచ్చు.

Step 1: Form 8 తీసుకోండి

  • Voter Services Portal (Official Website) వెబ్‌సైట్‌ లో Form 8 Download చేసుకోవోచ్చు .
  • లేదా దగ్గర్లో ఉన్న BLO (Booth Level Officer) దగ్గర తీసుకోండి

Step 2: Form Fill చేయండి

  • అన్ని details clearly blue/black pen తో రాయండి.
  • Shifting of Residence — Within Same Constituency ఎంపిక చేసి కొత్త చిరునామా వివరాలు రాయండి.
  • Photo section లో కొత్త passport size ఫోటో అతికించండి.
  • Signature వేయండి.

Step 3: Submit చేయండి

  • మీ BLO దగ్గర లేదా Electoral Registration Office (ERO) లో submit చేయండి.
  • Acknowledgment receipt తప్పకుండా తీసుకోండి.

తరచూ అడిగే ప్రశ్నలు | FAQ – Voter Card Address Change Telugu

Q1: Voter ID లో Address Change చేయడానికి fee అవుతుందా?

ఎటువంటి fee అవసరం లేదు. ఇది పూర్తిగా ఉచితం (Free). Election Commission of India ఈ సేవను నిరామయంగా అందిస్తుంది.

Q2: Address Change తర్వాత కొత్త EPIC Card వస్తుందా?

అవును. Address Change తర్వాత BLO Approval పొందిన తర్వాత నూతన EPIC Card జారీ అవుతుంది. అది postal ద్వారా మీ కొత్త చిరునామాకు వస్తుంది.

Q3: Address Change కి ఏ documents upload చేయాలి?

Aadhaar Card, Electricity Bill, Ration Card, Driving Licence, Passport, Bank Passbook, Rent Agreement లేదా Property Tax Receipt — వీటిలో ఏదైనా ఒకటి JPG / JPEG / PNG / PDF format లో, 2MB కంటే తక్కువగా upload చేయాలి. document కొత్త చిరునామాతో ఉండాలి.

Q4: Aadhaar తో Mobile Number link లేకపోతే ఏం చేయాలి?

ముందు Aadhaar తో Mobile Number link చేయించుకోండి. తర్వాత Form 8 online submit చేయండి. లేదా online లో Step 6 వరకు fill చేసి application download చేసుకుని offline BLO దగ్గర submit చేయవచ్చు.

Q5: నేను అదే నియోజకవర్గంలో ఇల్లు మారాను — Correction చేయాలా Shifting చేయాలా?

మీరు ఇల్లు మారినట్లయితే — తప్పకుండా Shifting of Residence ఎంచుకోవాలి, Address Correction కాదు. Correction అంటే అదే ఇంట్లో ఉంటూ spelling తప్పు సరిచేయడం మాత్రమే.

Q6: Processing time ఎంత ఉంటుంది?

BLO Verification తర్వాత సాధారణంగా 15–30 రోజుల్లో Approval జరుగుతుంది. ఎన్నికల సీజన్ లో కొంచెం ఆలస్యం కావచ్చు.

Q7: Shifting తర్వాత నా పాత Polling Booth మారుతుందా?

అవును. అదే నియోజకవర్గంలో అయినా కొత్త చిరునామా బట్టి మీ పేరు కొత్త Booth / Part కి Transpose అవుతుంది. అందుకే address update చేయడం చాలా ముఖ్యం.

ముఖ్యమైన Links | Important Links

Portal / ServiceDetails
Voter Helpline PortalVoter Services Portal (Official Website)
Voter Helpline AppECINET
Toll Free Number1950

Related Articles

కొత్త ఓటర్ కార్డ్ కు అప్లై చేయుటకు Online Guide 2026
ఓటర్ కార్డ్ ను డౌన్లోడ్ online Telugu 2026
ఓటర్ కార్డ్ లో పేరు ను సవరించుట Online 2026
ఓటర్ కార్డ్ లో ఫోటో అప్డేట్ Online 2026

సారాంశం | Conclusion

Voter ID Address Change Telugu 2026 — ఇప్పుడు మీకు పూర్తిగా అర్థమైందని భావిస్తున్నాం. అదే నియోజకవర్గంలో ఇల్లు మారినప్పుడు Form 8 ద్వారా Shifting of Residence చేయడం ఇప్పుడు చాలా సులభం — Online లేదా Offline రెండు పద్ధతుల్లో చేయవచ్చు.

సరైన Aadhaar మరియు EPIC details సిద్ధంగా ఉంటే, Online application 10–15 నిమిషాల్లో పూర్తి చేయవచ్చు. Approval కి సాధారణంగా 15–30 రోజులు పడుతుంది.

మీరు కొత్త ఇంటికి మారారా? ఇప్పుడే Apply చేయండి — మీ ఓటు హక్కు సురక్షితంగా వాడుకోవాలంటే మీ Voter ID తాజాగా ఉండాలి!

ఈ గైడ్ అధికారికంగా Election Commission of India విడుదల చేసిన మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడింది. తాజా 2026 Form 8 విధానం ప్రకారం వివరాలు అందించబడ్డాయి. దయచేసి అప్లై చేసే ముందు అధికారిక పోర్టల్ లో తాజా సూచనలు పరిశీలించండి.


ఈ పోస్ట్ మీకు ఉపయోగపడిందా? మీ friends మరియు family తో share చేయండి. Government Schemes , Application Process and other useful information కి సంబంధించిన మరిన్ని సేవల కోసం మా Web site esachivalayam.in ను follow చేయండి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top