మీకు ఇంకా ఓటర్ ID కార్డు లేదా? లేదా కొత్తగా 18 సంవత్సరాలు నిండాయా? అయితే ఈ గైడ్ మీ కోసమే! ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ఓటర్ ID కార్డు కోసం దరఖాస్తు చేయడం చాలా సులభం — ఇంటి నుండే ఆన్లైన్లో కేవలం 10 నిమిషాల్లో పూర్తి చేయవచ్చు. ఈ వ్యాసంలో మేము మీకు Voter ID Apply Online 2026 Step-by-Step పూర్తి గైడ్ అందిస్తున్నాం.

ఓటర్ ID అంటే ఏమిటి? ఎందుకు అవసరం? (What is Voter ID and Why is it Important?)
ఓటర్ ID కార్డు (Voter Identity Card / EPIC) భారత పౌరులకు భారత ఎన్నికల సంఘం (Election Commission of India – ECI) జారీ చేసే అధికారిక గుర్తింపు పత్రం. ఇది మీ ఓటు హక్కుకు రుజువు మాత్రమే కాదు — బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డు లింకింగ్, మరియు ప్రభుత్వ పథకాలకు కూడా ఉపయోగపడుతుంది.
ఆంధ్రప్రదేశ్ పౌరులకు ఓటర్ ID కార్డు ఉండటం చాలా ముఖ్యం — రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలు, మరియు స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ ఓటు వేయడానికి ఇది తప్పనిసరి.
అర్హత వివరాలు (Voter ID Eligibility in AP)
కొత్త ఓటర్ ID కోసం దరఖాస్తు చేయాలంటే, మీరు:
- భారత పౌరుడు అయి ఉండాలి
- 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉండాలి (ప్రతి సంవత్సరం January 1 reference date)
- ఆంధ్రప్రదేశ్‌లో శాశ్వత నివాసం ఉండాలి
- మీ పేరు ఏ నియోజకవర్గంలోనూ ఓటర్ లిస్ట్‌లో నమోదు కాకుండా ఉండాలి
అవసరమైన పత్రాలు (Documents Required for Voter ID Apply Online)
దరఖాస్తు సమయంలో ఈ క్రింది పత్రాలు సిద్ధంగా ఉంచుకోండి:
వయస్సు నిరూపణ పత్రాలు (Age Proof — ఒకటి సరిపోతుంది):
- పుట్టిన తేదీ సర్టిఫికెట్ (Birth Certificate)
- 10వ తరగతి మార్కుల పత్రం (SSC Certificate)
- పాన్ కార్డు (PAN Card)
- పాస్‌పోర్ట్
- ఆధార్ కార్డు (Aadhaar Card)
- Driving Licence (డ్రైవింగ్ లైసెన్స్)
నివాస నిరూపణ పత్రాలు (Address Proof — ఒకటి సరిపోతుంది):
- ఆధార్ కార్డు
- ఉపయోగ బిల్లు (కరెంట్/గ్యాస్/నీళ్ళ బిల్లు — 12 నెలల లోపు)
- బ్యాంక్ పాస్‌బుక్ (చిరునామాతో)
- రేషన్ కార్డు
- ఇంటి రిజిస్ట్రేషన్ పత్రాలు
- రెవెన్యూ శాఖ భూ రికార్డులు (Land Records issued by Revenue Department)
ఫోటో:
- తాజా పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో (2 కాపీలు)
ఓటర్ ID ఆన్లైన్ దరఖాస్తు విధానం (How to Apply Voter ID Online in AP)
Step 1: Voter Services Portal (అధికారిక వెబ్సైట్) కి వెళ్ళండి
Apply New Voter ID Online – Official Websiteఇది భారత ఎన్నికల సంఘం యొక్క అధికారిక Voter Services Portal. మీ browser లో ఈ link తెరవండి.
Step 2: రిజిస్ట్రేషన్ / లాగిన్ చేయండి

- పేజి పైన ఉన్న Login (ఇప్పటికే రిజిస్టర్ అయ్యి ఉంటే, లాగిన్ చేయండి) లేదు అనుకుంటే Sign-Up బటన్ క్లిక్ చేయండి.
- మీ మొబైల్ నంబర్ మరియు ఈమెయిల్ ఉపయోగించి, Captcha నమోదు చేసి కొత్త అకౌంట్ తయారు చేసుకోండి.
- మీ ఫోన్‌కు వచ్చిన OTP ఎంటర్ చేసి వెరిఫై చేసుకోండి.
Step 3: Form 6 (New Voter Registration) ఎంచుకోండి

- లాగిన్ అయిన తర్వాత Dashboard లో “New Registration వద్ద “Form 6″ ఎంచుకోండి.
- Form 6 అనేది కొత్త ఓటర్ నమోదు కోసం అధికారిక ఫారం
Step 4: రాష్ట్రం, జిల్లా & నియోజకవర్గం వివరాలు నమోదు చేయండి

- మీ State (రాష్ట్రం), District (జిల్లా), Assembly Constituency (అసెంబ్లీ నియోజకవర్గం) ని drop down సమాచారం నుండి ఎంపిక చేసుకోవాలి.
- తరువాత క్రింద చూపిస్తున్న Next పై క్లిక్ చేసి “Personal Details” సెక్షన్ లో కి వెళ్ళగలం.
Step 5: వ్యక్తిగత వివరాలు నమోదు చేయండి
- గమనిక : మీ పేరు ఖచ్చితంగా ఆధార్ లో ఉన్నవిధం నమోదుచేయాలి మరియు ఆధార్ కి మొబైల్ నెంబర్ లింక్ అయ్యిఉండాలి. లేనియాడలా మొదట వీటిని సరిచేసిన తరువాత మాత్రమే Voter ID ని Online లో apply చెయ్యగలం. లేకపోతే BLO ద్వారా భౌతిక ధృవీకరణ జరుగుతుంది.
- ఆధార్ పేరు మార్పుకు ఖచ్చితంగా ఆధార్ సెంటర్ కి వెళ్లవలిసి ఉంటుంది, కానీ Mobile నెంబర్ లింక్ కోసం ఆధార్ సెంటర్ కి వెళ్లకుండానే ఆన్లైన్ లో లింక్ చేసుకోవొచ్చు.
- First Name followed by Middle Name వద్ద మీపేరు ఆధార్ లో ఉన్న విధం గ నమోదు చెయ్యండి.
Surname వద్ద ఇంటిపేరు ఆధార్ లో ఉన్న విధం గా నమోదు చెయ్యండి. - గమనిక: క్రింద ఉన్న డబ్బాలలో ఆటోమేటిక్ గా తెలుగు లో మార్చబడి పేరు మరియు ఇంటి పేరు కనిపిస్తాయి, ఒకవేళ తెలుగు లో పేరు తప్పుగా మార్చబడితే, మీరే స్వంతంగా పక్కన చూపిస్తున్న కీబోర్డు ను కని బయట టైపు చేసి Paste చేయగలరు.
- Upload Photo దగ్గర మీ passport సైజు ఫోటో (4.5 cm X 3.5 cm) 2 MB లోపల white background ఉండే విధం గా jpg/jpeg form లో అప్లోడ్ చెయ్యాలి.
- తరువాత క్రింద చూపిస్తున్న Next పై క్లిక్ చెయ్యాలి.
Step 6: తండ్రి/తల్లి/భర్త/భార్య వివరాలు నమోదు చేయండి
- ఈ స్టెప్ లో మీ తండ్రి/తల్లి/భర్త/భార్య లేదా లీగల్ గార్డియన్ వివరాలు నమోదు చేయాలి.
- Father ( తండ్రి), Mother (తల్లి), Husband (బర్త), Wife (భార్య), Legal Guardian in case of orphan/Third Gender.
- తరువాత క్రింద చూపిస్తున్న Next పై క్లిక్ చెయ్యాలి.
Step 7: Contact Details (సంప్రదింపు వివరాలు) నమోదు చేయండి
- Mobile నెంబర్ దగ్గర మన స్వంత నెంబర్ అయితే Self, పై step లో నమోదు చేసిన వల్ల నెంబర్ అయితే Relative mentioned above దగ్గర టిక్ చేసి Mobile నెంబర్ నమోదు చెయ్యాలి.
- అదే విధంగా Email ID కూడా నమోదు చెయ్యాలి.
- తరువాత క్రింద చూపిస్తున్న Next పై క్లిక్ చెయ్యాలి.
Step 8: Aadhaar Details నమోదు చేయండి
- Aadhaar Number దగ్గర క్లిక్ చేసి ఆధార్ నెంబర్ నమోదు చెయ్యాలి.
- ఒకవేళ మీ దగ్గర ఆధార్ లేకపోతే, “I am not able to furnish my Aadhaar Number because I don’t have Aadhaar Number” ను సెలెక్ట్ చేసుకోవాలి మరియు ఈ ఆప్షన్ ను ఎంచుకుంటే మీ BLO కి అప్లికేషన్ form సబ్మిట్ చెయ్యవలసి ఉంటుంది.
- Gender దగ్గర మగవాళ్ళు “Male”, ఆడవాళ్ళు “Female” ఎపిక చెయ్యవలసి ఉంటుంది.
Step 9: Date of Birth details నమోదు చేయండి
- తేదీ/నెల/సంవత్సరం రూపం లో పుట్టిన తేదీని నమోదు చేయాలి.
- Self attested copy of document supporting age proof attached దగ్గర ఉన్న “Document for proof of Date of Birth” వద్ద టిక్ చేసి Select Document లో మీ దగ్గర ఉన్న Document పేరు ఎంచుకోవాలి. దాదాపు గా అందరి దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది కనుక Aadhaar Card ని ఎంచుకోవడం ఉత్తమం.
- Choose File దగ్గర 2 MB లోపల ఉన్న PDF లేదా jpg/png form లో ముందు స్టెప్ లో సెలెక్ట్ చేసుకున్న డాక్యుమెంట్ ని అప్లోడ్ చెయ్యాలి. PDF రూపం లో అప్లోడు చేయడం ఉత్తమం.
- గమనిక: అప్లోడు చేసే డాక్యుమెంట్ కాపీ పై మీ సంతకం చేయవలసి ఉంటుంది.
Step 10: ప్రస్తుత చిరునామా వివరాలు నమోదు చేయండి
- మీరు ఏ డాక్యుమెంట్ ని చిరునామా proof గా అప్లోడు చేశారో ఆ డాక్యుమెంట్ లో ఉన్న విధం గా పూర్తి చిరునామా నమోదు చేయాలి. (ఒకవేళ ఆధార్ ని అప్లోడు చెయ్యలను అనకుంటే ఆధార్ లో ఉన్న విధంగా మీ పూర్తి చిరునామా నమోదు చేయాలి).
- Document for Proof of Residence దగ్గర మీ వద్ద ఉన్న చిరునామా proof డాక్యుమెంట్ పేరు ఎంపిక చేసుకోవాలి. చిరునామా proof డాక్యుమెంట్ మీ పేరు న కచ్చితం గా మీ పేరు మీదే ఉండవాలిసిన అవసరం లేదు, మీ relatives అడ్రసు ప్రూఫ్ అయిన పరవాలేదు.
- Choose File దగ్గర 2 MB లోపల ఉన్న PDF లేదా jpg/png form లో ముందు స్టెప్ లో సెలెక్ట్ చేసుకున్న డాక్యుమెంట్ ని అప్లోడ్ చెయ్యాలి. PDF రూపం లో అప్లోడు చేయడం ఉత్తమం.
Step 11: అంగవైకల్య వివరాలు (ఉంటే మాత్రమే) నమోదు చేయండి
- ఒకవేళ మీకు అంగవికల్యం ఉంటే ఈ సెక్షన్ లో నమోదు చేయాలి. లేకుంటే విడిచి పెట్టేయవచ్చు.
Step 12: ప్రస్తుత చిరునామాలో ఇప్పటికే ఓటర్ జాబితాలో ఉన్న కుటుంబ సభ్యుని వివరాలు నమోదు చేయండి
- ఈ స్టెప్ లో మనం మన ప్రస్తుతం నివసిస్తున్న చిరునామాలో ఇప్పటికే ఓటర్ల జాబితాలో చేర్చబడిన మన కుటుంబ సభ్యుని వివరాలు నమోదు చేయాలి.
- కుటుంబ సభ్యుని పేరు, మీకు ఏమవుతారు, వల్ల EPIC (Voter ID) నంబర్ నమోదు చేయాలి.
Step 13: డిక్లరేషన్ ఇవ్వండి
- ఈ స్టెప్ లో మనం ఇప్పటి వరకు నమోదు చేసిన సమాచారం యధారధ్యం అని నిర్ధారించుటకు.
- i . మీ పుట్టిన ప్రాంతం అనగా Village (గ్రామం). State (రాష్ట్రం), District (జిల్లా) నమోదు చెయ్యాలి.
- ii. I am ordinarily a resident at the address mentioned at Section 8(a) in Form 6 since దగ్గర మీరు ప్రస్తుతం ఉంటున్న అడ్రసు లో ఎన్ని సంవత్సరాలు నుండి ఉంటునరో నెలలు మరియు సంవత్సరాలు నమోదు చెయ్యాలి.
- iv I don’t possess any of the mentioned documents for proof of Date of Birth/Age. Therefore, I have enclosed, below mentioned document in support of age proof. (Leave blank, if not applicable) దగ్గర మనం ఒకవేళ పుట్టిన తేదీ డాక్యుమెంట్ 7 (b) వద్ద ఉన్నవి కాకుండా వేరే డాక్యుమెంట్ అప్లోడు చేసినట్టు అయితే ఆ డాక్యుమెంట్ పేరు ఇక్కడ నమోదు చేయాలి. లేకుంటే కాలి విడిచిపెట్టేయవచ్చు.
- v. ఈ పాయింట్ లో మీ ప్రాంతం పేరు నమోదు చేసి, Next పై క్లిక్ చేయాలి
- చివరిగా Captcha నమోదు చేసి Preview and Submit ఛేయాలి.

Submit చేసిన తర్వాత Preview పేజి కనిపిస్తుంది. నమోదు చేసిన వివరాలను జాగ్రత్తగా పరిశీలించాలి , ఈ పేజి క్రింది బాగాన ఉన్న eSign & Submit పై క్లిక్ చేసి CDAC’s ఆధార్ eSign పేజి లో కి enter అవ్వాలి.
Step 14: ఆధార్ eSign ద్వారా ధృవీకరించండి

- ఈ పేజి లో Enter Aadhaar దగ్గర మీ ఆధార్ నెంబర్ నమోదు చేసి Get OTP పై క్లిక్ చెయ్యాలి.
- Enter Your Aadhaar OTP దగ్గర మీ Mobile కి వచ్చిన OTP ఎంటర్ చేసి, క్రింద “I hereby state that…” పక్కన ఉన్న బాక్స్ పై టిక్ చేసి Submit పై క్లిక్ చెయ్యాలి.

- ఈ పేజి లో మీకు Reference Number కనిపిస్తుంది, ఆ నెంబర్ ని Save చేసుకోండి మరియు Download Acknowledgement పై క్లిక్ చేసి Acknowledgement Slip ని సేవ్ చేసుకోవాలి.
సాధారణంగా జరిగే తప్పులు | Common Mistakes
- ఆధార్ లో ఉన్న పేరు కంటే వేరే పేరు నమోదు చేయడం
- స్పష్టంగా కనిపించని డాక్యుమెంట్ అప్లోడ్ చేయడం.
- తప్పు నియోజకవర్గం ఎంపిక చేయడం.
- సంతకం చేయకుండా డాక్యుమెంట్ అప్లోడ్ చేయడం.
- OTP నమోదు చేయకుండా పేజి క్లోజ్ చేయడం.
- తప్పు మొబైల్ నంబర్ నమోదు చేయడం.
దరఖాస్తు స్టేటస్ ఎలా చెక్ చేయాలి? | Track Voter ID Application Status
- Voter Services Portal (Official Website)
వెబ్‌సైట్‌కు వెళ్ళండి. Mobile నెంబర్ తో లాగిన్ అవ్వాలి. - “Track Application Status” ఎంచుకోండి.
- మీ Reference Number లేదా Mobile Number ఎంటర్ చేయండి.
- స్టేటస్ తక్షణమే కనిపిస్తుంది
లేదా నేరుగా కాల్ చేయండి: 📞 1950 (Voter Helpline — ఉచితం, 24×7)
ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేయడం ఎలా? | Offline Voter ID Application in AP
ఇంటర్నెట్ సదుపాయం లేకపోతే, మీరు ఆఫ్‌లైన్ పద్ధతిలో కూడా దరఖాస్తు చేయవచ్చు:
స్టెప్ 1: మీ నియోజకవర్గంలోని Booth Level Officer (BLO) లేదా Electoral Registration Officer (ERO) కార్యాలయానికి వెళ్ళండి.
స్టెప్ 2: Form 6 తీసుకుని, అన్ని వివరాలు నింపండి.
స్టెప్ 3: అవసరమైన డాక్యుమెంట్ల జిరాక్స్ కాపీలు జతచేయండి.
స్టెప్ 4: దరఖాస్తు సమర్పించి రసీదు తీసుకోండి.
గమనిక: Form 6 ఉచితంగా లభిస్తుంది. ఎవరైనా డబ్బులు అడిగితే నిరాకరించండి మరియు 1950 కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి.
ముఖ్యమైన లింకులు | Important Links & Contacts
| సేవ | వివరాలు |
|---|---|
| అధికారిక వెబ్సైట్ | Apply New Voter ID Online – Official Website |
| AP CEO వెబ్సైట్ | AP CEO వెబ్సైట్ |
| ఓటర్ లిస్ట్‌లో పేరు వెతకండి | Electoral Search |
| Voter Helpline | 1950 (ఉచితం) |
| Voter Helpline App | Voter Helpline App |
| AP Chief Electoral Officer | Velagapudi, Amaravati |
తరచుగా అడిగే ప్రశ్నలు | FAQ — Voter ID AP 2026
Q: ఓటర్ ID కార్డు కోసం దరఖాస్తు ఉచితమా?
A: అవును, పూర్తిగా ఉచితం. ఎలాంటి రుసుము అవసరం లేదు.
Q: Voter ID వచ్చే వరకు ఎంత సమయం పడుతుంది?
A: సాధారణంగా 30 నుండి 45 రోజులు పడుతుంది. BLO మీ ఇంటికి వచ్చి వివరాలు వెరిఫై చేసిన తర్వాత కార్డు పోస్ట్ ద్వారా పంపబడుతుంది.
Q: 18 సంవత్సరాలు రాకముందే దరఖాస్తు చేయవచ్చా?
A: అవును! January 1 నాటికి 18 నిండే వాళ్ళు ముందే దరఖాస్తు చేయవచ్చు.
Q: నా పేరు ఓటర్ లిస్ట్‌లో ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి?
A: Electoral Search లో మీ పేరు సెర్చ్ చేయండి.
Q: చిరునామా మారితే ఏం చేయాలి?
A: Form 8 ద్వారా చిరునామా మార్పు కోసం దరఖాస్తు చేయవచ్చు — అదే voters.eci.gov.in వెబ్సైట్లో.
Q: Voter ID పోతే ఏం చేయాలి?
A: e-EPIC డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా Duplicate Voter ID కోసం Form 002 ద్వారా దరఖాస్తు చేయవచ్చు.
ముగింపు | Conclusion
ఓటర్ ID కార్డు పొందడం చాలా సులభం — అది ఆన్లైన్లో అయినా, ఆఫ్‌లైన్‌లో అయినా. ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా మీ ఓటు హక్కును వినియోగించుకోండి. ఈ గైడ్ మీకు సహాయపడిందని ఆశిస్తున్నాం. మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు కూడా ఈ సమాచారం పంచండి — ప్రతి ఓటు విలువైనది!
ఈ వ్యాసం భారత ఎన్నికల సంఘం అధికారిక మార్గదర్శకాల ఆధారంగా రాయబడింది.
జై ప్రజాస్వామ్యం | జై భరతమాత