భారతదేశంలో e-PAN Apply Online చేయడానికి రెండు ప్రధాన Online మార్గాలు అందుబాటులో ఉన్నాయి.
- Instant e-PAN Facility (Income Tax Portal ద్వారా).
- Standard e-PAN Application (Protean / UTIITSL ద్వారా).
ఈ ఆర్టికల్‌లో e-PAN Apply Online అప్లికేషన్‌కు ఉన్న రెండు విధానాల ముఖ్యమైన అంశాలు మరియు మీ అవసరానికి ఏ విధానం సరిపోతుందో స్పష్టంగా స్టెప్ బై స్టెప్ తెలుగు లో వివరించాం. ఈ గైడ్ మొదటిసారి e-PAN కోసం అప్లై చేయాలనుకునే వ్యక్తులు, తక్షణ అవసరాల కోసం Instant e-PAN కి అప్లై చెయ్యాలనుకున్న వారికి ఈ గైడ్ ఉపయోగపడుతుంది.
e-PAN అంటే ఏమిటి?
e-PAN అనేది PAN కార్డు యొక్క డిజిటల్ (PDF) వెర్షన్.
ఇది:
- Income Tax filings.
- Bank, mutual funds, KYC.
- Government & financial services.
అన్నిటికీ physical PAN లాగే చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతుంది.
e-PAN Apply Online చేయడానికి ఉన్న 2 మార్గాలు
క్రింద ఉన్న పట్టికలో Instant e-PAN మరియు Standard e-PAN మధ్య ముఖ్యమైన తేడాలను ఒక చూపులో అర్థం చేసుకోవచ్చు.
| అంశం | Instant e-PAN (Income Tax Portal) | Standard e-PAN (Protean / UTIITSL) |
|---|---|---|
| Fee | Free | Paid |
| Processing Time | 10 నిమిషాలు – కొన్ని గంటలు | కొన్ని గంటలు – 2 రోజులు (method ఆధారంగా) |
| Application Mode | Aadhaar ఆధారిత e-KYC మాత్రమే | Aadhaar ఆధారిత e-KYC లేదా Scan + e-Sign |
| Photo | Aadhaar లో ఉన్న ఫోటో మాత్రమే | Aadhaar ఫోటో లేదా Custom photo upload (method ఆధారంగా) |
| Eligible Applicants | Individuals (Minors కాదు) | Individuals, Minors, Corrections, Reprints |
| Physical PAN Option | లేదు | Available |
| Best For | తక్షణ అవసరాల కోసం | పూర్తి వివరాలు & Physical PAN కోసం |
Instant e-PAN Facility (Income Tax e-Filing Portal)
ఈ విధానం Income Tax Department అందించే పూర్తిగా paperless & free service.
ఎవరికీ ఇది సరిపోతుంది?
- మొదటిసారి PAN Card కోసం అప్లై చేసే వారికి.
- Individuals (Minors కాదు).
- Aadhaar కు mobile number linked ఉన్నవారు.
- Aadhaar లో పూర్తి పుట్టిన తేది (DD-MM-YYYY) ఉన్నవారు.
- గమనిక
- PAN కార్డుపై ప్రింట్ అయ్యే పేరు, ఫోటో, చిరునామా వంటి వివరాలు పూర్తిగా ఆధార్‌లో ఉన్న. సమాచారాన్ని ఆధారంగా తీసుకోబడుతుంది.
- Physical signature ఉండదు.
ఒకవేళ మీ ఆధార్‌కు మొబైల్ నంబర్ లింక్ చేయబడకపోతే, మా స్వతంత్ర వెబ్‌సైట్ esachivalayam.in లో ప్రచురించిన “Aadhaar Mobile Number Update Online via App – పూర్తి స్టెప్ బై స్టెప్ గైడ్” ను అనుసరించి ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
Instant e-PAN Apply Online & Download చేయడం ఎలా? – స్టెప్ బై స్టెప్ పూర్తి గైడ్
Step 1: Get New e-PAN సెలక్షన్
- క్రింద ఇవ్వబడిన అధికారిక లింక్‌పై క్లిక్ చేసి Income Tax e-Filing Portal ను ఓపెన్ చేయాలి.

Income Tax e-Filing Portal చూపించిన Get New e-PAN ఆప్షన్ పై క్లిక్ చెయ్యాలి.
Step 2: Enter Aadhaar Number

- Enter your 12 digit Aadhaar number for PAN allotment దగ్గర Aadhaar number ఎంటర్ చేయాలి.
- I confirm that వద్ద టిక్ చెయ్యాలి.
- క్రింద చూపబడిన Continue పై క్లిక్ చేసిన తరువాత ఆధార్ Authentication consent పేజీ ఓపెన్ అవుతుంది.
Step 3: OTP Validation
- ఈ page లో Consent Declaration for Generation of New PAN based on Aadhaar e-KYC instructions కనిపిస్తాయి.
- ఈ page క్రింద బాగాన i have read the consent terms and agree to proceed further దగ్గర టిక్ చేసి Generate Aadhaar OTP పై క్లిక్ చెయ్యాలి.
- మీ ఆధార్ కు లింక్ ఐన mobile నెంబర్ కు OTP వస్తుంది. ఆ OTP ని OTP Verification పేజి లో చూపించిన Enter the OTP దగ్గర ఎంటర్ చెయ్యాలి.
- I agree to validate my Aadhaar details with UIDAI దగ్గర టిక్ చేసి Continue పై క్లిక్ చెయ్యాలి.
Step 4: Validate Aadhaar Details
Your Personnel Data based on Aadhaar e-KYC
- ఈ పేజీలో మీ ఆధార్‌లో ఉన్న డెమోగ్రాఫిక్ వివరాలు — ఫోటో, పేరు, పుట్టిన తేది, లింగం (Gender) — అలాగే మొబైల్ నంబర్, ఈమెయిల్, చిరునామా (Address) స్పష్టంగా కనిపిస్తాయి.

- మీ ఆధార్‌తో రిజిస్టర్ చేసిన Email ID ని లింక్ చేయడం / వాలిడేట్ చేయడం ఐచ్చికం (Optional).
- అంటే, Email ID లింక్ చేయడం తప్పనిసరి కాదు. మీరు కోరుకుంటే మాత్రమే ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. లేదు అనుకుంటే విడిచిపెట్టేయొచ్చు.
- ఒకవేళ Email ID దగ్గర Not Linked అని ఉంటే, దాని పక్కన ఉన్న Link Email ID పై క్లిక్ చేయాలి. తరువాత ఈమెయిల్ ఐడి నమోదు చేయడానికి ఒక ఎంట్రీ బాక్స్ కనిపిస్తుంది. ఆ బాక్స్‌లో మీ Email ID నమోదు చేసి SEND OTP పై క్లిక్ చేయాలి.
- మీరు నమోదు చేసిన ఈమెయిల్ ఐడీకి OTP వస్తుంది. ఆ OTPని ఈ పేజీలోని Email OTP ఫీల్డ్‌లో నమోదు చేసి Submit పై క్లిక్ చేయాలి.
- ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత, Email ID దగ్గర Verified అని కనిపిస్తుంది.
- I Accept that దగ్గర చెక్ బాక్స్ పై క్లిక్ చేసి, Continue పై క్లిక్ చెయ్యాలి.
Step 5: Acknowledgement Number Saving

- సబ్మిషన్ విజయవంతంగా పూర్తైన వెంటనే, Acknowledgement Number తో కూడిన ఒక Success Message స్క్రీన్‌పై కనిపిస్తుంది.
- ఈ Acknowledgement నెంబర్ ను భవిష్యత్తులో అప్లికేషన్ స్టేటస్ చెక్ చేయడానికి మరియు e-PAN డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఉపయోగ పడుతుంది కనుక తప్పనిసరిగా నోట్ చేసుకోవాలి.
- అదేవిధంగా, ఆధార్‌తో లింక్ అయిన మీ మొబైల్ నంబర్‌కు కూడా Acknowledgement Number మెసేజ్ (SMS) వస్తుంది.
Step 6: PAN Check Status / Download e-PAN విధానం

- PAN Check Status / Download e-PAN పేజీలో మీ 12 అంకెల ఆధార్ నంబర్ నమోదు చేసి Continue పై క్లిక్ చేయాలి.

- తరువాత ఓపెన్ అయ్యే Current Status of Your New e-PAN Request పేజీలో PAN Alloted Successfully అని చూపించినప్పుడు, Download e-PAN పై క్లిక్ చేసి మీ e-PAN ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
- గమనిక
- సాధారణంగా e-PAN 10 నిమిషాల నుంచి కొన్ని గంటలలో జనరేట్ అవుతుంది; అయితే వెరిఫికేషన్ లేదా సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం జరిగే అవకాశం ఉంది.
- గమనిక (Password):
- డౌన్‌లోడ్ చేసిన e-PAN ఫైల్ ఓపెన్ చేయడానికి పాస్‌వర్డ్ అవసరం.
- మీ Date of Birth:
12/02/2000అయితే, - Password:
12022000(DDMMYYYY ఫార్మాట్‌లో).
- మీ Date of Birth:
Merits (లాభాలు)
- పూర్తిగా ఉచితం
- 10 నిమిషాల నుంచి కొన్ని గంటలలో జనరేట్ అవుతుంది e-PAN.
- No photo, signature, documents upload అవసరం లేదు.
- 100% paperless.
e-PAN నుంచి Physical PAN Card పొందడం & Corrections చేయడం ఎలా?
మీరు Income Tax e-Filing Portal ద్వారా Instant e-PAN పొందినట్లయితే, మీకు చట్టబద్ధమైన PAN నంబర్ ఇప్పటికే ఉంటుంది. అయితే ఈ విధానంలో physical plastic PAN card ఇవ్వబడదు. అలాంటి సందర్భంలో, physical PAN పొందడం లేదా e-PAN లో ఉన్న వివరాలను సరిచేయడం కోసం ప్రభుత్వం అనుమతించిన అధికారిక సేవా సంస్థలు అయిన Protean eGov Technologies Limited (మునుపటి NSDL) లేదా UTI Infrastructure Technology And Services Limited (UTIITSL) ద్వారా సులభంగా అప్లై చేయవచ్చు.
| అంశం | Protean eGov Technologies Limited | UTI Infrastructure Technology And Services Limited (UTIITSL) |
| physical plastic PAN card reprint | Protean PAN Reprint Official Page | UTIITSL PAN Reprint Portal |
| Corrections | Protean PAN Correction Page | UTIITSL PAN Correction Page |
Standard e-PAN Apply Online (Protean / UTIITSL)
ఇది Form 49A ద్వారా చేసే అధికారిక PAN అప్లికేషన్ విధానం.
ఈ సేవలను అందించే ప్రభుత్వ అనుమతి పొందిన సంస్థలు:
i. Protean eGov Technologies Limited (మునుపటి NSDL)
Protean eGov Technologies Limited (మునుపటి NSDL) ద్వారా మనం రేడు విధాలుగా e-PAN మరియు Physical PAN card apply చేసుకోగలం.
ii. UTI Infrastructure Technology And Services Limited
Process (సారాంశం)
- Protean లేదా UTIITSL portal ఓపెన్ చేయాలి.
- Paperless Aadhaar e-KYC లేదా Scan-based e-Sign method ఎంచుకోవాలి.
- అవసరమైతే documents upload చేయాలి.
- Payment చేసి Aadhaar OTP ద్వారా e-Sign చేయాలి.
Merits (లాభాలు)
- Scan-based method ద్వారా custom photo upload చేయవచ్చు.
- మైనర్‌లు, కంపెనీలు, ఆధార్ వివరాల్లో సవరణలు (corrections) లేదా మార్పులు/రీప్లేస్‌మెంట్స్ అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సేవకు అర్హులే.
- Physical PAN card option కూడా ఉంటుంది.
ముగింపు (Conclusion)
మీ అవసరాన్ని బట్టి సరైన విధానాన్ని ఎంచుకుని, ప్రభుత్వ అధికారిక పోర్టల్స్ ద్వారానే e-PAN Apply Online చేయాలని సూచించబడుతుంది. తక్షణ అవసరాలైతే Instant e-PAN, పూర్తి డాక్యుమెంటేషన్ కావాలంటే Standard e-PAN ఉత్తమ ఎంపిక.
తరచుగా అడిగే ప్రశ్నలు- e-PAN Apply Online (FAQs)
1. e-PAN Apply Online సురక్షితమా?
అవును. ఇది ప్రభుత్వ అధికారిక portals ద్వారా జరిగే ప్రక్రియ.
2. Instant e-PAN మరియు Standard e-PAN మధ్య ప్రధాన తేడా ఏమిటి?
Instant → free & fast
Standard → complete details & customization
3. e-PAN కు Physical PAN తప్పనిసరా?
కాదు. e-PAN standalone గా కూడా valid.
4. Aadhaar కు mobile linked లేకపోతే e-PAN apply చేయవచ్చా?
లేదు. రెండు విధానాల్లో కూడా Aadhaar OTP అవసరం.
5. e-PAN ఎన్నిరోజులు valid?
Lifetime (Physical PAN లాగానే).