మీ Voter Card లో ఉన్న ప్రస్తుత చిరునామా తప్పుగా ఉందా? లేద Address డీటైల్స్ లో అక్షర దోషం లు (Spelling Mistakes) ఉన్నాయా? వాటిని సరిచేయాలనుకుంటున్నారా అయితే ఈ పూర్తి గైడ్ మీకోసమే. ఈ ఆర్టికల్ లో Voter ID Address Correction Online Telugu 2026 process ను Form 8 ద్వారా step-by-step గా వివరించాం. Election Commission of India అందించే అధికారిక Voter Services Portal ద్వారా ఈ సేవ పూర్తిగా ఉచితం.

Quick Summary — Voter ID Address Correction Telugu 2026
| Details | Information |
|---|---|
| Time Required | 10–15 నిమిషాలు |
| Fee | పూర్తిగా ఉచితం (Free) |
| Form | Form 8 |
| Portal | Voter Services Portal |
| Processing Time | 15 –30 రోజులు |
| Helpline | 1950 (Free, 24×7) |
Voter ID Address Correction vs Shifting — తేడా ఏమిటి?
Form 8 లో Address Update కు మూడు వేర్వేరు పరిస్థితులు ఉంటాయి. మీ పరిస్థితికి సరిపోయే option ను ఎంపిక చేయాలి. క్రింది పట్టికలో వాటి మధ్య తేడాలను చూడండి.
| Feature | Address Correction | Shifting Within Constituency | Shifting Outside Constituency |
|---|---|---|---|
| ఉద్దేశ్యం | ఇప్పటికే ఉన్న చిరునామాలో అక్షర దోషం లు (Spelling Mistakes) లేదా కొన్ని పదలను సరిదిద్దడం. | అదే అసెంబ్లీ నియోజకవర్గంలో కొత్త ఇంటికి మారడం. | వేరే అసెంబ్లీ నియోజకవర్గానికి లేదా వేరే రాష్ట్రానికి మారడం. |
| Form లో Selection | Form 8 → “Correction of Entries” | Form 8 → “Shifting of Residence” (Within AC) | Form 8 → “Shifting of Residence” (Outside AC) |
| EPIC Number | అదే ఉంటుంది | అదే ఉంటుంది | అదే ఉంటుంది |
| Voter List పై ప్రభావం | ఉన్న entry అప్డేట్ అవుతుంది. | పేరు కొత్త Booth / Part కి Transpose అవుతుంది. | పాత list నుండి తొలగించబడి కొత్త list లో చేర్చబడుతుంది. |
| అవసరమైన Proof | సరైన చిరునామా చూపించే document. | ప్రస్తుత కొత్త నివాసం యొక్క Proof. | కొత్త ప్రాంతంలో నివాసం యొక్క Proof. |
గమనిక: మీరు అదే ఇంట్లో ఉంటూ Voter Card లో చిరునామా spelling తప్పుగా ఉంటే —Address Correction ఎంచుకోండి. ఇల్లు మారారంటే —Shifting ఎంచుకోండి.
Voter ID లో Address Correction ఎందుకు అవసరం?
మీ Voter ID Card లో చిరునామా సరిగ్గా ఉంటే అనేక ప్రయోజనాలు ఉన్నాయి:
- సరైన Polling Booth వద్ద Verification సులభం అవుతుంది.
- Voter Card ని Identity Proof గా వాడినప్పుడు Address mismatch సమస్యలు రావు.
- ప్రభుత్వ పథకాల లబ్ధి పొందేందుకు Address proof గా ఉపయోగపడుతుంది.
- డిజిటల్ e-EPIC Card డౌన్లోడ్ చేసుకోవడం సులభమవుతుంది.
- భవిష్యత్తులో ఇతర corrections చేసుకోవడం సులభం అవుతుంది.
Form 8 అంటే ఏమిటి? | Form 8 Online Apply Telugu
Form 8 అనేది ఓటర్ కార్డ్‌లో ఉన్న వివరాలను సరిదిద్దడానికి ఉపయోగించే అధికారిక ఫారం. ఇది Election Commission of India ద్వారా అందించబడుతుంది. Election Commission Mobile Number Update or Add కోసం Form 8 అధికారిక ఫారం. దీన్నే “Correction of Entries in Electoral Roll” form అంటారు.
Form 8 ద్వారా మీరు:
- పేరు సరిదిద్దుకోవచ్చు.
- పుట్టిన తేదీ మార్చుకోవచ్చు.
- అడ్రస్ సరిచేయవచ్చు.
- ఫోటో అప్డేట్ చేయవచ్చు.
- మొబైల్ నంబర్ Add లేదా మార్చుకోవచ్చు.
Voter ID Address Correction కు అవసరమైన Documents
Form 8 Voter ID Address Correction Online కోసం ఈ క్రింది documents సిద్ధంగా ఉంచుకోవాలి: (Election Commission of India నిర్దేశించిన documents ఇవి).
- EPIC Number (మీ Voter ID Number). ఒకవేళ మీ వద్ద Voter Card లేకపోయినా లేదా Voter Card Number తెలియక పోయిన చింతించనవసారం లేదు Electoral Roll Search ద్వారా ఎలా తెలుసుకోవలో ఈ గైడ్ లో వివరించబడింది.
- Aadhaar Number (eSign కోసం).
- Mobile Number – Aadhaar తో లింక్ అయినది (OTP verification కోసం).
- చిరునామా రుజువు పత్రం (కింది వాటిలో ఏదైనా ఒకటి):
- ఆధార్ కార్డు.
- పాస్‌పోర్ట్.
- డ్రైవింగ్ లైసెన్స్.
- విద్యుత్ బిల్లు / నీటి బిల్లు.
- రేషన్ కార్డ్.
- బ్యాంక్ పాస్‌బుక్ (ఫోటో తో)
- అద్దె ఒప్పందం.
- ఆస్తి పన్ను రశీదు.
- గమనిక: eSign ప్రక్రియ పూర్తి చేయాలంటే, మీ ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్ తప్పనిసరిగా active గా ఉండాలి. అలాగే, ఆధార్‌లో ఉన్న పేరు మరియు ఓటర్ కార్డ్‌లో ఉన్న పేరు పూర్తిగా ఒకే విధంగా ఉండాలి.
- Aadhaar Mobile Link లేకపోతే:
మీ ఆధార్‌కు మొబైల్ నంబర్ లింక్ చేయబడకపోతే లేదా ఇప్పటికే లింక్ అయిన నంబర్‌ను మార్చుకోవాలనుకుంటే, Unique Identification Authority of India (UIDAI) 2026 నియమాల ప్రకారం రూపొందించిన ఆధార్ మొబైల్ నెంబర్ లింక్ / మార్చుట 2026 పూర్తి గైడ్ సహాయం తో ముందుగా Aadhaar Mobile Number Update పూర్తి చేసుకోండి. - పేరు సరిపోకపోతే:
- ఒకవేళ ప్రస్తుతం మీ ఓటర్ కార్డ్‌లో ఉన్న పేరు, ఆధార్‌లో ఉన్న పేరుతో ఒకే విధంగా లేకపోతే, Application for Correction of Entries in Existing Electoral Roll లో Name ఎంపికను కూడా సెలెక్ట్ చేసి Address తో పాటుగా పేరు కూడా సరిచేసుకునేలా అప్లికేషన్ సమర్పించాలి.
- eSign చేయలేని పరిస్థితిలో:
- ఒకవేళ మీ ఆధార్‌కు మొబైల్ నెంబర్ లింక్ లేకపోవడం లేదా పేరు సవరణకు సమయం లేకపోతే, ఈ ఆర్టికల్‌లో వివరించిన Step 6 వరకు ఉన్న ప్రక్రియను అనుసరించి, ఫిల్ చేసిన అప్లికేషన్‌ను Download చేసుకుని మీ BLO / ERO కు సమర్పించవచ్చు. ఈ విధానంలో Aadhaar eSign అవసరం ఉండదు.
- అయితే, మొబైల్ నెంబర్‌ను ఆధార్‌కు లింక్ చేయడం మరియు పేరు సవరించుకోవడం తర్వాత eSign ద్వారా అప్లికేషన్ సమర్పించడం ఉత్తమమైన విధానం. ఈ విధానంలో BLO / ERO కి భౌతికంగా ఏ విధమైనా డాక్యుమెంట్ సమర్పించవలసిన పని లేదు.
- Aadhaar Mobile Link లేకపోతే:
- అప్లోడ్ చేయబోయే డాక్యుమెంట్ కాపీ పై క్రింద బాగాన మీ సంతకం చేసి 2 MB లోపాల స్పష్టంగా PDF లేద JPEG రూపం లో అప్లోడు చెయ్యాలి.
Voter Card Address Correction Online Telugu 2026 Step-by-Step Process (Form 8)- చిరునామా సవరణ ప్రక్రియ
Step 1: Voter Service Portal లో Login లేద Sign-UP అవ్వండి

Form 8 online apply Telugu లో చేయడానికి మొదట మీ browser లో Voter Services Portal ను తెరవండి.
కొత్త User అయితే (Sign-UP):
- Sign-UP ఆప్షన్ పై క్లిక్ చెయ్యాలి.
- Mobile Number, Email ID (తప్పనిసరి కాదు) మరియు Captcha నమోదు చేసి Continue పై క్లిక్ చెయ్యాలి.
- తరువాత పేజిలో First Name మరియు Last Name నమోదు చేసి Resend OTP పై క్లిక్ చెయ్యాలి.
- మీ ఫోన్ కి వచ్చిన OTP ని verify చేసి Register అవ్వగలరు.
ఇప్పటికే Account ఉంటే (Login):
- Login ఆప్షన్ పై క్లిక్ చేసి Mobile Number / Email ID / EPIC No మరియు Captcha నమోదు చేసి Request OTP పై క్లిక్ చెయ్యాలి.
- OTP verify చేసి Portal లో Login అవ్వగలరు.
Step 2: Correction Of Entries (Form 8) ను ఎంపిక చెయ్యండి

- Voter Service Portal dashboard లో Fill Form 8 పై క్లిక్ చెయ్యాలి.
- తుదిపరి పేజి లో Application For Self or Other elector అని అడుగుతుంది. ఇక్కడ Self ను ఎంపిక చేసుకోండి. ఒకవేళ మీరు మీ వెరే వల్ల Voter card లో చిరునామా మార్పు చేయాలనుకుంటే Other elector ను ఎంపిక చేసుకోవాలి.
- EPIC నెంబర్ ఎంటర్ చేసి Submit పై క్లిక్ చెయ్యండి.
- ఒకవేళ మీకు మీ EPIC Number తెలియకపోతే, మీ “వివరాలు లేక ఫోన్ నెంబర్” తో Electoral Roll Search ద్వారా తెలుసుకోగలరు.
Search in Electoral Roll
- ఒకవేళ మీకు మీ EPIC Number తెలియకపోతే, మీ “వివరాలు లేక ఫోన్ నెంబర్” తో Electoral Roll Search ద్వారా తెలుసుకోగలరు.
- తుదిపరి పేజి లో మీకు Electoral Roll లో ఉన్న మీ డీటైల్స్ కనిపిస్తాయి, ఒకసారి verify చేసి ok పై క్లిక్ చెయ్యండి.
Step 3: Correction of Entries in Existing Electoral Roll ఎంపిక చేయండి

- ఈ పేజి లో Application for దగ్గర “Correction of Entries in Existing Electoral Roll” ని టిక్ చేసి క్రింద ఉన్న ok పై క్లిక్ చెయ్యండి.
Step 4: Personal Details నమోదు చెయ్యండి
A. State, District & Assembly/Parliamentary Constituency వద్ద details already fill అయ్యి ఉంటాయి — వాటిని ఒకసారి verify చేసుకొని Next పై క్లిక్ చెయ్యాలి.
B. Details వద్ద: (తప్పనిసరి కాదు)
- మీ పేరు మరియు EPIC నంబర్ already fill అయ్యి ఉంటుంది.
- Aadhaar Number వద్ద టిక్ చేసి Aadhaar నంబర్ ఎంటర్ చెయ్యండి.
- Mobile Number మరియు Email (తప్పనిసరి కాదు) వద్ద మీ details ఎంటర్ చేసి Next పై క్లిక్ చెయ్యాలి.
C. I Submit application for దగ్గర “Correction of Entries in Existing Electoral Roll” select చేసి ఉంటుంది.
Step 5: Address Update Option ఎంపిక చేయండి మరియు చిరునామా ప్రూఫ్ అప్లోడు చేయండి

- Application for Correction of Entries in Existing Electoral Roll దగ్గర Address వద్ద టిక్ చెయ్యండి.
- గమనిక: “Application for Correction of Entries in Existing Electoral Roll” ఆప్షన్ ద్వారా మనం ఒకేసారి 4 Voter Updates కి అప్లై చేయగలం. ఒకవేళ మీరు Address తో పాటుగా ఇతర డీటైల్స్ కూడా Update చేయాలనుకుంటే వాటి వద్ద కూడా టిక్ చెయ్యాలి, లేదుఅనుకుంటే Address దగ్గర టిక్ చేస్తే సరిపోతుంది.
- తరువాత మీ ఇంటి నెంబర్, వీధి పేరు, గ్రామం లేద పట్నం పేరు, పోస్ట్ ఆఫీసు ఉన్న ఊరి పేరు, పిన్ కోడ్, మండలం పేరు సపోర్టింగ్ డాక్యుమెంట్ లో ఉన్న విదం గా నమోదు చెయ్యాలి.
- పేరు సరిపోకపోతే:
- ఉదాహరణకు, మీ పేరు ఆధార్‌లో “సోమన చిన్న బాబు” అని ఉండి, కానీ ప్రస్తుతం ఓటర్ కార్డ్‌లో “చిన్న బాబు సోమన” లేదా వేరే విధంగా ఉంటే Aadhaar eSign సరిగ్గా పూర్తికాదు. ప్రస్తుతం ఓటర్ కార్డ్‌లో ఉన్న పేరు, ఆధార్‌లో ఉన్న పేరుతో స్పెల్లింగ్ మరియు పేరు క్రమం సహా అన్ని విధాలుగా సరిపోవాలి
- ఒకవేళ ప్రస్తుతం మీ ఓటర్ కార్డ్‌లో ఉన్న పేరు, ఆధార్‌లో ఉన్న పేరుతో ఒకే విధంగా లేకపోతే, Application for Correction of Entries in Existing Electoral Roll లో Name ఎంపికను కూడా సెలెక్ట్ చేసి పేరు సరిచేసుకునేలా అప్లికేషన్ సమర్పించాలి.
- First Name దగ్గర “సోమన చిన్న బాబు” అని ఆధార్‌లో ఉన్న విధంగా పూర్తి పేరును నమోదు చేసి, Surname ఖాళీగా వదిలేయాలి. మరియు Supporting Document దగ్గర మీ ఆధార్ కార్డ్ PDF/JPG రూపం లో 2 MB లోపాల ఉండే విదం గా అప్లోడు చెయ్యాలి (ఆధార్ కాపీ పై క్రింద బాగాన మీ సంతకం చెయ్యాలి). ఈ విధంగా నమోదు చేస్తే Aadhaar eSign Process ను విజయవంతంగా పూర్తి చేయవచ్చు.
- ఒకవేళ ప్రస్తుతం మీ ఓటర్ కార్డ్‌లో ఉన్న పేరు, ఆధార్‌లో ఉన్న పేరుతో అదే విధంగా సరిపోతే, Name మార్చాల్సిన అవసరం లేదు.
- Type of supporting document for Name దగ్గర మీ వద్ద ఉన్న Supporting Document Name ను డ్రాప్ డౌన్ లిస్ట్ లో ఎంపికచేసుకోని, పక్కన Upload Name Proof దగ్గర అప్లోడు చెయ్యాలి.
- గమనిక: డాక్యుమెంట్ కాపీ పై మీ సంతకం చేసి సైజ్ 2 MB లోపు , PDF రూపం లో అప్లోడు చెయ్యడం ఉత్తమం.
- తరువాత Next పై click చెయ్యండి.
Step 6: Declaration
- D. Declaration వద్ద Declaration పూర్తి గా చదివి Place దగ్గర మీ ఊరి పేరు నమోదు చేసి Next పై click చెయ్యండి.
- E. Submission దగ్గర Captcha నమోదు చెసి Preview and Submit పై క్లిక్ చెయ్యండి. తరువాత పేజి లో మీకు మనం ఇప్పటి వరకు నమోదు చేసిన డీటైల్స్ కనిపిస్తాయి, వాటిని ఒకసారి verify చేసుకొని, తప్పులు ఉంటే Keep Editing పై క్లిక్ చేసి సరిచేయండి లేకపోతే Download పై క్లిక్ చేసి Application సేవ్ చేసుకొని eSign & Submit పై క్లిక్ చెయ్యండి.
- గమనిక: eSign పేజీకి చేరుకోవడానికి కొంత సమయం పడవచ్చు. అందువల్ల దయచేసి కొద్దిసేపు వేచి ఉండాలి. ఈ సమయంలో Back, Cancel లేదా Reload / Refresh చేయకూడదు. eSign పేజీ పూర్తిగా ఓపెన్ అయ్యే వరకు వేచి ఉండాలి.
Step 7: Aadhaar OTP తో eSign & Submit చేయండి

- ఈ పేజి లో Enter Aadhaar వద్ద మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి Get OTP పై క్లిక్ చెయ్యాలి.
- Enter Your Aadhaar OTP వద్ద మీ Mobile కి వచ్చిన OTP ఎంటర్ చేసి, క్రింద “I hereby state” పక్కన ఉన్న బాక్స్ పై టిక్ చేసి Submit పై క్లిక్ చెయ్యాలి.
- ఈ పేజి లో మీకు Reference Number వస్తుంది, ఆ నెంబర్ ని Save చేసుకొని, Download Acknowledgement పై క్లిక్ చేసి Acknowledgement Slip ని save చేసుకోవాలి.
- ఇక్కడి తో Voter ID లేక EPIC card Voter ID Address correction process 2026 విజయవంతం గా పూర్తి అవుతుంది. Reference Number సహాయంతో మన Application status ను తెలుసుకోవోచ్చు .
Track Voter ID Address Update Application Status
- Voter Services Portal (Official Website)
వెబ్సైట్ ను ఓపెన్ చేసి. Mobile నెంబర్ సహాయం తో లాగిన్ అవ్వండి. - Voter Service Portal Dashboard లో “Track Application Status” ను ఎంపిక చేసుకోండి.
- మీ Reference Number లేదా Mobile Number ఎంటర్ చెసి, Submit పై క్లిక్ చెయ్యాలి.
- స్టేటస్ తక్షణమే కనిపిస్తుంది.
లేదా నేరుగా కాల్ చేయండి: 1950 (Voter Helpline — ఉచితం, 24×7)
Address Update తర్వాత ఎంత సమయం పడుతుంది?
- 15 – 30 రోజులు పడుతుంది.
- BLO వెరిఫికేషన్ తర్వాత అప్రూవల్ జరుగుతుంది.
- Approval తర్వాత కొత్త EPIC Card postal ద్వారా అందుతుంది.
సాధారణ తప్పులు – వీటిని జాగ్రత్తగా చేయండి
- Address Proof Document లో మీ పేరు మరియు కొత్త చిరునామా ఉందో confirm చేసుకోండి.
- Upload చేసే document స్పష్టంగా చదవగలిగేలా ఉండాలి.
- Reference Number మరియు Acknowledgement Slip save చేసుకోండి.
- తప్పుడు format లో document upload చేయడం (JPG/JPEG/PNG/PDF మాత్రమే valid).
- File size 2MB కంటే ఎక్కువ ఉండటం — compress చేయండి.
- Aadhaar తో link కాని Mobile Number use చేయడం (eSign fail అవుతుంది).
- Wrong EPIC Number ఎంటర్ చేయడం.
- తప్పుడు documents సమర్పించడం — ఇది చట్టప్రకారం నేరం.
Application Reject అయ్యే కారణాలు
- Aadhaar OTP verify కాకపోవడం.
- Wrong EPIC Number.
- సాంకేతిక కారణాలు వలన.
Offline లో Voter Card చిరునామా సవరణ ఎలా చేయాలి?
Internet access లేకపోయినా లేదా online process నచ్చకపోతే, offline voter card Address correction కూడా చేయవచ్చు.
Step 1: Form 8 తీసుకోండి
- Voter Services Portal (Official Website) వెబ్సైట్ లో Form 8 Download చేసుకోవోచ్చు .
- లేదా దగ్గర్లో ఉన్న BLO (Booth Level Officer) దగ్గర తీసుకోండి
Step 2: Form Fill చేయండి
- అన్ని details clearly blue/black pen తో రాయండి
- Photo section లో కొత్త passport size ఫోటో అతికించండి.
- Signature వేయండి.
Step 3: Submit చేయండి
- మీ BLO దగ్గర లేదా Electoral Registration Office (ERO) లో submit చేయండి.
- Acknowledgment receipt తప్పకుండా తీసుకోండి.
తరచూ అడిగే ప్రశ్నలు | FAQ – Voter Card Address Change Telugu
Q1: Voter ID లో Address Correction చేయడానికి fee అవుతుందా?
ఎటువంటి fee అవసరం లేదు. ఇది పూర్తిగా ఉచితం (Free). Election Commission of India ఈ సేవను నిరామయంగా అందిస్తుంది.
Q2: Address Correction తర్వాత కొత్త EPIC Card వస్తుందా?
అవును. Address Correction తర్వాత BLO Approval పొందిన తర్వాత నూతన EPIC Card జారీ అవుతుంది. అది postal ద్వారా మీ కొత్త చిరునామాకు వస్తుంది.
Q3: Address Correction కి ఏ documents upload చేయాలి?
Aadhaar Card, Electricity Bill, Ration Card, Driving Licence, Passport, Bank Passbook, Rent Agreement లేదా Property Tax Receipt — వీటిలో ఏదైనా ఒకటి JPG/JPEG/PNG/PDF format లో, 2MB కంటే తక్కువగా upload చేయాలి.
Q4: Aadhaar తో Mobile Number link లేకపోతే ఏం చేయాలి?
ముందు Aadhaar తో Mobile Number link చేయించుకోండి. తర్వాత Form 8 online submit చేయండి. లేదా online లో Step 6 వరకు fill చేసి application download చేసుకుని offline BLO దగ్గర submit చేయవచ్చు.
Q5: Address Correction vs Shifting — నాకు ఏది Apply అవుతుంది?
మీరు అదే ఇంట్లో ఉంటూ Voter ID లో spelling తప్పు ఉంటే — Address Correction. ఇల్లు మారినట్లయితే అదే Assembly area అయినా వేరే area అయినా — Shifting of Residence ఎంచుకోవాలి. పై Comparison Table చూడండి.
Q6: Processing time ఎంత ఉంటుంది?
BLO Verification తర్వాత సాధారణంగా 15–30 రోజుల్లో Approval జరుగుతుంది. ఎన్నికల సీజన్ లో కొంచెం ఆలస్యం కావచ్చు.
ముఖ్యమైన Links | Important Links
| Portal / Service | Details |
|---|---|
| Voter Helpline Portal | Voter Services Portal (Official Website) |
| Voter Helpline App | ECINET |
| Toll Free Number | 1950 |
Related Articles
కొత్త ఓటర్ కార్డ్ కు అప్లై చేయుటకు Online Guide 2026ఓటర్ కార్డ్ ను డౌన్లోడ్ online Telugu 2026
ఓటర్ కార్డ్ లో పేరు ను సవరించుట Online 2026
ఓటర్ కార్డ్ లో ఫోటో అప్డేట్ Online 2026
సారాంశం | Conclusion
Voter Card Address Update Online Telugu 2026 – ఇప్పుడు మీకు పూర్తిగా అర్థమైందని భావిస్తున్నాం. Form 8 ద్వారా Electoral Roll లో Address Update చేయడం ఇప్పుడు చాలా సులభం — Online లేదా Offline రెండు పద్ధతుల్లో చేయవచ్చు.
సరైన Aadhaar మరియు EPIC details సిద్ధంగా ఉంటే, Online application 10–15 నిమిషాల్లో పూర్తి చేయవచ్చు. Approval కి సాధారణంగా 15–30 రోజులు పడుతుంది.
మీ Voter ID లో ఇంకా పాత చిరునామా ఉందా? ఇప్పుడే Apply చేయండి — మీ ఓటు హక్కు సురక్షితంగా వాడుకోవాలంటే మీ Voter ID తాజాగా ఉండాలి!
ఈ గైడ్ అధికారికంగా Election Commission of India విడుదల చేసిన మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడింది. తాజా 2026 Form 8 విధానం ప్రకారం వివరాలు అందించబడ్డాయి. దయచేసి అప్లై చేసే ముందు అధికారిక పోర్టల్ లో తాజా సూచనలు పరిశీలించండి.
ఈ పోస్ట్ మీకు ఉపయోగపడిందా? మీ friends మరియు family తో share చేయండి. Government Schemes , Application Process and other useful information కి సంబంధించిన మరిన్ని సేవల కోసం మా Web site esachivalayam.in ను follow చేయండి.