Voter Card Photo Update Online Telugu 2026 – Form 8 ద్వారా Voter ID Photo Change పూర్తి స్టెప్ బై స్టెప్ గైడ్

మీ Voter Card లో ఉన్న ఫోటో స్పష్టంగా లేదా ? పాతది గా ఉందా? కొత్త ఫోటో అప్డేట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ పూర్తి గైడ్ మీకోసమే. ఈ ఆర్టికల్ లో Voter Card Photo Update Online Telugu 2026 process ను Form 8 ద్వారా step-by-step గా వివరించాం. Election Commission of India అందించే అధికారిక Voter Services Portal  ద్వారా ఈ సేవ పూర్తిగా ఉచితం .

Voter Card Photo Update Online Telugu 2026 Form 8 Process with Aadhaar OTP

Quick Summary — Voter ID Photo Change Telugu 2026

DetailsInformation
Time Required10–15 నిమిషాలు
Feeపూర్తిగా ఉచితం (Free)
FormForm 8
PortalVoter Services Portal 
Processing Time15–30 రోజులు, కొన్ని సార్లు ముందుగానే ప్రాసెస్ చేయబడుతుంది.
Helpline1950 (Free, 24×7)

Voter Card లో Photo Update ఎందుకు అవసరం?

మీ Voter ID Card లో ఫోటో తాజాగా ఉంటే అనేక ప్రయోజనాలు ఉన్నాయి:

  • Polling Booth వద్ద verification సులభం అవుతుంది.
  • Voter Card ని ఇతర Identity సేవలకు ఉపయోగించినప్పుడు Identity mismatch సమస్యలు రావు.
  • Duplicate voter సమస్యలు తగ్గుతాయి.
  • Future corrections సులభం గా చేసుకోవవచ్చు.
  • అధికారిక records లో మీ current appearance నమోదు అవుతుంది.

Form 8 అంటే ఏమిటి? | Form 8 Online Apply Telugu

Form 8 అనేది ఓటర్ కార్డ్‌లో ఉన్న వివరాలను సరిదిద్దడానికి ఉపయోగించే అధికారిక ఫారం. ఇది Election Commission of India ద్వారా అందించబడుతుంది. Election Commission Mobile Number Update or Add కోసం Form 8 అధికారిక ఫారం. దీన్నే “Correction of Entries in Electoral Roll” form అంటారు.

Form 8 ద్వారా మీరు:

  • పేరు సరిదిద్దుకోవచ్చు.
  • పుట్టిన తేదీ మార్చుకోవచ్చు.
  • అడ్రస్ సరిచేయవచ్చు.
  • ఫోటో అప్డేట్ చేయవచ్చు.
  • మొబైల్ నంబర్ Add లేదా మార్చుకోవచ్చు.

EPIC card Photo Update కి కావలసిన Documents

Form 8 Voter ID Card Photo Change Online కోసం ఈ క్రింది డాక్యుమెంట్స్‌ సిద్దం గా ఉంచుకోవాలి (Election Commission of India నిర్దేశించిన documents ఇవి).

  • EPIC Number (మీ Voter ID Number). ఒకవేళ మీ వద్ద Voter Card లేకపోయినా లేదా Voter Card Number తెలియక పోయిన చింతించనవసారం లేదు Electoral Roll Search ద్వారా ఎలా తెలుసుకోవలో ఈ గైడ్ లో వివరించబడింది.
  • Aadhaar Number (eSign కోసం).
  • Mobile Number – Aadhaar తో లింక్ అయినది (OTP verification కోసం).
  • New Passport Size Photo
    • JPG/JPEG format.
    • 4.5 cm X 3.5 cm సైజు.
    • 2MB లోపు.
    • తెల్లని background.
    • మొహం స్పష్టంగా కనిపించాలి.
    • కళ్ళద్దాలు ఉండరాదు.
  • గమనిక: eSign ప్రక్రియ పూర్తి చేయాలంటే, మీ ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్ తప్పనిసరిగా active గా ఉండాలి. అలాగే, ఆధార్‌లో ఉన్న పేరు మరియు ఓటర్ కార్డ్‌లో ఉన్న పేరు పూర్తిగా ఒకే విధంగా ఉండాలి.
    • Aadhaar Mobile Link లేకపోతే:
    • పేరు సరిపోకపోతే:
      • ఒకవేళ ప్రస్తుతం మీ ఓటర్ కార్డ్‌లో ఉన్న పేరు, ఆధార్‌లో ఉన్న పేరుతో ఒకే విధంగా లేకపోతే, Application for Correction of Entries in Existing Electoral Roll లో Name ఎంపికను కూడా సెలెక్ట్ చేసి Photo తో పాటుగా పేరు కూడా సరిచేసుకునేలా అప్లికేషన్ సమర్పించాలి.
    • eSign చేయలేని పరిస్థితిలో:
      • ఒకవేళ మీ ఆధార్‌కు మొబైల్ నెంబర్ లింక్ లేకపోవడం లేదా పేరు సవరణకు సమయం లేకపోతే, ఈ ఆర్టికల్‌లో వివరించిన Step 6 వరకు ఉన్న ప్రక్రియను అనుసరించి, ఫిల్ చేసిన అప్లికేషన్‌ను Download చేసుకుని మీ BLO / ERO కు సమర్పించవచ్చు. ఈ విధానంలో Aadhaar eSign అవసరం ఉండదు.
      • అయితే, మొబైల్ నెంబర్‌ను ఆధార్‌కు లింక్ చేయడం మరియు పేరు సవరించుకోవడం తర్వాత eSign ద్వారా అప్లికేషన్ సమర్పించడం ఉత్తమమైన విధానం. ఈ విధానంలో BLO / ERO కి భౌతికంగా ఏ విధమైనా డాక్యుమెంట్ సమర్పించవలసిన పని లేదు.

Voter Card Photo Update Online Telugu 2026 Step-by-Step Process (Form 8)

Step 1: Voter Service Portal లో Login లేద Sign-UP అవ్వండి

Voter Service Portal లో Login మరియు Sign-UP చేయడం ఎలా - Step 1

Form 8 online apply Telugu లో చేయడానికి మొదట మీ browser లో Voter Services Portal ను తెరవండి.

కొత్త User అయితే (Sign-UP):

  • Sign-UP ఆప్షన్ పై క్లిక్ చెయ్యాలి.
  • Mobile Number, Email ID (తప్పనిసరి కాదు) మరియు Captcha నమోదు చేసి Continue పై క్లిక్ చెయ్యాలి.
  • తరువాత పేజిలో First Name మరియు Last Name నమోదు చేసి Resend OTP పై క్లిక్ చెయ్యాలి.
  • మీ ఫోన్ కి వచ్చిన OTP ని verify చేసి Register అవ్వగలరు.

ఇప్పటికే Account ఉంటే (Login):

  • Login ఆప్షన్ పై క్లిక్ చేసి Mobile Number / Email ID / EPIC No మరియు Captcha నమోదు చేసి Request OTP పై క్లిక్ చెయ్యాలి.
  • OTP verify చేసి Portal లో Login అవ్వగలరు.

Step 2: Correction Of Entries (Form 8) ను ఎంపిక చెయ్యండి

Voter Service Portal లో Form 8 Correction of Entries ఎంపిక చేయడం - Step 2
  • Voter Service Portal dashboard లో Fill Form 8 పై క్లిక్ చెయ్యాలి.
  • తుదిపరి పేజి లో Application For Self or Other elector అని అడుగుతుంది. ఇక్కడ Self ను ఎంపిక చేసుకోండి. ఒకవేళ మీరు మీ వెరే వల్ల Voter card లో ఫోటో మార్పు చేయాలనుకుంటే Other elector ను ఎంపిక చేసుకోవాలి.
  • EPIC నెంబర్ ఎంటర్ చేసి Submit పై క్లిక్ చెయ్యండి.
    • ఒకవేళ మీకు మీ EPIC Number తెలియకపోతే, మీ “వివరాలు లేక ఫోన్ నెంబర్” తో Electoral Roll Search ద్వారా తెలుసుకోగలరు.
      Search in Electoral Roll
  • తుదిపరి పేజి లో మీకు Electoral Roll లో ఉన్న మీ డీటైల్స్ కనిపిస్తాయి, ఒకసారి verify చేసి ok పై క్లిక్ చెయ్యండి.

Step 3: Correction of Entries in Existing Electoral Roll ఎంపిక చేయండి

Form 8 లో Correction of Entries in Existing Electoral Roll సెలెక్ట్ చేయడం - Step 3

ఈ పేజి లో Application for దగ్గర “Correction of Entries in Existing Electoral Roll” ని టిక్ చేసి క్రింద ఉన్న ok పై క్లిక్ చెయ్యండి.

Step 4: Personal Details నమోదు చెయ్యండి

A. State, District & Assembly/Parliamentary Constituency వద్ద details already fill అయ్యి ఉంటాయి — వాటిని ఒకసారి verify చేసుకొని Next పై క్లిక్ చెయ్యాలి.

B. Details వద్ద: (తప్పనిసరి కాదు)

  • మీ పేరు మరియు EPIC నంబర్ already fill అయ్యి ఉంటుంది.
  • Aadhaar Number వద్ద టిక్ చేసి Aadhaar నంబర్ ఎంటర్ చెయ్యండి.
  • Mobile Number మరియు Email (తప్పనిసరి కాదు) వద్ద మీ details ఎంటర్ చేసి Next పై క్లిక్ చెయ్యాలి.

C. I Submit application for దగ్గర “Correction of Entries in Existing Electoral Roll” select చేసి ఉంటుంది.

Step 5: Photo Update Option ఎంపిక చేయండి మరియు Photo Upload చేయండి

Form 8 Photo Upload Option in Voter Services Portal for Voter ID Photo Change
  • Application for Correction of Entries in Existing Electoral Roll దగ్గర Photo వద్ద టిక్ చెయ్యండి.
    • గమనిక: “Application for Correction of Entries in Existing Electoral Roll” ఆప్షన్ ద్వారా మనం ఒకేసారి 4 Voter Updates కి అప్లై చేయగలం. ఒకవేళ మీరు Photo తో పాటుగా ఇతర డీటైల్స్ కూడా Update చేయాలనుకుంటే వాటి వద్ద కూడా టిక్ చెయ్యాలి, లేదుఅనుకుంటే Photo దగ్గర టిక్ చేస్తే సరిపోతుంది.
  • తరువాత Choose File దగ్గర మీరు Voter Card లో కనిపించాలనుకుంటున్న Photo ని ఎంపిక చేసి, అనతరం మీరు ఎంపిక చేసిన ఫోటో పోర్టల్ లో కనిపిస్తుంది, ఇక్కడ మీరు మీ ఫోటో స్పష్టంగా కనిపించేలా Adjust చేసుకొని SAVE పై క్లిక్ చెయ్యాలి.
    • ఆనంతరం మీకు Human Face Detected Successfully అనే చిన్న విండో ఓపెన్ అవుతుంది, అక్కడ ok పై క్లిక్ చెయ్యాలి.
    • ఫోటో Requirements:
      • Background తెల్లగా ఉండాలి.
      • Size: 4.5 cm × 3.5 cm (passport size).
      • Format: JPG లేదా JPEG మాత్రమే.
      • File Size: 2MB కంటే తక్కువ ఉండాలి.
      • మొహం స్పష్టంగా, నేరుగా camera వైపు చూస్తూ ఉండాలి.
  • పేరు సరిపోకపోతే:
    • ఉదాహరణకు, మీ పేరు ఆధార్‌లో “సోమన చిన్న బాబు” అని ఉండి, కానీ ప్రస్తుతం ఓటర్ కార్డ్‌లో “చిన్న బాబు సోమన” లేదా వేరే విధంగా ఉంటే Aadhaar eSign సరిగ్గా పూర్తికాదు. ప్రస్తుతం ఓటర్ కార్డ్‌లో ఉన్న పేరు, ఆధార్‌లో ఉన్న పేరుతో స్పెల్లింగ్ మరియు పేరు క్రమం సహా అన్ని విధాలుగా సరిపోవాలి
    • ఒకవేళ ప్రస్తుతం మీ ఓటర్ కార్డ్‌లో ఉన్న పేరు, ఆధార్‌లో ఉన్న పేరుతో ఒకే విధంగా లేకపోతే, Application for Correction of Entries in Existing Electoral Roll లో Name ఎంపికను కూడా సెలెక్ట్ చేసి పేరు సరిచేసుకునేలా అప్లికేషన్ సమర్పించాలి.
    • First Name దగ్గర “సోమన చిన్న బాబు” అని ఆధార్‌లో ఉన్న విధంగా పూర్తి పేరును నమోదు చేసి, Surname ఖాళీగా వదిలేయాలి. మరియు Supporting Document దగ్గర మీ ఆధార్ కార్డ్ PDF/JPG రూపం లో 2 MB లోపాల ఉండే విదం గా అప్లోడు చెయ్యాలి (ఆధార్ కాపీ పై క్రింద బాగాన మీ సంతకం చెయ్యాలి). ఈ విధంగా నమోదు చేస్తే Aadhaar eSign Process ను విజయవంతంగా పూర్తి చేయవచ్చు.
    • ఒకవేళ ప్రస్తుతం మీ ఓటర్ కార్డ్‌లో ఉన్న పేరు, ఆధార్‌లో ఉన్న పేరుతో అదే విధంగా సరిపోతే, Name మార్చాల్సిన అవసరం లేదు.
  • తరువాత Next పై click చెయ్యండి.

Step 6: Declaration

  • D. Declaration వద్ద Declaration పూర్తి గా చదివి Place దగ్గర మీ ఊరి పేరు నమోదు చేసి Next పై click చెయ్యండి.
  • E. Submission దగ్గర Captcha  నమోదు చెసి Preview and Submit పై క్లిక్ చెయ్యండి. తరువాత పేజి లో మీకు మనం ఇప్పటి వరకు నమోదు చేసిన డీటైల్స్ కనిపిస్తాయి, వాటిని ఒకసారి verify చేసుకొని, తప్పులు ఉంటే Keep Editing పై క్లిక్ చేసి సరిచేయండి లేకపోతే Download పై క్లిక్ చేసి Application సేవ్ చేసుకొని eSign & Submit పై క్లిక్ చెయ్యండి.
  • గమనిక: eSign పేజీకి చేరుకోవడానికి కొంత సమయం పడవచ్చు. అందువల్ల దయచేసి కొద్దిసేపు వేచి ఉండాలి. ఈ సమయంలో Back, Cancel లేదా Reload / Refresh చేయకూడదు. eSign పేజీ పూర్తిగా ఓపెన్ అయ్యే వరకు వేచి ఉండాలి.

Step 7: Aadhaar OTP తో eSign & Submit చేయండి

Form 8 Aadhaar OTP ద్వారా eSign చేసి Submit చేయడం - Voter Card Name Correction Step 7
  • ఈ పేజి లో Enter Aadhaar వద్ద మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి Get OTP పై క్లిక్ చెయ్యాలి.
  • Enter Your Aadhaar OTP వద్ద మీ Mobile కి వచ్చిన OTP ఎంటర్ చేసి, క్రింద “I hereby state” పక్కన ఉన్న బాక్స్ పై టిక్ చేసి Submit పై క్లిక్ చెయ్యాలి.
  • ఈ పేజి లో మీకు Reference Number వస్తుంది, ఆ నెంబర్ ని Save చేసుకొని, Download Acknowledgement పై క్లిక్ చేసి Acknowledgement Slip ని save చేసుకోవాలి.
  • ఇక్కడి తో Voter ID లేక EPIC card Voter ID Photo Update process 2026 విజయవంతం గా పూర్తి అవుతుంది. Acknowledgement Number సహాయంతో మన Application status ను తెలుసుకోవోచ్చు .

Track Voter ID Photo Update Application Status

  1. Voter Services Portal (Official Website)
    వెబ్‌సైట్‌ ను ఓపెన్ చేసి. Mobile నెంబర్ సహాయం తో లాగిన్ అవ్వండి.
  2. Voter Service Portal Dashboard లో “Track Application Status” ను ఎంపిక చేసుకోండి.
  3. మీ Reference Number లేదా Mobile Number ఎంటర్ చెసి, Submit పై క్లిక్ చెయ్యాలి.
  4. స్టేటస్ తక్షణమే కనిపిస్తుంది.

లేదా నేరుగా కాల్ చేయండి: 1950 (Voter Helpline — ఉచితం, 24×7)

Photo Update తర్వాత ఎంత సమయం పడుతుంది?

  • 15 – 30 రోజులు పడుతుంది. కొన్ని సార్లు ముందుగానే ప్రాసెస్ చేయబడుతుంది.
  • BLO వెరిఫికేషన్ తర్వాత అప్రూవల్ జరుగుతుంది.
  • Approval తర్వాత కొత్త EPIC Card postal ద్వారా అందుతుంది.

సాధారణ తప్పులు – వీటిని జాగ్రత్తగా చేయండి

  • తప్పుడు format లో ఫోటో upload చేయడం — JPG/JPEG మాత్రమే valid.
  • File size 2MB కంటే ఎక్కువ ఉండటం — compress చేయండి.
  • ఫోటో background తెల్లగా లేకపోవడం.
  • మొహం స్పష్టంగా కనిపించకపోవడం.
  • Aadhaar తో లింక్ కాని Mobile Number use చేయడం (eSign fail అవుతుంది).
  • Acknowledgement slip save చేసుకోకపోవడం.
  • Reference Number నోట్ చేసుకోకపోవడం.

Application Reject అయ్యే కారణాలు

  • Aadhaar OTP verify కాకపోవడం.
  • Wrong EPIC Number.
  • సాంకేతిక కారణాలు వలన

Offline లో Voter Card Phone Update ఎలా చేయాలి?

Internet access లేకపోయినా లేదా online process నచ్చకపోతే, offline voter card name correction కూడా చేయవచ్చు.

Step 1: Form 8 తీసుకోండి

  • Voter Services Portal (Official Website) వెబ్‌సైట్‌ లో Form 8 Download చేసుకోవోచ్చు .
  • లేదా దగ్గర్లో ఉన్న BLO (Booth Level Officer) దగ్గర తీసుకోండి

Step 2: Form Fill చేయండి

  • అన్ని details clearly blue/black pen తో రాయండి
  • Photo section లో కొత్త passport size ఫోటో అతికించండి.
  • Signature వేయండి.

Step 3: Submit చేయండి

  • మీ BLO దగ్గర లేదా Electoral Registration Office (ERO) లో submit చేయండి.
  • Acknowledgment receipt తప్పకుండా తీసుకోండి.

తరచూ అడిగే ప్రశ్నలు | FAQ – Voter Card Photo Change Telugu

Q1: Voter ID లో ఫోటో అప్డేట్ చేయడానికి fee అవుతుందా?

A: ఎటువంటి fee అవసరం లేదు. ఇది పూర్తిగా ఉచితం (Free).

Q2: ఫోటో అప్డేట్ తర్వాత కొత్త EPIC Card వస్తుందా?

A: అవును, ఫోటో correction తర్వాత Online లో BLO approval పొందిన తర్వాత నూతన EPIC card జారీ అవుతుంది.

Q3: ఏ format లో ఫోటో upload చేయాలి?

A: JPG/JPEG format, 3.5×4.5 cm సైజు, maximum 2MB.

Q4: Aadhaar తో Mobile Number link లేకపోతే ఏం చేయాలి?

A: ముందు Aadhaar తో Mobile Number link చేయించుకోండి. తర్వాత Form 8 online submit చేయండి. లేదా offline BLO దగ్గర submit చేయవచ్చు.

Q5: Application submit చేసిన తర్వాత ఫోటో తప్పుగా upload అయింది అని తెలిసింది, ఏం చేయాలి?

A: వెంటనే BLO ని contact చేయండి లేదా Voter Helpline 1950 కి call చేయండి.

Q6: Processing time ఎంత ఉంటుంది?

A: Online లో BLO verification తర్వాత సాధారణంగా 15–30 రోజుల్లో అప్రూవల్ జరుగుతుంది.

ముఖ్యమైన Links | Important Links

Portal / ServiceDetails
Voter Helpline PortalVoter Services Portal (Official Website)
Voter Helpline AppECINET
Toll Free Number1950

Related Articles

AP Voter ID Apply Online Guide 2026
Voter Card Download Telugu 2026
Voter Card Name Correction Online 2026

సారాంశం | Conclusion

Voter Card Photo Update Online Telugu 2026 – ఇప్పుడు మీకు పూర్తిగా అర్థమైందని భావిస్తున్నాం. Form 8 ద్వారా Electoral Roll లో Photo Update చేయడం ఇప్పుడు చాలా సులభం — Online లేదా Offline రెండు పద్ధతుల్లో చేయవచ్చు.

సరైన Aadhaar మరియు EPIC details సిద్ధంగా ఉంటే, Online application 10–15 నిమిషాల్లో పూర్తి చేయవచ్చు. Approval కి సాధారణంగా 15–30 రోజులు పడుతుంది.

మీ Voter ID లో ఇంకా పాత ఫోటో ఉందా? ఇప్పుడే Apply చేయండి — మీ ఓటు హక్కు సురక్షితంగా వాడుకోవాలంటే మీ Voter ID తాజాగా ఉండాలి!

ఈ గైడ్ అధికారికంగా Election Commission of India విడుదల చేసిన మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడింది. తాజా 2026 Form 8 విధానం ప్రకారం వివరాలు అందించబడ్డాయి. దయచేసి అప్లై చేసే ముందు అధికారిక పోర్టల్ లో తాజా సూచనలు పరిశీలించండి.


ఈ పోస్ట్ మీకు ఉపయోగపడిందా? మీ friends మరియు family తో share చేయండి. Government Schemes , Application Process and other useful information కి సంబంధించిన మరిన్ని సేవల కోసం మా Web site esachivalayam.in ను follow చేయండి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top