Voter Card Download Telugu 2026 – e-EPIC PDF Download Step-by-Step Guide

ఒకవేళ మీ ఓటర్ కార్డ్ పోయినా, పాడైపోయినా లేదా కొత్తగా అప్లై చేసి పోస్టల్ ద్వారా ఇంకా రాకపోయినా — ఆందోళన అవసరం లేదు. ఈ Voter Card Download Telugu 2026 గైడ్ ద్వారా మీరు మీ Voter Card (e-EPIC) ను కేవలం కొన్ని నిమిషాల్లోనే మీ మొబైల్‌లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. 2026లో ఆన్లైన్ ద్వారా Voter Card డౌన్లోడ్ ప్రక్రియ మరింత సులభమైంది. ఈ పూర్తి గైడ్‌లో step-by-step విధానం తెలుసుకోండి.

Voter Card Download 2026 – Quick Overview

  • Website: Voter Service Portal
  • Mobile App: ECINET App
  • Required Details: EPIC Number లేదా పేరు ద్వారా Search చేసుకునే అవకాశం.
  • Verification: OTP Required.
  • Time Required: 5 Minutes.
Voter Card Download 2026 e-EPIC PDF online step by step guide

Voter Card అంటే ఏమిటి? (What is Voter Card?)

Voter Card అంటే మీకు ఓటు వేసే హక్కు ఉన్నదని రుజువు చేసే government ID card. దీన్నే అధికారికంగా EPIC Card (Electors Photo Identity Card) అంటారు. సాధారణ ప్రజలు దీన్ని Voter ID, Voter Card, అని పిలుస్తారు.

భారత ఎన్నికల సంఘం (Election Commission of India) జారీ చేసే ఈ కార్డు గుర్తింపు రుజువు (Identity Proof) మరియు చిరునామా రుజువు (Address Proof) గా కూడా ఉపయోగపడుతుంది.

e-EPIC Card అంటే దాని Digital PDF version — దీన్ని phone లో Save చేయవచ్చు లేదా Print చేయవచ్చు. Physical card లాగే పూర్తిగా చెల్లుబాటు అవుతుంది.

2026 Update: Voter Card లో ఇప్పుడు QR Code ఉంది — దీని ద్వారా officials instant verification చేయగలరు.


Voter Card Download 2026 కోసం అవసరమైనవి

Voter Card download చేయడానికి ముందు ఇవి సిద్ధంగా ఉంచుకోండి:

  • Voter ID Number / EPIC Number (పాత కార్డుపై ఉంటుంది) లేదా Form Reference Number. ఒకవేళ మీకు మీ Voter ID Number తెలియకపోతే Electoral Roll Search ద్వారా ఎలా తెలుసుకోవలో క్రింద వివరంగా తెలుపబడింది.
  • Voter Portal లో Registered Mobile Number (OTP కోసం).
  • Smartphone లేదా Computer.
  • Internet Connection.

Method 1: Voter Card Download 2026 – Official Portal Method

Step 1: Official Website Open చేయండి

  • మీ browser లో Voters Service Portal తెరవండి.
  • ఇది Election Commission of India యొక్క అధికారిక వెబ్‌సైట్. ఇక్కడ నుండి Voter Card (EPIC Card) download చేసుకోవడం అత్యంత సురక్షితం మరియు నమ్మకమైనది.

Step 2: Login లేద Sign-Up అవ్వుట

Voter Portal login and signup page for EPIC card download
  • కొత్త User అయితే (Sign-UP):
    ఒకవేళ మీరు ఇప్పటి వరకు Voter Portal లో Register అవ్వకపోతే “Sign-Up” పై click చేయండి. తదుపరి పేజీ లో Indian Resident Elector సెలెక్ట్ చేసుకోవాలి.
    • తరువాత Mobile Number, Email ID మరియు Captcha నమోదు చేసి Continue పై క్లిక్ చెయ్యాలి.
    • తరువాత పేజీ లో మీ First name మరియు Last Name నమోదు చేసి Send OTP పై క్లిక్ చేసి, మీ Mobile కి వచ్చిన OTP ని verify చేసి Sign-Up అవ్వగలరు
  • ఇప్పటికే Account ఉంటే (Login):
    ఒకవేళ మీరు ఇప్పటికే Voter Portal లో Register అయ్యి ఉంటే “Login” button పై click చేయండి. తదుపరి పేజీ లో మీ Registered Mobile Number మరియు Captcha నమోదు చేసి “Request OTP” పై click చేయండి. మీ మొబైల్ కి వచ్చిన OTP ని verify చేసి Login అవ్వగలరు.

Step 3: e-EPIC Download 2026 ఎంపిక చేయండి

e-EPIC download option in voter portal dashboard
  • Dashboard లో “e-EPIC Download” option పై click చేయండి.

Step 4: EPIC Number నమోదు చేయండి

Enter EPIC number to download e-EPIC voter card PDF
  • EPIC Number” లేదా “Form Reference Number” ఎంచుకుని number enter చేయండి.
    • ఒకవేళ మీకు మీ EPIC Number తెలియకపోతే, మీ “వివరాలు లేక ఫోన్ నెంబర్” తో Electoral Roll Search ద్వారా తెలుసుకోగలరు.
      Search in Electoral Roll
  • మీ State select చేసి “Search” పై click చేయండి.
  • స్క్రీన్ పై మీ Voter Card details కనిపిస్తాయి.
  • Confirm చేసుకుని “Send OTP” పై click చేయండి.
  • గమనిక : మీ మొబైల్ నెంబర్ తప్పని సరిగా మీ Voter ID ERoll లో రిజిస్టర్ అయ్యి ఉండాలి. ఒకవేళ లేకపోతే Form8 ద్వారా నమోదు చేసుకోవొచ్చు.
  • మీ Mobile కి వచ్చిన OTP ని verify చేసిన తరువాత Download eEPIC ఆప్షన్ కానిపిస్తుంది, దాని పై క్లిక్ చేసి e-EPIC (Voter ID PDF Download) ని PDF రూపం లో డౌన్లోడ్ చేసుకోగలరు.

Method 2: e-EPIC PDF Download via ECINET App

Step 1: ECINET App Install చేయండి

  • సులభంగా Mobile లో Online Voter Card Download చేయడానికి ఈ app వాడండి.
ECINET App
  • Google Play Store (Android) లేదా Apple App Store (iPhone) లో “ECINET App” search చేసి Install చేయండి.

Step 2: App లో Login/Register అవ్వుట

ECINET app login and registration page for e-EPIC download
  • App open చేసి Profile symbol (స్క్రీన్ షాట్ లో చూపిచబడింది) పై క్లిక్ చేయండి.
  • ఒకవేళ మీరు ఇప్పటి వరకు Voter Service Portal లో రిజిస్టర్ కాకపొతే New User పై క్లిక్ చేయండి.
  • తరువాత page లో మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి SEND OTP పై క్లిక్ చేయండి.
  • తరువాత page లో మీ First Name, Last Name మరియు OTP నమోదు చేసి SUBMIT పై క్లిక్ చేయండి.
  • ఒకవేళ మీరు ఇప్పటికే Voter Service Portal లో రిజిస్టర్ అయ్యిఉంటే Profile symbol symbol పై క్ల్కిక్ చేసి Mobile Number పై క్ల్కిక్ నమోదు చేసి SEND OTP పై క్లిక్ చేసి, మీ మొబైల్ కి వచ్చిన OTP ని verify చేయండి.
  • తరువాత Profile Update page ఓపెన్ అవుతుంది, అందు లో మీకు తెలిసిన డీటైల్స్ ఎంటర్ చేసి UPDATE PROFILE పై క్లిక్ చేసి PROCEED పై క్లిక్ చేయండి.

Step 3: e-EPIC Download

Download e-EPIC voter card PDF using ECINET mobile app
  • Home screen లో Election Commission of India online లో అందిస్తున్న సర్వీసెస్ కనిపిస్తాయి అందు లో “e-EPIC Download” పై క్లిక్ చేయండి.
  • తరువాత page లో మీ EPIC Number/ Reference Number/ Details నమోదు చేసి, State ఎంపిక చేసుకొని Fetch details పై క్లిక్ చెయ్యాలి.
  • ఒకవేళ మీ ఫోన్ నెంబర్ మీ Voter ID ERoll లో రిజిస్టర్ అయ్యిఉంటే మీ డీటైల్స్ క్రింద కనిపిస్తాయి, లేకుంటే Your mobile no. is not registered in ERoll అని వార్నింగ్ వస్తుంది. Form8 ద్వారా register చేసుకోవాలి.
  • డీటైల్స్ verify చేసుకొని PROCEED పై క్ల్కిక్ చెయ్యాలి.
  • తరువాత మీ మొబైల్ కి వచ్చిన OTP ని ఎంటర్ చేసి Verify and Download పై క్ల్కిక్క్ చేసి share symbol పై క్ల్కిక్క్ చేసి eVoter ID ని PDF రూపం లో SAVE మరియు share చేసుకోగలరు.

2026 New Feature: DigiLocker లో Save చేయడం

Voter Card (EPIC Card) PDF ని DigiLocker లో store చేస్తే — phone పోయినా, PDF delete అయినా, ఎప్పుడైనా మళ్ళీ access చేయవచ్చు.

Step 1: DigiLocker Web లేదా DigiLocker App తెరవండి.

Step 2: Aadhaar number తో login చేయండి.

Step 3: “Upload Document” పై click చేసి downloaded Voter Card PDF upload చేయండి.

ఇప్పుడు మీ Voter Card DigiLocker లో safe గా ఉంటుంది.


Voter ID Number / EPIC Number తెలియకపోతే?

పాత కార్డు పోయిందా? EPIC Number గుర్తు లేదా? — Worry అవ్వకండి!

Option 1 — Portal లో Search చేయండి: .
Search in Electoral Roll
మీ “వివరాలు లేక ఫోన్ నెంబర్” తో Electoral Roll Search ద్వారా తెలుసుకోగలరు.

Option 2 — Voter Helpline కి Call చేయండి: 1950 (Toll-Free — అన్ని రాష్ట్రాలకు)

Option 3 — Voter Helpline App లో Search: App open చేసి “Search Voter” option లో పేరు మరియు district ద్వారా search చేయండి.


Voter Card (EPIC Card) ఎక్కడ ఉపయోగపడుతుంది?

వినియోగంచెల్లుబాటు
ఓటు వేయడానికి (Voting)అవును
Bank Account తెరవడానికిఅవును
Government Office పనులకుఅవును
Identity Proof గాఅవును
Address Proof గా అవును
Passport Application కి అవును
SIM Card తీసుకోవడానికిఅవును

తరచుగా అడిగే ప్రశ్నలు 2026 (FAQ)

Q1: Voter Card download పూర్తిగా Free గా ఉంటుందా?

A: అవును! voters.eci.gov.in మరియు Voter Helpline App ద్వారా Voter Card (e-EPIC) పూర్తిగా ఉచితంగా download చేయవచ్చు. ఎలాంటి charge లేదు.

Q2: Online download చేసిన Voter Card (e-EPIC) valid అవుతుందా?

A: అవును, పూర్తిగా valid. 2026లో e-EPIC లో QR Code ఉంది — అధికారులు instantly scan చేసి verify చేయగలరు.

Q3: Physical Voter Card ఎంత కాలంలో వస్తుంది?

A: కొత్తగా apply చేస్తే approval తర్వాత సుమారు 15 రోజులలో మీ address కి postal గా వస్తుంది.

Q4: Voter Card లో తప్పులు ఉంటే ఏం చేయాలి?

A: Form 8 submit చేసి correction request పెట్టండి. పేరు, photo, address అన్నీ correct చేయవచ్చు.

Q5: ఒకే mobile number తో family members అందరి Voter Card download చేయవచ్చా?

A: అవును, కానీ ప్రతి member వారి Voter ID Number తో separately OTP verify చేసుకోవాలి.

Q6: e-EPIC Voter Card ఎన్నిసార్లు download చేయవచ్చు?

A: Unlimited గా — ఎప్పుడు అవసరమైనా, ఎన్నిసార్లైనా download చేయవచ్చు.

Q7: 18 సంవత్సరాలు నిండాయి — కొత్తగా Voter Card ఎలా తీసుకోవాలి?

A: Form 6 ద్వారా కొత్త Voter ID apply చేయాలి.

Related Guides

కొత్త ఓటర్ ID దరఖాస్తు 2026 – New Voter ID Apply Online Guide

ముగింపు

2026లో Voter Card (EPIC Card) download చేసుకోవడం కేవలం 5 నిమిషాల పని! voters.eci.gov.in లేదా Voter Helpline App ద్వారా ఇప్పుడే మీ డిజిటల్ Voter Card download చేసుకోండి — Print/Save చేయండి లేదా DigiLocker లో safe చేయండి.

మీ ఓటు మీ హక్కు — Voter Card సిద్ధంగా ఉంచుకుని ప్రజాస్వామ్యంలో పాల్గొనండి!


Voter Card Download 2026 – అధికారిక లింక్‌లు (Official Links)

PortalLink / Contact
Voter Services Portalhttps://voters.eci.gov.in
ECI Official Sitehttps://eci.gov.in
DigiLockerhttps://digilocker.gov.in
Voter Helpline1950 (Toll-Free)

ఈ గైడ్ Election Commission of India అధికారిక వెబ్‌సైట్ ఆధారంగా రాయబడింది. మరింత సహాయానికి 1950 కి call చేయండి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top