Aadhaar Mobile Number Update Online via App – పూర్తి స్టెప్ బై స్టెప్ గైడ్ (2026)

భారతదేశంలో ఆధార్ కార్డు (Aadhaar Card) ఒక అత్యంత ముఖ్యమైన గుర్తింపు పత్రం. బ్యాంక్ ఖాతాలు, ప్రభుత్వ పథకాలు, మొబైల్ కనెక్షన్లు, పాన్ లింకింగ్, సబ్సిడీలు వంటి అనేక సేవలకు ఆధార్ అవసరం అవుతుంది. ఈ కారణంగా ఆధార్‌లో నమోదైన మొబైల్ నంబర్ సరిగ్గా ఉండటం చాలా ముఖ్యం. దాని కొరకు ఈ Aadhaar Mobile Number Update Online గైడ్ మీకు తోడ్పడుతుంది.

Aadhaar mobile number update online via Aadhaar App step by step process screenshot

ఇటీవలి కాలంలో UIDAI అధికారికంగా విడుదల చేసిన Aadhaar App ద్వారా, ఇంటి నుంచే మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే అవకాశం కల్పించింది. కొన్ని ఆధార్ సేవల కోసం ఎన్‌రోల్మెంట్ సెంటర్‌కు వెళ్లాల్సిన అవసరం తగ్గింది.

ఈ ఆర్టికల్‌లో, Aadhaar App ద్వారా మొబైల్ నంబర్ ఎలా అప్‌డేట్ చేయాలి?, ఏయే యాప్స్ అవసరం, ఫీజు ఎంత, URN అంటే ఏమిటి వంటి అన్ని విషయాలను actual process ప్రకారం, స్టెప్ బై స్టెప్‌గా, పూర్తి వివరాలతో తెలుసుకుందాం.


Aadhaar Mobile Number Update Online ఎవరికీ ఉపయోగపడుతుంది?

ఈ విధానం ముఖ్యంగా క్రింది వారికి ఉపయోగపడుతుంది:

  • మొబైల్ నంబర్ మారిన వారు.
  • ఆధార్‌కు ఇప్పటివరకు నంబర్ లింక్ చేయని వారు.
  • OTP ఆధారిత సేవలు ఉపయోగించలేని వారు.

Aadhaar App ద్వారా మొబైల్ నంబర్ అప్‌డేట్ చేయడానికి అవసరమైనవి

ప్రాసెస్ ప్రారంభించేముందు, ఇవి మీ దగ్గర ఉండాలి:

  • మీ ఆధార్ కార్డు.
  • స్మార్ట్‌ఫోన్ (Android / iPhone).
  • ఇంటర్నెట్ కనెక్షన్.
  • అప్‌డేట్ చేయాలనుకున్న మొబైల్ నంబర్.
  • Face Authentication చేయగల స్మార్ట్‌ఫోన్ కెమెరా.

Aadhaar mobile number update online – Step by Step Process

Step 1: Aadhaar mobile number update అవసరమైన యాప్స్ ఇన్‌స్టాల్ చేయండి

మొదటిగా మీ ఫోన్‌లో క్రింది రెండు అధికారిక యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేయాలి:

Aadhaar App
AadhaarFaceRD App

గమనిక:

  • AadhaarFaceRD App ఇన్‌స్టాల్ చేసిన తర్వాత, ఇది మీ మొబైల్ యాప్ లిస్ట్‌లో కనిపించకపోవచ్చు.
  • ఈ యాప్ బ్యాక్‌గ్రౌండ్‌లో వర్క్ అవుతుంది.
  • ఎప్పుడైనా ఈ యాప్‌ను అప్‌డేట్ చేయాలంటే, నేరుగా Play Store లో సెర్చ్ చేసి అప్‌డేట్ చేయాలి.

Step 2: Aadhaar App ఓపెన్ చేసి Permissions ఇవ్వండి

Aadhaar App ఓపెన్ చేసిన తర్వాత “I’m Ready with My Aadhaar” ఆప్షన్‌పై క్లిక్ చేసే స్క్రీన్
  • Aadhaar App ఓపెన్ చేయండి.
  • యాప్ అడిగే అన్ని అవసరమైన Permissions (Camera, SMS, Internet) ను Allow చేయండి.
  • తరువాత “I’m Ready with My Aadhaar” అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
  • Terms & Conditions and Privacy Policy పేజి లో Instructions చదివి, క్రింద ఉన్న I Agree to terms and conditions and privacy policy దగ్గర టిక్ చేసి Proceed పై క్లిక్ చెయ్యాలి

Step 3: ఆధార్ నంబర్ & SIM Verification

Aadhaar App లో ఆధార్ నంబర్ ఎంటర్ చేసి SIM verification జరుగుతున్న స్క్రీన్
  • మీ 12 అంకెల ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి.
  • ప్రస్తుతం మీరు ఉపయోగిస్తున్న ఫోన్‌లో ఉన్న SIM నంబర్‌ను వెరిఫై చేయాలి.
  • ఇందుకోసం ఒక Verification SMS ఆటోమేటిక్‌గా పంపబడుతుంది.

ముఖ్య గమనిక:

  • మీరు ఏ మొబైల్ నంబర్‌ను ఆధార్‌తో లింక్ చేయాలనుకుంటున్నారో, ఆ నంబర్ తప్పనిసరిగా ఇదే ఫోన్‌లో ఉండాల్సిన అవసరం లేదు.
  • ఆ SIM ఈ ఫోన్‌లో ఉన్నా లేకపోయినా పరవాలేదు.

Step 4: Face Authentication & 6 Digit PIN సృష్టించడం

  • SIM Verification పూర్తైన తరువాత “Continue to Face Authentication” పై క్లిక్ చేయండి.
  • మీ ముఖాన్ని కెమెరా ముందు ఉంచి Face Authentication పూర్తి చేయండి.
  • తరువాత యాప్ అడిగినట్లుగా ఒక 6 అంకెల PIN సృష్టించాలి.

గమనిక:

  • ఈ PIN భవిష్యత్తులో Aadhaar App లో లాగిన్ కావడానికి ఉపయోగపడుతుంది.
  • కాబట్టి ఈ PIN ను సురక్షితంగా గుర్తుపెట్టుకోండి.

Step 5: My Aadhaar Update ఆప్షన్ ఎంపిక

Aadhaar App Services విభాగంలో My Aadhaar Update ఆప్షన్ ఎంపిక చేసే స్క్రీన్
  • యాప్ మెయిన్ పేజీలో మీ వివరాలు వెరిఫై అయిన తర్వాత, పేజీని కిందకు Scroll చేయండి.
  • Services విభాగంలో ఉన్న “My Aadhaar Update” పై క్లిక్ చేయండి.

Step 6: Mobile Number Update ఎంపిక చేయండి

My Aadhaar Update పేజీలో Mobile Number Update ఆప్షన్ సెలెక్ట్ చేసే స్క్రీన్
  • My Aadhaar Update పేజీలో, “Mobile Number Update” అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేయండి.
  • తరువాత Continue పై క్లిక్ చేయండి.

Step 7: పాత నంబర్ & కొత్త నంబర్ నమోదు

Aadhaar App లో పాత మొబైల్ నంబర్ మరియు కొత్త మొబైల్ నంబర్ నమోదు చేసే స్క్రీన్
  • మీ ఆధార్‌కు ఇప్పటికే మొబైల్ నంబర్ లింక్ అయి ఉంటే, Old Mobile Number వివరాలు చూపిస్తాయి.
  • ఇప్పుడు మీరు లింక్ చేయాలనుకున్న New Mobile Number ను ఎంటర్ చేయండి.
  • నంబర్ ఎంటర్ చేసిన తరువాత Proceed పై క్లిక్ చేయండి.

Step 8: OTP Verification & Face Authentication చేయుట

  • మీరు ఎంటర్ చేసిన కొత్త మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది.
  • ఆ OTP ను యాప్‌లో నమోదు చేసి వెరిఫై చేయండి.
  • తరువాత మరోసారి Face Authentication పూర్తి చేయాలి.

Step 9: Aadhaar Mobile Number Update Online Fee – Payment

  • యాప్‌లో అందుబాటులో ఉన్న పేమెంట్ ఆప్షన్ల ద్వారా చెల్లింపు చేయండి.

Step 10: URN Receipt & Status Check చేయుట

  • పేమెంట్ విజయవంతం అయిన వెంటనే, మీకు ఒక URN (Update Request Number) తో కూడిన రసీదు లభిస్తుంది.
  • ఈ URN నంబర్ ద్వారా మీ మొబైల్ నంబర్ అప్‌డేట్ రిక్వెస్ట్ స్టేటస్‌ను తరువాత ఎప్పుడైనా చెక్ చేయవచ్చు.

Aadhaar Mobile Number Update – ఎంత సమయం పడుతుంది?

సాధారణంగా మొబైల్ నంబర్ అప్‌డేట్ కావడానికి 2 నుండి 30 వర్కింగ్ డేస్ సమయం పడుతుంది.

గమనిక: ఈ సమాచారం UIDAI అధికారిక మార్గదర్శకాల ఆధారంగా ఇవ్వబడింది. సేవా నియమాలు కాలక్రమేణా మారవచ్చు.

ముగింపు

UIDAI అందించిన Aadhaar App వలన, ఇప్పుడు ఆధార్‌కు మొబైల్ నంబర్ అప్‌డేట్ చేయడం చాలా సులభం అయింది. సరైన యాప్స్, సరైన స్టెప్స్ పాటిస్తే, ఎలాంటి ఎన్‌రోల్మెంట్ సెంటర్ అవసరం లేకుండా, ఇంటి నుంచే మీ ఆధార్ సేవలను నిర్వహించుకోవచ్చు.

Related Articles


తరచూ అడిగే ప్రశ్నలు (FAQs)

Q1: URN అంటే ఏమిటి?

URN (Update Request Number) అనేది మీ ఆధార్ అప్‌డేట్ అభ్యర్థనకు సంబంధించిన ప్రత్యేక నంబర్. దీని ద్వారా స్టేటస్ ట్రాక్ చేయవచ్చు.

Q2: ఆధార్ మొబైల్ నంబర్ అప్‌డేట్ ఫీజు ఎంత?

UIDAI నిర్ణయించిన ఫీజు.

Q3: ఎన్‌రోల్మెంట్ సెంటర్‌కు వెళ్లాలా?

లేదు. ఈ విధానంలో మొత్తం ప్రాసెస్ ఆన్‌లైన్‌లో Aadhaar App ద్వారానే పూర్తవుతుంది.

Q4: Aadhaar App ద్వారా మొబైల్ నంబర్ అప్‌డేట్ ఫెయిల్ అయితే ఏమి చేయాలి?

కొన్ని సందర్భాల్లో Face Authentication సరిగా జరగకపోవడం, నెట్‌వర్క్ సమస్యలు లేదా సర్వర్ ఎర్రర్ కారణంగా ప్రాసెస్ ఫెయిల్ కావచ్చు.
అలాంటి సమయంలో:

  • కొంత సమయం తర్వాత మళ్లీ ప్రయత్నించండి
  • Face Authentication కోసం సరైన లైటింగ్‌లో కెమెరా ఉపయోగించండి
  • పదేపదే ఫెయిల్ అయితే, సమీప Aadhaar Enrolment Center ద్వారా అప్‌డేట్ చేయవచ్చు

Q5: Aadhaar App ద్వారా మొబైల్ నంబర్ అప్‌డేట్ చేసిన తర్వాత SMS నోటిఫికేషన్ వస్తుందా?

అవును. మీ మొబైల్ నంబర్ విజయవంతంగా అప్‌డేట్ అయిన తర్వాత:

  • UIDAI నుండి SMS నోటిఫికేషన్ వస్తుంది
  • అలాగే Aadhaar App లో కూడా అప్‌డేట్ స్టేటస్ “Completed” గా చూపిస్తుంది
  • మీరు URN ద్వారా ఎప్పుడైనా స్టేటస్ చెక్ చేయవచ్చు

Q6: Aadhaar App Android, iPhone రెండింటిలో పని చేస్తుందా?

అవును. Aadhaar App Android మరియు iOS రెండింటిలో కూడా అందుబాటులో ఉంది. అయితే Face Authentication సపోర్ట్ ఫోన్ మోడల్‌పై ఆధారపడి ఉంటుంది.


Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top