భారతదేశంలో కొత్త PAN Card పొందాలంటే ప్రభుత్వం అనుమతించిన అధికారిక సంస్థలలో Protean eGov Technologies Limited (మునుపటి NSDL) ఒకటి. Protean ద్వారా Aadhaar based PAN Card Apply Online చేస్తే, ముందుగా e-PAN (PDF) అప్లికేషన్ లో నమోదు చేసిన Mail కి పంపబడుతుంది. తరువాత Physical PAN Card పోస్టు ద్వారా మీ చిరునామాకు పంపబడుతుంది.
ఈ గైడ్ మొదటిసారి PAN అప్లై చేస్తున్న విద్యార్థులు, ఉద్యోగార్థులు మరియు Aadhaar ఆధారంగా ఆధార్‌లో ఉన్న ఫోటో, చిరునామా, వ్యక్తిగత వివరాల ఆధారంగా ఎలాంటి బయటి డాక్యుమెంట్లు అప్లోడ్ చేయకుండా PAN Card అప్లై చేయాలనుకునే వారికి ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది..
ఒకవేళ మీరు మీ ఆధార్ లో ఉన్న ఫోటో లేదా చిరునామాతో కాకుండా ప్రస్తుతం మీ దగ్గర ఉన్న వివరాలతో PAN Card అప్లై చేయాలనుకుంటే మా స్వతంత్ర వెబ్సైట్ esachivalayam.in లో ప్రచురించిన Protean ద్వారా PAN Card Online అప్లై చేయడం ఎలా? (Scan, Upload & e-Sign) – పూర్తి గైడ్ (2026) ఫాలో అవ్వండి.
ముఖ్యమైన గమనిక
- ఒక వ్యక్తికి జీవితకాలంలో ఒకే ఒక PAN కార్డు మాత్రమే ఉంటుంది. కాబట్టి అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభించే ముందు, మీరు ఇప్పటికే e-PAN గానీ లేదా Physical PAN గానీ ఏ విధమైన మోడ్‌లోనైనా గతంలో అప్లై చేసి ఉన్నారా లేదా అని ఒక్కసారి తప్పనిసరిగా చెక్ చేసుకోండి.
- PAN Card జీవితాంతం చెల్లుతుంది.
- ఒక వ్యక్తికి ఒకే PAN అనుమతి.
- తప్పు సమాచారం ఇస్తే అప్లికేషన్ తిరస్కరణకు అవకాశం ఉంది.
Aadhaar based PAN Card Apply Online – స్టెప్ బై స్టెప్ విధానం
(Aadhaar-based Physical PAN Application – Form 49A)
Step 1: Registration & Token Generation

Protean Online PAN Services పోర్టల్ ఓపెన్ చేయాలి.
Protean PAN Registration Pageమనకు మొదటగా రిజిస్ట్రేషన్ పేజీ లో New Application మరియు Resume Application కనిపిస్తుంది. వాటిలో మనం New Application ని సెలెక్ట్ చేసుకోవాలి.
- Select PAN Application Type లో మూడు options ఉంటాయి.
- భారతీయ పౌరసత్వం ఉన్నవాళ్లు New PAN – Indian Citizen (Form 49A ను ఎంచుకోవాలి. మనం భారతీయులం కనుక ఈ option ఎంచుకోవాలి.
- విదేశీ పౌరులు New PAN – Foreign Citizen (Form 49AA) ను ఎంచుకోవాలి.
- Select Applicant Category Type లో Job holders, students, freelancers, నిరుద్యోగులు, వ్యవసాయ పని మరియు ఈ ఇతర పని చేసుకునేవారు Individual ను ఎంచుకోవాలి.
- Select a Title Type లో పురుషులు Shri, పెళ్లి ఆయన మహిళలు smt, పెళ్లి కానీ మహిళలు Kumari ను ఎంచుకోవాలి.
- మీ పూర్తి పేరు , పుట్టిన తేది, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ID నమోదు చేయాలి. ఆధార్ లేక SSC సర్టిఫికెట్ లో ఉన్న సమాచారం తో సరిచూసుకోవాలి.
- ఉదాహరణకి మీ పేరు కొవ్వూరి రమేష్ బాబు
- last name/ sure name – కొవ్వూరి
- First name – రమేష్
- Middle name – బాబు
- ఉదాహరణకి మీ పేరు కొవ్వూరి రమేష్ బాబు
ఒకవేళ మీకు ఆధార్‌కు సంబంధించిన ఏ విషయంలోనైనా సందేహాలు ఉంటే, అధికారిక UIDAI (Aadhaar) వెబ్‌సైట్‌ను సంప్రదించగలరు.
Aadhar Portalఆధార్‌కు సంబంధించిన వివిధ సేవలపై (అడ్రస్ మార్పు, మొబైల్ నంబర్ అప్డేట్ మొదలైనవి) సమాచారం మరియు స్టెప్ బై స్టెప్ గైడ్ కోసం మా స్వతంత్ర వెబ్సైట్ (esachivalayam.in) ను రిఫర్ చేసుకోవచ్చు.ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే అందించబడింది.
- Disclaimer మరియు reCAPTCHA ను సెలెక్ట్ చేసి Submit చేయాలి.
Step 2: Token Number Save చేయడం

- Submit చేసిన తర్వాత 15 అంకెల Token Number వస్తుంది.
- ఇది మీ ఇమెయిల్‌కు పంపబడుతుంది. Token Number ని save చేసుకోగలరు.
- మీరు మిగిలిన process ని కూడా పూర్తి చెయ్యాలనుకుంటే Continue మీద క్లిక్ చెయ్యండి లేదు తరువాత వీలైనప్పుడు సాగించాలంటే ఇప్పుడు నిష్క్రమించి, మరల Application process ని మొదలుపెట్టినప్పుడు Application మొదటి step లో చూపించిన Resume Application option సహాయంతో ఈ Token Number తో మళ్ళి PAN అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోగలరు.
- ఈ Token Number validity 30 రోజులు మాత్రమే, ఒకవేళ మీరు 30 రోజులలో Application Process చెయ్యక పోతే Number invalid అవుతుంది కనుక మరల Generate చేసుకోవలసి వస్తుంది.
Step 3: Personal Details నమోదు చేయుట
Personal Details పై క్లిక్ చేయాలి.

- How do you want to submit your PAN application documents ? New PAN కి సంబంధించిన మూడు options ఉంటాయి.
- 1. Aadhaar-based PAN Online Application.
- 2. PAN Application with supporting documents (Scan, Upload and e-Sign).
- 3. Fill PAN Application Online and courier/speed post application with supporting documents.
Option 1: Aadhaar-based Online PAN Application
ఒకవేళ మీరు PAN కార్డు లో కూడా ఆధార్ లో ఉన్న ఫోటో మరియు అడ్రస్ కావాలనుకుంటే Aadhaar-based PAN Online Application option తో కొనసాగించండి. వేగవంతమైన మరియు సులువైన పద్ధతి. డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు.
గమనిక: ఈ పద్ధతిలో ఆధార్ మొబైల్ నెంబర్ తప్పనిసరిగా UIDAI లో లింక్ అయి ఉండాలి.
ఒకవేళ మీ ఆధార్‌కు మొబైల్ నంబర్ లింక్ కాకపోతే, క్రింది ఆర్టికల్‌ను అనుసరించి ఆధార్ సెంటర్‌కు వెళ్లకుండా మీ మొబైల్ ద్వారానే ఈ ప్రక్రియను పూర్తిచేయవచ్చు.
Aadhaar Mobile Number Update Online via App – పూర్తి స్టెప్ బై స్టెప్ గైడ్
- Choose from the options below సెక్షన్ లో మీకు 2 options ఉంటాయి.
- 1.Physical copy to your home + soft copy on your email.
- 2.Only soft copy on your email ID.
- Physical copy to your home + soft copy on your email option ఎంచుకోవాలి.
- Aadhaar Number (only for individual) సెక్షన్ లో మీ ఆధార్ నెంబర్ last నాలుగు అంకెలను ఎంటర్ చెయ్యాలి.
- I hereby agree to have my Aadhaar photo printed on my PAN Card దగ్గర drop down లో YES పెట్టండి.
- Name as per Aadhar దగ్గర ఆటోమేటిక్ గా ఆధార్ లో ఉన్న పేరు వచ్చేస్తుంది. రాని యడల మిరే ఆధార్ లో ఉన్న విధంగా enter చెయ్యండి.
- Full Name of the Applicant సెక్షన్ లో సెక్షన్ లో మనం రిజిస్ట్రేషన్ స్టెప్‌లో ఎంటర్ చేసిన వివరాలు ఇక్కడ చూపించబడతాయి. ఒకవేళ తప్పుగా ఉంటె సరైన డీటెయిల్స్ ని manual గా ఎంటర్ చేయగలరు.
- Name that you would like printed on PAN card సెక్షన్ లో మీకు PAN కార్డు మీద పేరు ఎలా కావాలో ఇక్కడ ఎంటర్ చెయ్యాలి.
- Date of Birth మరియు Gender (లింగం) ఆధార్ లో ఉన్న విధం గా ఎంటర్ చెయ్యాలి. Registration Number ఉంటె ఎంటర్ చెయ్యండి లేదంటే వదిలేయండి.
- Have you ever been known by any other name? దగ్గర NO పెట్టండి.
- Details of Parents (Applicable only for Individual applicants) దగ్గర మీ నాన్న గారి పేరు ఎంటర్ చెయ్యాలి (పెళ్లైన మహిళలు ఐన కూడా).
- ఒకవేళ అమ్మ గారు ఒక్కరే ఉండి ఆమె పేరు కార్డు పై ఉండాలి అనుకుంటే Parent Details సెక్షన్ లో ఉన్న Is your mother a single parent, and do you wish to apply for PAN by furnishing only her name దగ్గర YES క్లిక్ చెయ్యగలరు. Mathers Name దగ్గర అమ్మ పేరు నమోదు చేయాలి
- Select parents name to be printed on the PAN card దగ్గర Father or Mother Name ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి.
మీ personal details ఒకసారి మరల verify చేసుకొని Next పై క్లిక్ చెయ్యండి.
Step 4: Aadhaar based PAN Card Apply Online – Contact & other details నమోదు చేయుట

- Please Select the source of Income దగ్గర
- ఉద్యోగం చేసేవాళ్ళు Salary ఎంచుకోవాలి.
- Students, నిరుద్యోగులు అయితే No income ఎంచుకోవాలి.
- Address for communication దగ్గర Residence మరియు Office అనే రెండు options ఉంటాయి.
- అయితె మనం Aadhaar based PAN Application చేస్తున్నాం కనుక ఆధార్ లో ఉన్న address మనకు ఇక్కడ Residential Address గా ఉపయోగ పడుతుంది. కనుక ఆధార్ ఆధారిత అప్లికేషన్ లో Residential Address ఆటోమేటిక్‌గా ఆధార్ నుండి తీసుకోబడుతుంది. PAN Card కూడా Aadhaar లో ఉన్న Address కి పంపించబడుతుంది.
- ఒకవేళ మీరు ఉద్యోగి అయ్యి ఉండి, కట్చితమైన ప్రూఫ్ ఉంటె మీ ఆఫీస్ అడ్రస్ నమోదు చేయాలనుకుంటే office Address దగ్గర నమోదు చెయ్యండి లేదనుకుంటే విడిచిపెట్టొచ్చు. ఆఫీస్ అడ్రస్ తప్పనిసరి కాదు.
- Telephone Number & Email ID details దగ్గర
- Country code (ISD Code) – India (91) ఎంచుకోవాలి.
- Area/STD Code తెలిస్తే ఎంటర్ చేయొచ్చు లేదు అనుకుంటే ఖాళీ గ విడిచి పెట్టొచ్చు.
- Telephone/Mobile Number మరియు Email ID మనం రిజిస్ట్రేషన్ టైం లో enter చేసిన డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తాయి.
- Representative Assessee లో NO ఉంటుంది.
మీ Contact & other details ఒకసారి మరల verify చేసుకొని Next పై క్లిక్ చెయ్యండి.
Step 5: Aadhaar-based PAN Application – AO code (Assessing Officer) Details నమోదు చేయుట

- ఒకవేళ మీకు మీ AO Type, AO Area, Range Code, AO Number తెలిస్తే ఎంటర్ చెయ్యండి.
- తెలియక పోతే Select from below options లోIndian Citizens పై టిక్ చేసి మీ state మరియు City (జిల్లా) ఎంటర్ చేసి Fetch పై క్లిక్ చేస్తే మీకు క్రింద ఆ city కి సంబంధించిన AO codes కనిపిస్తాయి వాటిలో మీకు సంబంధించిన AO code ని సెలెక్ట్ చేసుకోగలరు.
మీ AO code details ఒకసారి మరల verify చేసుకొని Next పై క్లిక్ చెయ్యండి.
Step 6: Aadhaar-based PAN Application – Document Details నమోదు చేయుట

- Document submitted as Proof of Identity (POI), Proof of Address (POA) and Proof of Date of Birth (DOB) దగ్గర మనం ఎం కూడా upload చేయనవసరం లేదు ఎందుకంటే మనం Aadhaar based PAN Card option సెలెక్ట్ చేసుకున్నాం కనుక.
- Declaration దగ్గర మీ పేరు కనిపిస్తుంది, క్రింద select దగ్గర మీరు Herself / Himself ఎంచుకోండి.
- Place దగ్గర మీరు ఉన్న ప్రాంతం పేరు నమోదు చేయండి.
మీ Document Details ఒకసారి మరల verify చేసుకొని Submit పై క్లిక్ చెయ్యండి.
Step 7: Preview Details – నమోదు చేసిన సమాచారం సరిచూసుకొనుట
- 01- Personal దగ్గర మీ ఆధార్ మొదటి 8 నంబర్స్ నమోదు చెయ్యాలి.
- ఈ పేజీ లో మనం ఇప్పుడు వరకు fill చేసిన డీటెయిల్స్ కనిపిస్తాయి. ఒకవేళ డీటెయిల్స్ అన్ని కూడా సరిపోతే Proceed పై క్లిక్ చెయ్యాలి, ఒకవేళ తప్పు డీటెయిల్స్ ఉంటె Edit పై click చేసి డీటెయిల్స్ సరిచేసుకోగలరు.
Step 8: Aadhaar based PAN Card Apply Online – Payment చెల్లించుట

- ఈ పేజీ లో మీకు 3 options కనిపిస్తాయి.
- Demand Draft.
- Online payment through PAYTM.
- Online payment through Bill Desk.
- ఇందులో Online payment through PAYTM కానీ Online payment through Bill Desk కానీ ఎంచుకోండి
- తరువాత మీకు Payment charges information కనిపిస్తుంది , అంటే ఎంత డబ్బు చెల్లించాలని, Terms of Services లో I agree to the terms of services చెక్ box లో క్లిక్ చేసి Proceed to Payment పై క్లిక్ చెయ్యాలి.
- Confirm Payment పేజీ open అవుతుంది, అందులో Transaction ID మరియు Pay చెయ్యవలసిన amount కనిపిస్తుంది. క్రింద Pay Confirm పై క్లిక్ చెయ్యాలి. అప్పుడు మీకు Payment Gate Way ఓపెన్ అవుతుంది.
- అందులో మీకు Debit Card, Credit Card, Net Banking, QR Code / UPI options కనిపిస్తాయి. అందులో మీకు సౌకర్యవంతమైన పద్దతిని వాడి పేమెంట్ చెల్లించగలరు.
- Payment విజయవంతం అయినా తరువాత Payment Receipt పేజీ ఓపెన్ అవ్వడానికి కొంచం సమయం పడుతుంది, ఈ సమయంలో మీరు పేజీ బ్యాక్ కు, వెళ్లడం ముందుకు వెళ్లడం, close చెయ్యడం చెయ్యకూడదు. Payment Receipt పేజీ open అయినవరకు wait చెయ్యాలి.
- Payment Receipt పేజీ లో Continue పై క్లిక్ చెయ్యాలి.
Apply PAN Card using Aadhaar – Aadhaar Authentication

- Aadhaar Authentication పేజీ ఓపెన్ అవుతుందు, ఆ పేజీ క్రిందకు scroll చేసి క్రింద ఉన్న Use my Aadhaar details పేరా దగ్గర ఉన్న check box పై క్లిక్ చెయ్యాలి.
- క్రింద మీకు Authenticate మరియు Continue కనిపిస్తాయి అందులో మీరు కచ్చితం గా Authenticate ని select చేసుకోవాలి.
- తరువాత పేజీ లో OTP Generation or Continue with eKYC పై క్లిక్ చెయ్యాలి.
- OTP verification పేజీ లో మీ mobile నెంబర్ కి వచ్చిన OTP ఎంటర్ చేసి Submit పై క్లిక్ చెయ్యండి.
Your at the final step of your PAN Application journey page లోClick Continue to Proceed పై క్లిక్ చెయ్యండి. NSDL page కొత్త tab లో ఓపెన్ అవుతుంది.
NSDL page లో Aadhaar Authentication

I here by authorize పక్కన ఉన్న check box పై క్లిక్ చెయ్యాలి, Enter VID/Aadhaar Number దగ్గర పూర్తి ఆధార్ నెంబర్ లేక VID నెంబర్ Enter చేసి SEND OTP పై క్లిక్ చెయ్యాలి.
Next పేజీ లో మన మొబైల్ కి వచ్చిన OTP verify చేసుకోవాలి. Acknowledgement page ఓపెన్ అవ్వడానికి కొంతసమయం పడుతుంది wait చెయ్యాలి.ఈ సమయంలో మీరు పేజీ బ్యాక్ కు, వెళ్లడం ముందుకు వెళ్లడం, Close చెయ్యడం చెయ్యకూడదు.
Acknowledgement page లో Download PDF పై క్లిక్ చేసి Acknowledgement ను save చేసుకోండి.
- ఆ Acknowledgement PDF ని ఓపెన్ చెయ్యడానికి password మీ Date of Birth,
- ఒకవేళ మీ DOB 12/12/2000 అయితే మీ Password 12122000.
ఇక్కడితో PAN Application కంప్లీట్ అవుతుంది. కొన్ని గంటలలో e-PAN మీ Email కి పంపబడుతుంది. 7-15 రోజులలో లో Physical PAN Card ఆధార్ లో ఉన్న అడ్రస్ కి పంపబడుతుంది.
Protean PAN Status Tracking (Acknowledgement Number ద్వారా)

- Protean Status Tracking పేజీ ఓపెన్ చేయాలి.
- 15 అంకెల Acknowledgement Number ఎంటర్ చేయాలి.
- PAN అప్లికేషన్ స్టేటస్ చూడవచ్చు.
ముగింపు
Protean ద్వారా PAN Card అప్లై చేయడం అనేది సురక్షితమైన, అధికారిక మరియు వేగవంతమైన విధానం. Aadhaar ఆధారిత e-KYC ద్వారా పేపర్‌లెస్‌గా PAN పొందవచ్చు. సరైన వివరాలు ఇవ్వడం ద్వారా ఆలస్యం లేకుండా PAN Card పొందవచ్చు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1) Protean ద్వారా PAN Card అప్లై చేయడం అధికారికమా?
అవును. Protean eGov Technologies Limited భారత ప్రభుత్వ అనుమతితో PAN Card సేవలను అందించే అధికారిక సంస్థ (మునుపటి NSDL).
2) Aadhaar ఆధారంగా PAN Card అప్లై చేయాలంటే ఏమి అవసరం?
- చెల్లుబాటు అయ్యే Aadhaar నంబర్.
- Aadhaar కు మొబైల్ నంబర్ లింక్ అయి ఉండాలి.
- Active మొబైల్ నంబర్ & Email ID.
3) Aadhaar కు మొబైల్ నంబర్ లింక్ లేకపోతే Aadhaar based PAN Card Apply Online చేయవచ్చా?
Aadhaar-based Online PAN Application కోసం మొబైల్ నంబర్ తప్పనిసరిగా లింక్ అయి ఉండాలి.
లింక్ లేకపోతే ముందుగా Aadhaar మొబైల్ నంబర్ అప్డేట్ చేయాలి.
4) Aadhaar ఆధారిత PAN అప్లికేషన్లో డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలా?
లేదు. Aadhaar-based PAN Application లో ఏ డాక్యుమెంట్లు upload చేయాల్సిన అవసరం లేదు.
Aadhaar e-KYC ద్వారానే verification జరుగుతుంది.
5) PAN అప్లై చేసిన తర్వాత e-PAN ఎప్పుడు వస్తుంది?
సాధారణంగా PAN అప్లికేషన్ పూర్తి అయిన తర్వాత కొన్ని గంటల నుంచి 1–2 రోజులలో e-PAN (PDF) మీ Email ID కి పంపబడుతుంది.
6) Physical PAN Card ఎంత రోజుల్లో వస్తుంది?
PAN అప్లికేషన్ విజయవంతంగా పూర్తి అయిన తర్వాత 7 నుంచి 15 రోజుల్లో Physical PAN Card పోస్టు ద్వారా మీ Aadhaar లో ఉన్న చిరునామాకు పంపబడుతుంది.
7) Aadhaar based PAN Card Apply Online అప్లికేషన్ ఫీజు ఎంత?
ఫీజు మీరు ఎంచుకునే PAN delivery option (India / Outside India) పై ఆధారపడి ఉంటుంది.
Payment పేజీ లో exact charges చూపబడతాయి.
8) PAN అప్లికేషన్ మధ్యలో ఆపేస్తే మళ్లీ ఎలా కొనసాగించాలి?
Submit చేసిన తర్వాత వచ్చే 15 అంకెల Token Number ఉపయోగించి
“Resume Application” ఆప్షన్ ద్వారా మళ్లీ అప్లికేషన్ కొనసాగించవచ్చు.
Token Number validity 30 రోజులు మాత్రమే.
9) ఒక వ్యక్తికి ఒక కంటే ఎక్కువ PAN Cards ఉండవచ్చా?
లేదు. ఒక వ్యక్తికి ఒకే PAN Card మాత్రమే చెల్లుతుంది.
ఒక కంటే ఎక్కువ PAN Cards ఉండటం చట్టవిరుద్ధం.
10) PAN అప్లికేషన్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి?
Protean PAN Status Tracking పేజీ లోకి వెళ్లి
మీ 15 అంకెల Acknowledgement Number ఎంటర్ చేసి అప్లికేషన్ స్టేటస్ చూడవచ్చు.
11) Aadhaar authentication ఎందుకు అవసరం?
Aadhaar-based PAN Application లో identity verification కోసం
UIDAI e-KYC authentication తప్పనిసరి.