ఆంధ్రప్రదేశ్‌లో మీ భూమి యాజమాన్య వివరాలు (Ownership Details) తెలుసుకోవాలంటే 1B (ROR – Record of Rights) డాక్యుమెంట్ చాలా ముఖ్యమైనది. ఇప్పుడు మీరు ఇంటి నుండే మీ మొబైలు లో 2 నిమిషాల్లో అధికారిక Meebhoomi Portal ద్వారా AP 1B Download Online చేసుకోవచ్చు.
ఈ పోర్టల్‌ను Government of Andhra Pradesh నిర్వహిస్తుంది.
ఈ గైడ్‌లో మీరు:
- 1B అంటే ఏమిటి?
- ROR 1B PDF Download ఎలా చేయాలి?
- 1B & Adangal తేడా.
- సాధారణ సమస్యలు & పరిష్కారాలు.
- FAQ.
అన్నీ పూర్తి వివరంగా తెలుసుకుంటారు.

1B (ROR) అంటే ఏమిటి?
ROR (Record of Rights) లేదా 1B అనేది భూమి యాజమాన్య రికార్డు.
ఇందులో సాధారణంగా ఉంటాయి:
- భూమి రకం.
- Pattadar (పట్టాదారు) పేరు.
- సర్వే నంబర్.
- భూమి విస్తీర్ణం.
- ఖాతా నంబర్.
Step 1: Mobile OTP ద్వారా Login అవ్వండి

- పై లింక్ పై క్లిక్ చేసి మీ భూమి official portal ఓపెన్ చెయ్యాలి.
- Login పేజి లో మీ మొబైలు నెంబర్ నమోదు చేసి Get OTP పై క్లిక్ చెయ్యాలి.
- మీ ఫోన్ కి వచ్చిన OTP మరియు Captcha ఎంటర్ చేసి Login అవ్వగలరు.
Step 2: మీ 1-బి / గ్రామ 1-బి ఆప్షన్ ఎంపిక చేసుకొనుట

- Login అయిన తరువాత,
- మీ భూమి వివరాలకోసం క్లిక్ చేయండి క్రింద ఉన్న మీ 1-బి/గ్రామ 1-బి పై క్లిక్ చెయ్యాలి.
- ఇది ROR 1B Download Online కోసం ఉపయోగించే ఆప్షన్.
Step 3: మీ అడంగల్ (గ్రామ లెక్కలు – 3) వివరాలు నమోదు చేయుట

- జిల్లా ఎంచుకోండి దగ్గర క్లిక్ చేసి డ్రాప్ డౌన్ లో మీ జిల్లని ఎంపిక చేసుకోవాలి.
- మండలం ఎంచుకోండి దగ్గర మీ మండలం ని ఎంపిక చేసుకోవాలి.
- గ్రామం ఎంచుకోండి దగ్గర మీ గ్రామం ను ఎంపిక చేసుకోవాలి.
- మీరు గ్రామం పేరు ఎంచుకున్న తరువాత మీకు Pattadar Name ఆప్షన్ ఓపెన్ అవుతుంది.
- Pattadar Name పక్కన ఉన్న చెక్ బాక్స్ పై క్లిక్ చేసిన తరువాత,
డ్రాప్ డౌన్ లో మీ పట్టాదారు పేరు ఎంచుకోవాలి. - క్రింద గ్రీన్ కలర్ లో ఉన్న క్లిక్ చెయ్యండి option పై క్లిక్ చెయ్యాలి.
Step 4: ROR-1B Report భద్ర పరుచుకొనుట (Download / Print)

- ఈ పేజి లో మీకు 1 బి రిపోర్ట్ కనిపిస్తుంది.
- 1B ని Print లేదా PDF Download చేయాలంటే, పేజీ కుడి భాగం పై మూలలో ఉన్న PDF symbol పై క్లిక్ చేయాలి.
- ఈ విధంగా మీరు మీ 1B Download Online ను సులభంగా పూర్తి చేయగలరు.
1B ఉపయోగాలు:
- బ్యాంక్ లోన్ కోసం.
- ల్యాండ్ రిజిస్ట్రేషన్.
- కోర్టు వ్యవహారాలు.
- భూమి వివాద పరిష్కారం.
- ప్రభుత్వ పథకాలు.
1B మరియు Adangal మధ్య తేడా
| 1B (ROR) | అడంగల్ |
|---|---|
| Ownership వివరాలు | పంటలు & సాగు వివరాలు |
| Pattadar పేరు | సాగు రకం |
| సర్వే నంబర్ | వ్యవసాయ సమాచారం |
| లీగల్ ఉపయోగం ఎక్కువ | వ్యవసాయ ఉపయోగం |
| సాధారణం గా 1B అనేది ఒక వ్యక్తి కి ఒక రెవెన్యూ గ్రామం లో ఉన్న మొత్తం భూమి సమాచారం తెలియచేస్తుంది. | సాధారణం గా అడంగల్ అనేది ఒక సర్వే/LPN కి సంబంధించిన సాగు వివరాలు తెలియచేస్తుంది. |
| 1B సమాచారం కాలనుసరం మారదు, భూమార్పిడి జరిగినప్పుడు మాత్రమే మారుతుంది | అడంగల్ సమాచారం పంట సాగు అనుసరించి కాలనుసరం మారుతుంది. |
బ్యాంకు రుణాలు (Loans), రిజిస్ట్రేషన్ మరియు భూమి విక్రయాలకు ఇది కీలకం. | పంట నష్టపరిహారం, రైతు బందు/PM-Kisan, మరియు సాగు ధృవీకరణ కోసం అవసరం. |
1B Download Online-సాధారణ సమస్యలు & పరిష్కారాలు
OTP రాకపోతే
- Network చెక్ చేయండి.
- కొంతసేపటి తర్వాత మళ్లీ ప్రయత్నించండి.
Pattadar Name కనిపించకపోతే
- జిల్లా / గ్రామం తప్పుగా ఎంపిక చేసి ఉండవచ్చు.
PDF Download కాకపోతే
- Popup blocker disable చేయండి.
- మరో browser ప్రయత్నించండి.
Server Busy Error
- రాత్రి సమయంలో ప్రయత్నించడం ఉత్తమం.
1B Legal Validity
Meebhoomi Portal నుండి Download చేసిన 1B PDF చాలా సందర్భాల్లో సరిపోతుంది.
అయితే:
- కోర్టు కేసులు
- రిజిస్ట్రేషన్ లావాదేవీలు
వంటి సందర్భాల్లో MRO కార్యాలయం నుండి సర్టిఫైడ్ కాపీ అవసరం కావచ్చు.
Related Articles
తరుచూ అడుగు ప్రశ్నలు (FAQs)
Q1: 1B Download Online ఫ్రీనా?
అవును. మీ భూమి portal ద్వారా 1B Download Online పూర్తిగా ఉచితం.
Q2: 1B మరియు Adangal ఒకటేనా?
కాదు. 1B (ROR) లో ownership వివరాలు ఉంటాయి.
Adangal లో పంటలు, సాగు వివరాలు ఉంటాయి.
Q3: Mobile OTP రాకపోతే ఏమి చేయాలి?
Network సమస్య ఉంటే కొంత సమయం తర్వాత మళ్లీ ప్రయత్నించండి.
సరైన మొబైల్ నెంబర్ నమోదు చేశారో లేదో చెక్ చేయండి.
Q4: 1B PDF ని అధికారిక డాక్యుమెంట్ గా వాడవచ్చా?
అవును. చాలా సందర్భాలలో 1B PDF Download కాపీ సరిపోతుంది.
కానీ లీగల్ అవసరాలకు MRO కార్యాలయం నుండి సర్టిఫైడ్ కాపీ అవసరం కావచ్చు.
Q5: Pattadar Name కనిపించకపోతే ఏమి చేయాలి?
గ్రామం లేదా జిల్లా తప్పుగా ఎంపిక చేస్తే Pattadar Name చూపించదు.
సరైన వివరాలతో మళ్లీ ప్రయత్నించండి.