e-Aadhaar Download Online – పూర్తి స్టెప్ బై స్టెప్ గైడ్ 2026 (తెలుగు)

ఈ రోజుల్లో ఆధార్ కార్డు ప్రతి భారతీయుడికి తప్పనిసరి గుర్తింపు పత్రం. అయితే భౌతిక Physical Aadhaar కార్డు చేతిలో లేకపోయినా, e-Aadhaar ను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకుని ఉపయోగించవచ్చు. UIDAI అందిస్తున్న e-Aadhaar Download Online option ద్వారా ఇంటి నుంచే e-Aadhaar Download చేసుకోవొచ్చు.

e aadhaar download online step by step guide screenshot

ఈ ఆర్టికల్‌లో మీరు తెలుసుకునే విషయాలు:

  • e-Aadhaar అంటే ఏమిటి?
  • e-Aadhaar ముఖ్య లక్షణాలు.
  • UIDAI Official సైటు ద్వారా e-Aadhaar Download Online Step-by-Step ప్రక్రియ.
  • mAadhaar App ద్వారా e-Aadhaar Download Online Step-by-Step ప్రక్రియ.
  • What is Masked Aadhaar అంటే ఏమిటి?
  • e-Aadhaar PDF పాస్‌వర్డ్ ఏమిటి?
  • Digital Signature (e-Sign) గురించి.
  • తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs).

e-Aadhaar అంటే ఏమిటి?

e-Aadhaar అనేది UIDAI జారీ చేసిన డిజిటల్ ఆధార్ కార్డు. ఇది PDF ఫార్మాట్‌లో ఉంటుంది మరియు ఇది భౌతిక Physical Aadhaar కార్డుకు సమానంగా చెల్లుబాటు అవుతుంది.

e-Aadhaar ముఖ్య లక్షణాలు:

  • UIDAI డిజిటల్ సంతకం ఉంటుంది.
  • అన్ని ప్రభుత్వ & ప్రైవేట్ సేవలకు చెల్లుబాటు.
  • ఉచితం (Free) download చేసుకోవొచ్చు.
  • ఎక్కడి నుంచైనా ఎన్నిసార్లయినా డౌన్‌లోడ్ చేయవచ్చు.

e-Aadhaar Download Online చేయడానికి అవసరమైనవి

అవసరంవివరాలు
ఆధార్ నంబర్ / VID / SID / Enrolment ID12 అంకెల ఆధార్ లేదా 16 అంకెల VID
మొబైల్ నంబర్ఆధార్‌తో లింక్ అయి ఉండాలి
OTPమొబైల్‌కు వచ్చే OTP

విధానం 1: UIDAI Official సైటు ద్వారా e-Aadhaar Download Online Step-by-Step ప్రక్రియ

UIDAI అధికారిక వెబ్‌సైట్ ద్వారా e-Aadhaar Download Online చేసే లాగిన్ పేజి
eAadhaar Download (UIDAI Official)
  1. UIDAI అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి.
  2. My Aadhaar → Download Aadhaar పై క్లిక్ చేయండి.
  3. మీకు అందుబాటులో ఉన్న Aadhaar Number / VID / Enrolment ID/ SID Number ఎంటర్ చేయండి.
  4. Captcha కోడ్ నమోదు చేయండి.
  5. Send OTP పై క్లిక్ చేయండి.
  6. మొబైల్‌కు వచ్చిన OTP ఎంటర్ చేయండి.
  7. ఒకవేళ మీరు Masked ఆధార్ Download చేసుకోవాంటే ‘Download Masked e-Aadhaar’ అనే ఆప్షన్ ని క్లిక్ చెయ్యగలరు.
  8. Verify & Download క్లిక్ చేయండి.

గమనిక: e-Aadhaar PDF మీ డివైస్‌లో డౌన్‌లోడ్ అవుతుంది.


విధానం 2: mAadhaar App ద్వారా e-Aadhaar Download Online పూర్తి విధానం

mAadhaar App link

Step 1: mAadhaar App డౌన్‌లోడ్ & సెటప్

  • ముందుగా మీ మొబైల్‌లో mAadhaar యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
  • యాప్ ఓపెన్ చేసిన తరువాత, అవసరమైన యాప్ అనుమతులను (Permissions) తప్పనిసరిగా అనుమతించాలి.

Step 2: Resident Consent

  • Resident Consent పేజీలో కనిపించే Instructions జాగ్రత్తగా చదివి, క్రింద ఉన్న I Consent పై క్లిక్ చేయాలి.

Step 3: భాష ఎంపిక & లాగిన్

  • మీకు అనుకూలమైన భాష (Language) ఎంచుకోవాలి.
  • మొబైల్ నెంబర్ నమోదు చేసి OTP ద్వారా Verify చేసి Home పేజీలోకి ఎంటర్ కావాలి.

mAadhaar App ద్వారా e-Aadhaar Download చేసుకునే 2 విధానాలు

Method 1: Home పేజీ నుంచి నేరుగా Download Aadhaar

mAadhaar App Home పేజీ నుంచి నేరుగా Download Aadhaar ఆప్షన్ ద్వారా e-Aadhaar డౌన్‌లోడ్ చేసే విధానం
  1. Home పేజీలో కనిపించే Download Aadhaar పై క్లిక్ చేయాలి.
  2. Select Your Preference పేజి లో
    • Regular Aadhaar (పూర్తి ఆధార్ నెంబర్ కనిపిస్తుంది) లేదా
    • Masked Aadhaar (చివరి 4 అంకెలు మాత్రమే కనిపిస్తాయి, మిగిలిన 8 అంకెలు xxx ఉంటాయి).
      మీరు ఏది కావాలనుకుంటున్నారో అది ఎంపిక చేసుకోవాలి.
  3. I Have ఆప్షన్‌ పేజి లో
    • Aadhaar Number /
    • Virtual ID (VID) /
    • Enrolment ID /
    • SID Number
      వీటిలో మీ దగ్గర ఉన్నదాన్ని ఎంచుకోవాలి.
  4. మీరు సెలెక్ట్ చేసిన నెంబర్ (ఉదా: Aadhaar Number) ఈ పేజీలో ఎంటర్ చేయాలి.
  5. Captcha నమోదు చేసి Request OTP పై క్లిక్ చేయాలి.
  6. మీ మొబైల్‌కు వచ్చిన OTP Verify చేసిన తరువాత e-Aadhaar డౌన్‌లోడ్ అవుతుంది.

Method 2: Register My Aadhaar ద్వారా Download

mAadhaar App లో Register My Aadhaar ఆప్షన్ ద్వారా e-Aadhaar Download చేసే విధానం
  1. Home పేజీలో ఉన్న Register My Aadhaar పై క్లిక్ చేయాలి.
  2. 4-Digit Password (PIN) క్రియేట్ చేసుకోవాలి.
  3. తదుపరి పేజీలో Aadhaar Number మరియు Captcha నమోదు చేసి Request OTP పై క్లిక్ చేయాలి. తరువాత My Aadhaar home page లో కి login అవుతారు.
  4. My Aadhaar home page లో ని Download Aadhaar పై క్లిక్ చేసి e-Aadhaar download చేసుకోగలరు.

Masked Aadhaar అంటే ఏమిటి?

  • ఆధార్ నంబర్‌లో మొదటి 8 అంకెలు XXXX-XXXX గా దాచబడతాయి.
  • చివరి 4 అంకెలు మాత్రమే కనిపిస్తాయి.
  • ఉదాహరణ: XXXX XXXX 1234 (చివరి 4 అంకెలే కనిపిస్తాయి).

Masked Aadhaar ఉపయోగాలు:

  • ఆధార్ నంబర్ దుర్వినియోగం (fraud) కాకుండా ఉండేందుకు.
  • ప్రైవేట్ వెరిఫికేషన్.
  • KYC అవసరాలు.

గమనిక: Download Aadhaar పేజీలో Masked Aadhaar ఆప్షన్ సెలెక్ట్ చేయండి.


e-Aadhaar PDF పాస్‌వర్డ్ ఏమిటి?

డౌన్‌లోడ్ చేసిన PDF ఓపెన్ చేయాలంటే పాస్‌వర్డ్ అవసరం.

Password Format:

  • మీ పేరులో మొదటి 4 అక్షరాలు (CAPITAL LETTERS లో).
  • పుట్టిన సంవత్సరం (YYYY).

Example:

  • Name: RAMESH.
  • DOB Year: 1995.
  • Password: RAME1995.

ఒకవేళ మీ పేరులో 3 అక్షరాలే ఉన్నట్లు అయితే, మీ Password 3 అక్షరాలు (CAPITAL LETTERS లో) + పుట్టిన సంవత్సరం (YYYY).

Example: మీ పేరు Joe, DOB Year: 1995. మీ Password: JOE1995.


e-Aadhaar చెల్లుబాటు అవుతుందా?

అవును, UIDAI ప్రకారం ఇది చెల్లుబాటు అవుతుంది.

UIDAI ప్రకారం: e-Aadhaar, Masked Aadhaar, మరియు PVC Aadhaar అన్నీ సమానంగా చెల్లుబాటు అయ్యే పత్రాలు. కొన్ని సర్వీసెస్ కి పూర్తి ఆధార్ నెంబర్ అవసరం పడొచ్చు, ఆ సమయంలో Masked Aadhaar చూపుటకు వీలు పడదు.

📄 What is e-Aadhaar Digital Signature (e-Sign) – సులభంగా అర్థం చేసుకోండి

e-Aadhaar PDF లో కనిపించే Digital Signature (e-Sign) అనేది UIDAI వారు ఈ డాక్యుమెంట్‌ను అధికారికంగా జారీ చేశారని చూపించే ఒక భద్రతా గుర్తు మాత్రమే. కొందరికి PDF open చేసినప్పుడు green tick కనిపిస్తుంది, మరికొందరికి Warning లేదా Question mark లేదా Signature Invalid కనిపించవచ్చు. దీని వల్ల మీ ఆధార్ Invalid అయ్యిందని లేదా తప్పు ఉందని అర్థం కాదు. సాధారణంగా ఇది ఉపయోగిస్తున్న PDF viewer, మొబైల్ యాప్ లేదా software settings మీద ఆధారపడి ఉంటుంది. ఆధార్ నంబర్, పేరు, చిరునామా వివరాలు సరైనవైతే, Green tick కనిపించకపోయినా e-Aadhaar పూర్తిగా valid గానే ఉంటుంది.

కానీ, UIDAI నుంచి డౌన్‌లోడ్ చేసిన e-Aadhaar PDF ను ఉద్దేశపూర్వకంగా ఏ విధంగా అయినా మార్చితే (edit, crop, text remove/replace చేయడం), అది e-Sign నియమాలను ఉల్లంఘించినట్లే అవుతుంది. అలా చేసినప్పుడు చాలా PDF readers లోWarning Symbols,Error Messages లేదా Signature invalid అని సూచనలు తప్పకుండా కనిపిస్తాయి. అందుకే e-Aadhaar PDF ను ఎప్పుడూ modify చేయకుండా, డౌన్‌లోడ్ చేసిన విధంగానే ఉపయోగించడం మంచిది.


e-Aadhaar Download Online – సాధారణ సమస్యలు & పరిష్కారాలు

OTP రావడం లేదంటే?

  • మొబైల్ నంబర్ ఆధార్‌తో లింక్ అయి ఉందో లేదో చెక్ చేయండి.
  • Network సమస్య ఉంటే కొద్దిసేపటి తర్వాత ప్రయత్నించండి.

మొబైల్ నంబర్ లింక్ కాకపోతే?

PDF ఓపెన్ కావడం లేదంటే?

  • సరైన పాస్‌వర్డ్ ఎంటర్ చేస్తున్నారా చెక్ చేయండి.

గమనిక: ఈ సమాచారం UIDAI అధికారిక మార్గదర్శకాల ఆధారంగా ఇవ్వబడింది.
సేవా నియమాలు కాలక్రమేణా మారవచ్చు.


ముగింపు

e-Aadhaar Download Online అనేది చాలా సులభమైన మరియు భద్రమైన ప్రక్రియ. భౌతిక ఆధార్ లేకపోయినా, ఈ e-Aadhaar ద్వారా మీరు అన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేయవచ్చు.

గమనిక: మీకు ఈ గైడ్ ఉపయోగపడితే, ఇతరులకు షేర్ చేయండి.

Related Articles:


తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

Q1: e-Aadhaar ఉచితమా?

అవును, పూర్తిగా ఉచితం.

Q2: మొబైల్ లేకుండా e-Aadhaar Download Online చేయవచ్చా?

లేదు. OTP కోసం మొబైల్ లింక్ తప్పనిసరి.

Q3: ఎన్ని సార్లు డౌన్‌లోడ్ చేయవచ్చు?

ఎన్ని సార్లైనా చేయవచ్చు.

Q4: Masked Aadhaar అన్ని చోట్ల చెల్లుబాటు అవుతుందా?

ప్రైవేట్ అవసరాలకు సరిపోతుంది, కానీ కొన్ని సర్వీసెస్ కి పూర్తి ఆధార్ నెంబర్ అవసరం పడొచ్చు, ఆ సమయంలో Masked Aadhaar చూపుటకు వీలు పడదు, పూర్తి ఆధార్ కోరవచ్చు.

Q5: e-Aadhaar లో e-Sign అంటే ఏమిటి?

e-Sign అనేది UIDAI ఈ e-Aadhaar డాక్యుమెంట్‌ను అధికారికంగా జారీ చేసిందని చూపించే డిజిటల్ భద్రతా గుర్తు మాత్రమే.


Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top