భారతదేశంలో ఆధార్ కార్డు (Aadhaar Card) అత్యంత కీలకమైన గుర్తింపు పత్రం. బ్యాంకింగ్ సేవలు, ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, మొబైల్ & డిజిటల్ ఆథెంటికేషన్ వంటి అనేక సేవలు ఆధార్‌పై ఆధారపడి ఉంటాయి. అందువల్ల ఆధార్‌లో నమోదైన వ్యక్తికత వివరాలు, Identity (గుర్తింపు) మరియు Address (చిరునామా) వివరాలు సరైనవిగా, తాజావిగా ఉండటం చాలా ముఖ్యం.ఈ ఆర్టికల్‌లో, Aadhaar Document Update Online ఎలా చేయాలి, అంగీకరించిన డాక్యుమెంట్లు, ఫీజు వివరాలు, ముఖ్యమైన సూచనలు అన్నీ Government official documents ఆధారంగా వివరించడం జరిగింది.

ఈ ఆర్టికల్‌లో మీరు తెలుసుకునే విషయాలు:
- Aadhaar Document Update ఎందుకు చేసుకోవాలి?
- Aadhaar Document Update కి అంగీకరించిన డాక్యుమెంట్లు.
- myAadhaar Portal ద్వారా Aadhaar Documents Update Online పూర్తి ప్రక్రియ.
- సమీప ఆధార్ సెంటర్ కనుకొనుట.
- Aadhaar Document Update ఎప్పుడు అప్డేట్ చేయాలి?
- Aadhaar Document Update ఎప్పుడు అప్డేట్ చేయాలి?
- తరుచూ అడుగు ప్రశ్నలు.
Aadhaar Document Update ఎందుకు చేసుకోవాలి?
UIDAI ప్రకారం ఆధార్ డాక్యుమెంట్లు అప్డేట్ చేయడం వల్ల కింది ప్రయోజనాలు కలుగుతాయి:
- 10 సంవత్సరాల నుండి ఆధార్‌లో ఏ విధమైన అప్డేట్ చేయని వారు చేసుకోవాలి
- Aadhaar authentication మరింత ఖచ్చితంగా జరుగుతుంది.
- ప్రభుత్వ సేవలు సులభంగా మరియు వేగంగా అందుతాయి.
- సబ్సిడీలు, పథకాలు సరైన వ్యక్తికి చేరతాయి.
- Aadhaar holder కు overall ease of living పెరుగుతుంది.
అందువల్ల తాజా డాక్యుమెంట్లు సమర్పించడం ఆధార్ నంబర్ హోల్డర్‌కే మేలు చేస్తుంది.
Aadhaar Document Update కి అంగీకరించిన డాక్యుమెంట్లు
UIDAI అధికారికంగా కొన్ని డాక్యుమెంట్లను మాత్రమే ఆధార్ Identity Proof మరియు Address Proof గా అంగీకరిస్తుంది. స్పష్టత కోసం వాటిని కింద విధంగా విభజించాం.
గుర్తింపు (Proof of Identity (POI)) మరియు చిరునామా (Proof of Address (POA))రెండింటికీ చెల్లుబాటు అయ్యే Documents
క్రింది డాక్యుమెంట్లు గుర్తింపు మరియు చిరునామా రెండింటికీ చెల్లుబాటు అవుతాయి:
- Ration Card – రేషన్ కార్డు.
- Voter ID Card – ఓటర్ ఐడీ.
- Indian Passport – పాస్‌పోర్ట్.
- Kisan Photo Passbook.
- Government-issued Photo ID / Certificate (ST, SC, OBC, Marriage Certificate – ఫోటోతో).
- Disability Identity Card / Certificate.
- Transgender Identity Card / Certificate.
- UIDAI Standard Certificate (Sex Workers కోసం).
- UIDAI Standard Certificate (Shelter Homes / Orphanages ద్వారా).
- Prisoner Induction Document (Prison Officer జారీ చేసినది).
గుర్తింపు (Proof of Identity (POI)) మాత్రమే చెల్లుబాటు అయ్యే Documents
క్రింది డాక్యుమెంట్లు గుర్తింపు వివరాల అప్డేట్‌కు మాత్రమే ఉపయోగపడతాయి:
- School Leaving / Transfer Certificate (ఫోటోతో).
- Marksheet / Certificate (Recognised Board / University).
- PAN Card / e-PAN Card.
- Government / PSU Employee or Pensioner Photo ID.
- Pension Payment Order / Mediclaim Card.
- Driving Licence.
- Freedom Fighter Photo Identity Card.
చిరునామా కు (Proof of Address (POA)) మాత్రమే చెల్లుబాటు అయ్యే Documents
క్రింది డాక్యుమెంట్లు చిరునామా అప్డేట్‌కు మాత్రమే అంగీకరించబడతాయి:
- Electricity / Water / Gas / Telephone / Mobile / Broadband Bill (3 నెలల లోపు).
- Bank / Post Office Passbook (ఫోటో + సంతకం + ముద్ర).
- Bank / Post Office Account Statement / Credit Card Statement (3 నెలల లోపు).
- Valid Rent / Lease / Leave & Licence Agreement.
- UIDAI Standard Certificate issued by MP / MLA / MLC / Gazetted Officer / Tahsildar / EPFO Officer.
- UIDAI Standard Certificate issued by Village Panchayat Head / Secretary / VRO (గ్రామీణ ప్రాంతాలు).
- UIDAI Student Certificate (Head of Educational Institution జారీ చేసినది).
- Property Tax Receipt (1 సంవత్సరం లోపు).
- Registered Sale Agreement / Gift Deed.
- Government / PSU Accommodation Allotment Letter (1 సంవత్సరం లోపు).
- Life Insurance / Medical Insurance Policy (1 సంవత్సరం లోపు).
myAadhaar Portal ద్వారా Aadhaar Documents Update Online పూర్తి ప్రక్రియ
Step 1: myAadhaar Official Portal ఓపెన్ చేయుట
myAadhaar Portal (UIDAI Official)- ఆన్‌లైన్‌లో Aadhaar Document Update చేయడానికి UIDAI అందిస్తున్న అధికారిక పోర్టల్ myAadhaar ను ఉపయోగించాలి.
Step 2: myAadhaar Official Portal లో Login అవ్వుట

- myAadhaar పోర్టల్‌లో Aadhaar Number & OTP ద్వారా Login చేయండి.
Step 3: Document Update సర్విస్ సెలెక్ట్ చేసుకొనుట

- సర్విస్ లిస్ట్ లో ఉన్న Document Update ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. తరువాత పేజి లో మనము తుదిపరి Steps ల లో చేయవలసిన Map కనిపిస్తుంది, క్రింద ఉన్న Next పై క్లిక్ చెయ్యండి.
Step 4: Demographic Details ని Verify చెసుకొనుట

- ఈ పేజి లో ఉన్న ఉన్న Name, Date of Birth, Gender & Address వివరాలు పరిశీలించండి.
- వివరాలు సరైనవైతే “I verify that the above details are correct” దగ్గర టిక్ చేసి Next క్లిక్ చేయండి.
- ఒకవేళ మీ ఆధార్ ప్రొఫైల్‌లో ఉన్న Name, Date of Birth and Gender వంటి Demographic గుర్తింపు వివరాలు తప్పుగా ఉంటే తప్పనిసరిగా సమీప Aadhaar Enrolment / Update Centre కు వెళ్ళాలి. ఈ మార్పులు ప్రస్తుతానికి ఆన్‌లైన్‌లో అనుమతించబడవు.
- ఒకవేళ మీ ఆధార్ ప్రొఫైల్‌లో ఉన్న చిరునామా (Address) ప్రస్తుత Document చిరునామా తో సరిపోవక పోయిన లేక తప్పుగా ఉంటే “If there is mismatch in the Address, click here” అనే లింక్‌పై క్లిక్ చేయండి.
- ప్రస్తుతం ఉన్న ఆధార్ కార్డులో చిరునామా తప్పుగా ఉన్న లేదా వివాహం, ఉద్యోగం, విద్య, ఇతర కారణాల వల్ల కొత్త ప్రాంతానికి మారిన సందర్భాల్లో, ఆధార్ చిరునామా మార్పు చేయడం Aadhaar Address Change తప్పనిసరి. తండ్రి లేదా భర్త పేరుతో “care of” వివరాలు సరియుగా లేనిప్పుడు కూడా చిరునామా సరిచేయడం అవసరం.
- Aadhaar Address Change Online & Offline| ఆధార్ అడ్రస్ మార్చుకోవడం ఎలా? పూర్తి గైడ్ 2026
- పై న ఉదహరించిన ఆర్టికల్ లో Aadhaar Address change పూర్తి విధానం వివరించడం జరిగింది.
Step 5: Proof of Identity (POI) మరియు Proof of Address (POA) ను Upload చేయుట.

- Proof of Identity (POI) ను Select చేసి పై న పేర్కొన్న వాటిలో మీకు అందుబాటులో ఉన్న Document ని Select చేసుకొని Upload Section లో upload చేయగలరు (JPEG / PNG / PDF – 2MB లోపు).
- Proof of Address (POA) ను Select చేసి పై న పేర్కొన్న వాటిలో మీకు అందుబాటులో ఉన్న document ని Select చేసుకొని upload Section లో Upload చేయగలరు (JPEG / PNG / PDF – 2MB లోపు).
- గమనిక: Step 4 లో చూపించిన డెమోగ్రాఫిక్ డీటైల్స్ ఈ డాక్యుమెంట్స్ లో ఉన్న డీటైల్స్ తో సరిపోవాలి. లేకపోతే మొదటగా డెమోగ్రాఫిక్ డీటైల్స్ సరిచేసుకోవాలి.
- తరువాత I hereby give my consent that దగ్గర టిక్ చేసి Next పై క్లిక్ చెయ్యాలి.
Step 6: Fee పేమెంట్
- UIDAI మార్గదర్శకాల ప్రకారం, ప్రస్తుతం myAadhaar పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో డాక్యుమెంట్ అప్‌డేట్ సేవ ఉచితంగా అందుబాటులో ఉంది (14-06-2026 వరకు – అధికారిక నోటిఫికేషన్ ప్రకారం). Aadhaar Centre ద్వారా అప్డేట్ చేయాలంటే Fee వర్తిస్తుంది.
- ఈ ఉచిత సేవ POI / POA డాక్యుమెంట్లు అప్లోడ్ చేయడానికి మాత్రమే వర్తిస్తుంది. పేరు, DOB, లింగం మరియు Address మార్పులకు కాదు.
- చివరిగా Download Acknowledgement పై క్లిక్ చేసి save చేసుకోగలరు.
- Aadhaar Document update యొక్క స్టేటస్ తెలుసుకొనుటకు మరలా Step 1 మరియు Step 2 లో చూపించిన విధం గా login అయ్యాక My Online Request దగ్గర చెక్ చేసుకోయాలరు.
సమీప ఆధార్ సెంటర్ కనుకొనుట
Near by Aadhaar Centre – సమీప ఆధార్ సెంటర్‌పై Link ని ఉపయోగనుంచి దగ్గర లో ఉన్న ఆధార్ సెంటర్ ని తెలుసుకోగలరు.
Aadhaar Document Update ఎప్పుడు అప్డేట్ చేయాలి?
UIDAI సూచన ప్రకారం Aadhaar Identity & Address Documents ను వీలైనంత త్వరగా అప్డేట్ చేయడం మంచిది. ఇది భవిష్యత్తులో ప్రభుత్వ మరియు డిజిటల్ సేవలలో ఎలాంటి అంతరాయం లేకుండా సహాయపడుతుంది.
గమనిక: UIDAI మార్గదర్శలు ఆదారంగా ఈ సమాచారం రూపొందించబడింది. కాలక్రమేణా సేవ ప్రక్రియలో మార్పులు జరగవచ్చు.
ముగింపు
UIDAI అధికారిక మార్గదర్శకాల ప్రకారం Aadhaar Identity & Address Document Update చేయడం ఆధార్ హోల్డర్లకు చాలా అవసరం. సరైన డాక్యుమెంట్లు, సరైన విధానంలో సమర్పిస్తే Aadhaar authentication మరింత సులభంగా జరుగుతుంది మరియు భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు ఎదురుకావు.
FAQs – Aadhaar Document Update ప్రశ్నలు
Q1. Aadhaar Document Update Online చేయడం తప్పనిసరా?
UIDAI ప్రకారం తాజా డాక్యుమెంట్లు సమర్పించడం ఆధార్ నంబర్ హోల్డర్‌కు ప్రయోజనకరం.
Q2. Aadhaar Document Update Fee ఎంత?
myAadhaar పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో 14 జూన్ 2026 వరకు ఉచితం. Aadhaar Centre లో UIDAI నిర్ణయించిన Fee చెల్లించాలి.
Q3. Aadhaar Name Correction Online చేయవచ్చా?
లేదు. Name, Gender, DOB మార్పుల కోసం Aadhaar Centre తప్పనిసరి.
Q4. Aadhaar Document Update Online చేసిన తర్వాత ఎంత సమయంలో complete అవుతుంది?
UIDAI మార్గదర్శకాల ప్రకారం, myAadhaar పోర్టల్ ద్వారా సమర్పించిన డాక్యుమెంట్లు సాధారణంగా 7 నుండి 30 పని దినాల్లో verify చేసి అప్డేట్ చేయబడతాయి. కొన్ని సందర్భాల్లో verification ప్రక్రియ ఆధారంగా కొద్దిగా ఆలస్యం కావచ్చు.
Q5. Aadhaar Document Update reject అయితే next step ఏమిటి?
డాక్యుమెంట్లు స్పష్టంగా లేకపోవడం, సరైన డాక్యుమెంట్ అప్లోడ్ చేయకపోవడం లేదా వివరాలు సరిపోలకపోవడం వల్ల update reject కావచ్చు.
అలాంటి సందర్భాల్లో:
- సరైన మరియు స్పష్టమైన డాక్యుమెంట్‌తో మళ్లీ myAadhaar పోర్టల్ ద్వారా re-submit చేయవచ్చు
- లేదా సమీప Aadhaar Enrolment / Update Centre ను సందర్శించి original documents తో అప్డేట్ చేయించుకోవచ్చు.