Aadhaar PVC Card Order Online 2026 – స్టెప్ బై స్టెప్ పూర్తి గైడ్ (తెలుగు) 2026

భౌతిక ఆధార్ కార్డు (Paper Aadhaar) చిరిగిపోవడం లేదా పాడవడం వంటి సమస్యలు తరచుగా ఎదురవుతుంటాయి. ఈ సమస్యలకు పరిష్కారంగా UIDAI అందిస్తున్న Aadhaar PVC Card చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ గైడ్‌లో Aadhaar PVC Card Order Online 2026 గురించి పూర్తి వివరాలు, ఫీజు, డెలివరీ టైమ్, స్టేటస్ చెక్ విధానం, అలాగే e-Aadhaarతో పోలికను సులభంగా తెలుసుకోవచ్చు.

Aadhaar PVC Card order online step by step process screenshot

ఈ ఆర్టికల్‌లో మీరు తెలుసుకునే విషయాలు:

  • Aadhaar PVC Card అంటే ఏమిటి?
  • Aadhaar PVC Card Order Online ఎలా చేయాలి?
  • Aadhaar PVC Card ఫీజు ఎంత?
  • డెలివరీ టైమ్ & స్టేటస్ చెక్ విధానం.
  • Aadhaar PVC Card vs e-Aadhaar vs Paper Aadhaar.
  • తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs).

Aadhaar PVC Card అంటే ఏమిటి?

Aadhaar PVC Card అనేది UIDAI అధికారికంగా జారీ చేసే ప్లాస్టిక్ ఆధార్ కార్డు. ఇది ATM / Debit Card సైజ్‌లో ఉంటుంది మరియు దీర్ఘకాలం మన్నికగా ఉంటుంది.

ఇది భౌతిక ఆధార్ కార్డుకు (Paper Aadhaar) ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు.


Aadhaar PVC Card – ముఖ్య లక్షణాలు

  • Credit Card సైజ్ – సులభంగా పర్స్‌లో పెట్టుకోవచ్చు.
  • బలమైన PVC మెటీరియల్.
  • Secure QR Code.
  • Hologram & Ghost Image.
  • Digital Signature ఉన్న అధికారిక కార్డు.
  • అన్ని ప్రభుత్వ & ప్రైవేట్ సేవలకు చెల్లుబాటు.

Aadhaar PVC Card Order చేయడానికి అవసరమైనవి

అవసరంవివరాలు
Aadhaar Number / VID12 అంకెల ఆధార్ లేదా 16 అంకెల VID
Mobile Numberఆధార్‌తో లింక్ అయి ఉండాలి
OTPమొబైల్‌కు వచ్చే OTP
PaymentUIDAI నిర్ణయించిన Fee

PVC Aadhaar Card ని Online లో Order చేసే పూర్తి విధానం

Method 1: ఆధార్‌తో మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటే

ఒకవేళ మీ ఆధార్ నెంబర్‌తో మొబైల్ నెంబర్ ఇప్పటికే లింక్ అయి ఉంటే, క్రింది స్టెప్స్ ఫాలో అవ్వండి:

Step 1: myAadhaar అధికారిక వెబ్‌సైట్‌లో Login పై క్లిక్ చేసి, Aadhaar Number + Captcha ఎంటర్ చేసి Login with OTP ద్వారా లాగిన్ అవ్వండి.

myAadhaar portal (UIDAI Official)
myAadhaar portal login page for Aadhaar PVC card order

Step 2: లాగిన్ అయిన తరువాత Services లిస్ట్‌లో ఉన్న “Order Aadhaar PVC Card” ఆప్షన్ పై క్లిక్ చేయండి.

Order Aadhaar PVC Card option in myAadhaar services list when mobile number linked to aadhaar

Step 3: తదుపరి పేజీలో మీ Demographic Details కనిపిస్తాయి: Name, Date of Birth (DOB), Gender, Address

చూపిస్తున్న వివరాలు సరైనవిగా ఉంటే NEXT పై క్లిక్ చేయండి

వివరాలు తప్పుగా ఉంటే ఏమి చేయాలి?

Step 4: Step 3 లో NEXT పై క్లిక్ చేసిన తరువాత Payment Page ఓపెన్ అవుతుంది. అందులో మీకు PVC కార్డు ఆర్డర్ చేయుటకు చెల్లించావలిసిన Fee రుసుము కనిపిస్తుంది. Same Page లో ఉన్న “I hereby confirm that I have read and understood the Payments / Cancellation / Refunds Process” అనే ఆప్షన్‌ని టిక్ చేయండి.

Make Payment పై క్లిక్ చేయండి.

Step 5: తరువాత పేజీ లో ఉన్న Payment options (Credit Card, Debit Card, UPI, Net Banking, PayTM) లలో మీకు సౌకర్యంగా ఉన్న చెల్లింపు విధానాన్ని ఎంచుకుని ఫీజు చెల్లించండి

online payment page showing fee

చెల్లింపు పూర్తయ్యాక:

  • Payment Successful అని చూపిస్తుంది
  • క్రింద SRN Number కనిపిస్తుంది
  • Download Acknowledgement పై క్లిక్ చేసి రిసీప్ట్ సేవ్ చేసుకోండి

గమనిక: SRN నెంబర్ ద్వారా మీ Aadhaar PVC Card Order Status ను ట్రాక్ చేయవచ్చు


Method 2: ఆధార్‌తో మొబైల్ నెంబర్ లింక్ లేకపోతే

మీ ఆధార్ నెంబర్‌తో మొబైల్ నెంబర్ లింక్ అయి లేకపోయినా కూడా PVC కార్డును ఆర్డర్ చేయవచ్చు.

Step 1: myAadhaar అధికారిక వెబ్‌సైట్ Open చెయ్యాలి

Order Aadhaar PVC Card option in myAadhaar services list when mobile number not linked to aadhar
myAadhaar portal (UIDAI Official)

Step 2: myAadhaar Home పేజీలో లో “Order Aadhaar PVC Card” పై క్లిక్ చేయండి.

తదుపరి పేజీలో:

Step 3: మీకు అందుబాటులో ఉన్న Aadhaar Number / Enrolment ID / SID Select చేసుకొని ఆ Number ఎంటర్ చేయండి.

  • Captcha నమోదు చేయండి.
  • “My mobile number is not registered” అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి
  • తరువాత SEND OTP పై క్లిక్ చేయండి
  • అదే పేజీలో OTP వెరిఫై చేసి
  • Terms & Conditions అంగీకరించి
  • SUBMIT పై క్లిక్ చేయండి

ఇప్పుడు Payment Page ఓపెన్ అవుతుంది.

Step 4: Step 3 లో SUBMIT పై క్లిక్ చేసిన తరువాత Payment Page ఓపెన్ అవుతుంది. అందులో మీకు PVC కార్డు ఆర్డర్ చేయుటకు చెల్లించావలిసిన Fee రుసుము కనిపిస్తుంది. Same Page లో ఉన్న “I hereby confirm that I have read and understood the Payments / Cancellation / Refunds Process” అనే ఆప్షన్‌ని టిక్ చేయండి.

  • Payment confirmation ఆప్షన్‌ని టిక్ చేసి Make Payment పై క్లిక్ చేయండి

Payment process Method 1 లాగే ఉంటుంది.

How to Check Aadhaar PVC card order status (డెలివరీ స్టేటస్‌ చెక్)

Check Aadhaar PVC card order status

పై అధికారిక లింక్ ఓపెన్ చేసి SRN నెంబర్ మరియు Captcha ఎంటర్ చేసి status check చేయండి.


Aadhaar PVC Card delivery time (డెలివరీ ఎన్ని రోజులు పడుతుంది)?

  • Aadhaar PVC Card ఆర్డర్ విజయవంతంగా చేసిన తర్వాత, రిక్వెస్ట్ చేసిన తేదీని మినహాయించి 5 పని దినాల్లో UIDAI కార్డును ప్రింట్ చేసి India Post (Speed Post) ద్వారా పంపిస్తుంది.
    ఆ తర్వాత మీ ఆధార్‌లో నమోదు చేసిన చిరునామాకు Speed Post డెలివరీ నిబంధనల ప్రకారం కార్డు చేరుతుంది.
  • మీరు India Post ట్రాకింగ్ సర్వీస్ ద్వారా మీ Aadhaar PVC Card డెలివరీ స్టేటస్‌ను ట్రాక్ చేయవచ్చు.
  • మీ ఆధార్‌లో ఉన్న చిరునామాకే వస్తుంది
Department of Posts Home Page

Aadhaar PVC Card vs e-Aadhaar vs Paper Aadhaar

అంశంPVC Carde-AadhaarPaper Aadhaar
మన్నికచాలా ఎక్కువDigitalతక్కువ
సైజ్Card sizePDFA4 paper
Official YesYesYes
CarryEasyMobileInconvenient

Aadhaar PVC Card చెల్లుబాటు అవుతుందా?

అవును.

UIDAI ప్రకారం:

  • Aadhaar PVC Card
  • e-Aadhaar
  • Masked Aadhaar

ఇవన్నీ సమానంగా చెల్లుబాటు అయ్యే అధికారిక పత్రాలు.

గమనిక: ఈ సమాచారం UIDAI అధికారిక మార్గదర్శకాల ఆధారంగా ఇవ్వబడింది.
సేవా నియమాలు కాలక్రమేణా మారవచ్చు.

ముగింపు

Aadhaar PVC Card Order Online అనేది సులభమైన, భద్రమైన మరియు ఖర్చు తక్కువ విధానం. భౌతిక ఆధార్ కార్డు పాడవకుండా ఉండాలంటే PVC Card ఉత్తమ ఎంపిక.

మీకు ఈ గైడ్ ఉపయోగపడితే, ఇతరులకు షేర్ చేయండి.

Related Articles:


తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

Q1: Aadhaar PVC Card ఉచితమా?

లేదు. UIDAI నిర్ణయించిన Fee pay చెయ్యవలసి ఉంటుంది.

Q2: PVC Card లేకపోతే e-Aadhaar సరిపోతుందా?

అవును. కానీ physical proof అవసరమైనప్పుడు PVC Card ఉపయోగకరం.

Q3: ఒకే ఆధార్‌కు ఎన్ని PVC Cards ఆర్డర్ చేయవచ్చు?

ఎన్ని సార్లైనా ఆర్డర్ చేయవచ్చు.

Q4: SRN అంటే ఏమిటి?

SRN (Service Request Number) అనేది మీ PVC Card ఆర్డర్ ట్రాకింగ్ కోసం ఉపయోగించే రిఫరెన్స్ నంబర్.

Q5: OTP రావడం లేదంటే?

మొబైల్ నంబర్ ఆధార్‌తో లింక్ అయి ఉందో లేదో చెక్ చేయండి. Network సమస్య ఉంటే కొద్దిసేపటి తర్వాత ప్రయత్నించండి.

Q6: Payment Failed అయితే?

Amount auto-refund అవుతుంది. మళ్లీ ఆర్డర్ చేయవచ్చు.


Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top