మీ Voter ID కి Mobile Number లింక్ లేదా? లేదా పాత నంబర్ మారిపోయి కొత్తది అప్డేట్ చేయాలా? అయితే ఈ పూర్తి గైడ్ మీకోసమే. ఈ ఆర్టికల్ లో Voter Card Mobile Number Update Online 2026 process ను Form 8 ద్వారా step-by-step గా వివరించాం. Election Commission of India అందించే అధికారిక Voter Services Portal ద్వారా ఈ సేవ పూర్తిగా ఉచితం.

Quick Summary — Voter Card Mobile Number Update Telugu 2026
| Details | Information |
|---|---|
| Time Required | 10–15 నిమిషాలు |
| Fee | పూర్తిగా ఉచితం (Free) |
| Form | Form 8 |
| Portal | Voter Services Portal |
| Processing Time | 07–15 రోజులు, కొన్ని సార్లు ముందుగానే ప్రాసెస్ చేయబడుతుంది. |
| Helpline | 1950 (Free, 24×7) |
Voter Card లో Mobile Number ఎందుకు అవసరం?
మీ మొబైల్ నంబర్ Electoral Roll లో అప్డేట్ ఉంటే:
- Application Status SMS ద్వారా వస్తుంది.
- Future corrections సులభం.
- OTP verification సమస్య ఉండదు.
- BLO verification సమయంలో సులభంగా సంప్రదించగలరు.
Form 8 అంటే ఏమిటి? | Form 8 Online Apply Telugu
Form 8 అనేది ఓటర్ కార్డ్‌లో ఉన్న వివరాలను సరిదిద్దడానికి ఉపయోగించే అధికారిక ఫారం. ఇది Election Commission of India ద్వారా అందించబడుతుంది. Election Commission Mobile Number Update or Add కోసం Form 8 అధికారిక ఫారం. దీన్నే “Correction of Entries in Electoral Roll” form అంటారు.
Form 8 ద్వారా మీరు:
- పేరు సరిదిద్దుకోవచ్చు.
- పుట్టిన తేదీ మార్చుకోవచ్చు.
- అడ్రస్ సరిచేయవచ్చు.
- ఫోటో అప్డేట్ చేయవచ్చు.
- మొబైల్ నంబర్ Add లేదా మార్చుకోవచ్చు.
EPIC card mobile number Update కి కావలసిన Documents
Form 8 Voter ID Mobile Number Link Online కోసం ఈ క్రింది డాక్యుమెంట్స్ సిద్దం గా ఉంచుకోవాలి (Election Commission of India నిర్దేశించిన documents ఇవి).
- EPIC Number (మీ Voter ID Number). ఒకవేళ మీ వద్ద Voter Card లేకపోయినా లేదా Voter Card Number తెలియక పోయిన చింతించనవసారం లేదు Electoral Roll Search ద్వారా ఎలా తెలుసుకోవలో ఈ గైడ్ లో వివరించబడింది.
- Aadhaar Number (eSign కోసం).
- Mobile Number – Aadhaar తో లింక్ అయినది (OTP verification కోసం).
- New Mobile Number – మీరు Electoral Roll లో నమోదు చేయాలనుకుంటున్నది.
- గమనిక: eSign ప్రక్రియ పూర్తి చేయాలంటే, మీ ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్ తప్పనిసరిగా active గా ఉండాలి. అలాగే, ఆధార్‌లో ఉన్న పేరు మరియు ఓటర్ కార్డ్‌లో ఉన్న పేరు పూర్తిగా ఒకే విధంగా ఉండాలి.
- Aadhaar Mobile Link లేకపోతే:
- మీ ఆధార్‌కు మొబైల్ నంబర్ లింక్ చేయబడకపోతే లేదా ఇప్పటికే లింక్ అయిన నంబర్‌ను మార్చుకోవాలనుకుంటే, Unique Identification Authority of India (UIDAI) 2026 నియమాల ప్రకారం రూపొందించిన ఆధార్ మొబైల్ నెంబర్ లింక్ / మార్చుట 2026 పూర్తి గైడ్ సహాయం తో ముందుగా Aadhaar Mobile Number Update పూర్తి చేసుకోండి.
- పేరు సరిపోకపోతే:
- ఒకవేళ ప్రస్తుతం మీ ఓటర్ కార్డ్‌లో ఉన్న పేరు, ఆధార్‌లో ఉన్న పేరుతో ఒకే విధంగా లేకపోతే, Application for Correction of Entries in Existing Electoral Roll లో Name ఎంపికను కూడా సెలెక్ట్ చేసి Mobile Number తో పాటుగా పేరు కూడా సరిచేసుకునేలా అప్లికేషన్ సమర్పించాలి.
- eSign చేయలేని పరిస్థితిలో:
- ఒకవేళ మీ ఆధార్‌కు మొబైల్ నెంబర్ లింక్ లేకపోవడం లేదా పేరు సవరణకు సమయం లేకపోతే, ఈ ఆర్టికల్‌లో వివరించిన Step 6 వరకు ఉన్న ప్రక్రియను అనుసరించి, ఫిల్ చేసిన అప్లికేషన్‌ను Download చేసుకుని మీ BLO / ERO కు సమర్పించవచ్చు. ఈ విధానంలో Aadhaar eSign అవసరం ఉండదు.
- అయితే, మొబైల్ నెంబర్‌ను ఆధార్‌కు లింక్ చేయడం మరియు పేరు సవరించుకోవడం తర్వాత eSign ద్వారా అప్లికేషన్ సమర్పించడం ఉత్తమమైన విధానం. ఈ విధానంలో BLO / ERO కి భౌతికంగా ఏ విధమైనా డాక్యుమెంట్ సమర్పించవలసిన పని లేదు.
- Aadhaar Mobile Link లేకపోతే:
Voter Card Mobile Number Update Online Step-by-Step Process
Step 1: Voter Service Portal లో Login లేద Sign-UP అవ్వండి

Form 8 online apply Telugu లో చేయడానికి మొదట మీ browser లో Voter Services Portal ను తెరవండి.
కొత్త User అయితే (Sign-UP):
- Sign-UP ఆప్షన్ పై క్లిక్ చెయ్యాలి.
- Mobile Number, Email ID (తప్పనిసరి కాదు) మరియు Captcha నమోదు చేసి Continue పై క్లిక్ చెయ్యాలి.
- తరువాత పేజిలో First Name మరియు Last Name నమోదు చేసి Resend OTP పై క్లిక్ చెయ్యాలి.
- మీ ఫోన్ కి వచ్చిన OTP ని verify చేసి Register అవ్వగలరు.
ఇప్పటికే Account ఉంటే (Login):
- Login ఆప్షన్ పై క్లిక్ చేసి Mobile Number / Email ID / EPIC No మరియు Captcha నమోదు చేసి Request OTP పై క్లిక్ చెయ్యాలి.
- OTP verify చేసి Portal లో Login అవ్వగలరు.
Step 2: Correction Of Entries (Form 8) ను ఎంపిక చెయ్యండి

- Voter Service Portal dashboard లో Fill Form 8 పై క్లిక్ చెయ్యాలి.
- తుదిపరి పేజి లో Application For Self or Other elector అని అడుగుతుంది. ఇక్కడ Self ను ఎంపిక చేసుకోండి. ఒకవేళ మీరు మీ వెరే వల్ల Voter card లో Mobile Number మార్పు చేయాలనుకుంటే Other elector ను ఎంపిక చేసుకోవాలి.
- EPIC నెంబర్ ఎంటర్ చేసి Submit పై క్లిక్ చెయ్యండి.
- ఒకవేళ మీకు మీ EPIC Number తెలియకపోతే, మీ “వివరాలు లేక ఫోన్ నెంబర్” తో Electoral Roll Search ద్వారా తెలుసుకోగలరు.
Search in Electoral Roll
- ఒకవేళ మీకు మీ EPIC Number తెలియకపోతే, మీ “వివరాలు లేక ఫోన్ నెంబర్” తో Electoral Roll Search ద్వారా తెలుసుకోగలరు.
- తుదిపరి పేజి లో మీకు Electoral Roll లో ఉన్న మీ డీటైల్స్ కనిపిస్తాయి, ఒకసారి verify చేసి ok పై క్లిక్ చెయ్యండి.
Step 3: Correction of Entries in Existing Electoral Roll ఎంపిక చేయండి

- ఈ పేజి లో Application for దగ్గర “Correction of Entries in Existing Electoral Roll” ని టిక్ చేసి క్రింద ఉన్న ok పై క్లిక్ చెయ్యండి.
- గమనిక: మీ మొబైలు నెంబర్ మీ Aadhaar తో తప్పనిసరిగా లింకు అయ్యి ఉండాలి. లేకుంటే Aadhar esign చేయలేము, Aadhaar తో మొబైలు లింకు లేకుంటే, మొదటిగా ఆధార్ తో మొబైలు నెంబర్ లింకు చేసుకొని, Form 8 online లో అప్లై చెయ్యండి, లేదు అనుకుంటే Online లో ఫిల్ చేసిన Form ని మీ BLO కి సంబంధించిన Proof డాక్యుమెంట్స్ తో అందచేయగలరు.
- Aadhaar Mobile Number Update Online via App – పూర్తి స్టెప్ బై స్టెప్ గైడ్ (2026)
Step 4: Personal Details నమోదు చెయ్యండి
A. State, District & Assembly/Parliamentary Constituency వద్ద details already fill అయ్యి ఉంటాయి — వాటిని ఒకసారి verify చేసుకొని Next పై క్లిక్ చెయ్యాలి.
B. Details వద్ద:
- మీ పేరు మరియు EPIC నంబర్ already fill అయ్యి ఉంటుంది.
- Aadhaar Number వద్ద టిక్ చేసి Aadhaar నంబర్ ఎంటర్ చెయ్యండి.
- Mobile Number మరియు Email (తప్పనిసరి కాదు) వద్ద మీ details ఎంటర్ చేసి Next పై క్లిక్ చెయ్యాలి.
C. I Submit application for దగ్గర “Correction of Entries in Existing Electoral Roll” select చేసి ఉంటుంది.
Step 5: Voter Card Mobile Number Update Service ఎంపిక చేయడం

- Application for Correction of Entries in Existing Electoral Roll దగ్గర Mobile Number వద్ద టిక్ చెయ్యండి.
- గమనిక: “Application for Correction of Entries in Existing Electoral Roll” ఆప్షన్ ద్వారా మనం ఒకేసారి 4 Voter Updates కి అప్లై చేయగలం. ఒకవేళ మీరు Mobile Number తో పాటుగా ఇతర డీటైల్స్ కూడా Update చేయాలనుకుంటే వాటి వద్ద కూడా టిక్ చెయ్యాలి, లేదుఅనుకుంటే Mobile Number దగ్గర టిక్ చేస్తే సరిపోతుంది.
- తరువాత మీరు Voter Card తో లింకు చేయాలనుకుంటున్న ఫోన్ నెంబర్ ను Mobile No. బాక్స్ లో నమోదు చెయ్యాలి.
- పేరు సరిపోకపోతే
- ఉదాహరణకు, మీ పేరు ఆధార్‌లో “సోమన చిన్న బాబు” అని ఉండి, కానీ ప్రస్తుతం ఓటర్ కార్డ్‌లో “చిన్న బాబు సోమన” లేదా వేరే విధంగా ఉంటే Aadhaar eSign సరిగ్గా పూర్తికాదు. ప్రస్తుతం ఓటర్ కార్డ్‌లో ఉన్న పేరు, ఆధార్‌లో ఉన్న పేరుతో స్పెల్లింగ్ మరియు పేరు క్రమం సహా అన్ని విధాలుగా సరిపోవాలి
- ఒకవేళ ప్రస్తుతం మీ ఓటర్ కార్డ్‌లో ఉన్న పేరు, ఆధార్‌లో ఉన్న పేరుతో ఒకే విధంగా లేకపోతే, Application for Correction of Entries in Existing Electoral Roll లో Name ఎంపికను కూడా సెలెక్ట్ చేసి పేరు సరిచేసుకునేలా అప్లికేషన్ సమర్పించాలి.
- First Name దగ్గర “సోమన చిన్న బాబు” అని ఆధార్‌లో ఉన్న విధంగా పూర్తి పేరును నమోదు చేసి, Surname ఖాళీగా వదిలేయాలి. మరియు Supporting Document దగ్గర మీ ఆధార్ కార్డ్ PDF/JPG రూపం లో 2 MB లోపాల ఉండే విదం గా అప్లోడు చెయ్యాలి (ఆధార్ కాపీ పై క్రింద బాగాన మీ సంతకం చెయ్యాలి). ఈ విధంగా నమోదు చేస్తే Aadhaar eSign Process ను విజయవంతంగా పూర్తి చేయవచ్చు.
- ఒకవేళ ప్రస్తుతం మీ ఓటర్ కార్డ్‌లో ఉన్న పేరు, ఆధార్‌లో ఉన్న పేరుతో అదే విధంగా సరిపోతే, Name మార్చాల్సిన అవసరం లేదు.
తరువాత Next పై click చెయ్యండి.
Step 6: Declaration
- D. Declaration వద్ద Declaration పూర్తి గా చదివి Place దగ్గర మీ ఊరి పేరు నమోదు చేసి Next పై click చెయ్యండి.
- E. Submission దగ్గర Captcha నమోదు చెసి Send OTP పై క్లిక్ చేసి, మీ Mobile కి వచ్చిన OTP ని verify చేసి Preview and Submit పై క్లిక్ చెయ్యండి. తరువాత పేజి లో మీకు మనం ఇప్పటి వరకు నమోదు చేసిన డీటైల్స్ కనిపిస్తాయి, వాటిని ఒకసారి verify చేసుకొని, తప్పులు ఉంటే Keep Editing పై క్లిక్ చేసి సరిచేయండి లేకపోతే Download పై క్లిక్ చేసి Application సేవ్ చేసుకొని eSign & Submit పై క్లిక్ చెయ్యండి.
- గమనిక: eSign పేజీకి చేరుకోవడానికి కొంత సమయం పడవచ్చు. అందువల్ల దయచేసి కొద్దిసేపు వేచి ఉండాలి. ఈ సమయంలో Back, Cancel లేదా Reload / Refresh చేయకూడదు. eSign పేజీ పూర్తిగా ఓపెన్ అయ్యే వరకు వేచి ఉండాలి.
Step 7: Aadhaar OTP తో eSign & Submit చేయండి

- ఈ పేజి లో Enter Aadhaar వద్ద మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి Get OTP పై క్లిక్ చెయ్యాలి.
- Enter Your Aadhaar OTP వద్ద మీ Mobile కి వచ్చిన OTP ఎంటర్ చేసి, క్రింద “I hereby state” పక్కన ఉన్న బాక్స్ పై టిక్ చేసి Submit పై క్లిక్ చెయ్యాలి.
- ఈ పేజి లో మీకు Reference Number వస్తుంది, ఆ నెంబర్ ని Save చేసుకొని, Download Acknowledgement పై క్లిక్ చేసి Acknowledgement Slip ని save చేసుకోవాలి.
- ఇక్కడి తో Voter ID లేక EPIC card Voter ID mobile correction process 2026 విజయవంతం గా పూర్తి అవుతుంది. Reference Number సహాయంతో మన Application status ను తెలుసుకోవోచ్చు .
Track Voter ID Mobile Number Update Application Status
- Voter Services Portal (Official Website)
వెబ్‌సైట్ ను ఓపెన్ చేసి. Mobile నెంబర్ సహాయం తో లాగిన్ అవ్వండి. - Voter Service Portal Dashboard లో “Track Application Status” ను ఎంపిక చేసుకోండి.
- మీ Reference Number లేదా Mobile Number ఎంటర్ చెసి, Submit పై క్లిక్ చెయ్యాలి.
- స్టేటస్ తక్షణమే కనిపిస్తుంది.
లేదా నేరుగా కాల్ చేయండి: 1950 (Voter Helpline — ఉచితం, 24×7)
Mobile Number Update తర్వాత ఎంత సమయం పడుతుంది?
- 7 – 15 రోజులు పడుతుంది
- BLO వెరిఫికేషన్ తర్వాత అప్రూవల్ జరుగుతుంది.
సాధారణ తప్పులు
- తప్పుడు Mobile Number ఎంటర్ చేయడం — double check చేయండి.
- Aadhaar తో లింక్ కాని Mobile Number use చేయడం (eSign fail అవుతుంది).
- EPIC Number తప్పుగా ఇవ్వడం.
- Acknowledgement slip save చేసుకోకపోవడం.
- Reference Number నోట్ చేసుకోకపోవడం.
Application Reject అయ్యే కారణాలు
- Aadhaar OTP verify కాకపోవడం.
- Wrong EPIC Number.
- సాంకేతిక కారణాలు వలన
Offline లో Voter Card Mobile Number Update ఎలా చేయాలి?
Internet access లేకపోయినా లేదా online process నచ్చకపోతే, offline voter card Mobile Number Update కూడా చేయవచ్చు.
Step 1: Form 8 తీసుకోండి
- Voter Services Portal (Official Website) వెబ్‌సైట్ లో Form 8 Download చేసుకోవోచ్చు .
- లేదా దగ్గర్లో ఉన్న BLO (Booth Level Officer) దగ్గర తీసుకోండి
Step 2: Form Fill చేయండి
- అన్ని details clearly blue/black pen తో రాయండి
- Mobile Number section లో కొత్త నంబర్ రాయండి.
- Photo అతికించి signature వేయండి.
Step 3: Submit చేయండి
- మీ BLO దగ్గర లేదా Electoral Registration Office (ERO) లో submit చేయండి.
- Acknowledgment receipt తప్పకుండా తీసుకోండి.
తరచూ అడిగే ప్రశ్నలు | FAQ – Voter Card Mobile Number Link Telugu
Q1: Electoral Roll లో Mobile Number Update చేయడానికి fee అవుతుందా?
A: ఎటువంటి fee అవసరం లేదు. ఇది పూర్తిగా ఉచితం (Free).
Q2: Mobile Number update కి Aadhaar తప్పనిసరా?
A: Online eSign process కోసం Aadhaar తో లింక్ అయిన mobile తప్పనిసరి. Aadhaar లేకపోతే offline process ద్వారా BLO దగ్గర submit చేయవచ్చు.
Q3: Voter Portal Login కి ఉపయోగించే Mobile మరియు Electoral Roll లో Register చేసే Mobile ఒకటే అయి ఉండాలా?
A: తప్పనిసరి కాదు. Portal Login కి మీ registered mobile, Electoral Roll లో నమోదు చేయడానికి కొత్త mobile number use చేయవచ్చు.
Q4: Mobile number update తర్వాత కొత్త EPIC card వస్తుందా?
A: Mobile number update మాత్రమే చేస్తే కొత్త EPIC card రాకపోవచ్చు. కానీ Electoral Roll record లో మీ mobile number update అవుతుంది.
Q5: Application submit చేసిన తర్వాత Mobile Number తప్పుగా ఎంటర్ చేశామని తెలిసింది, ఏం చేయాలి?
A: వెంటనే మీ BLO ని directly contact చేయండి లేదా Voter Helpline 1950 కి call చేయండి.
Q6: Voter Portal లో Login చేయడానికి Mobile OTP రాట్లేదు, ఏం చేయాలి?
A: Resend OTP ఆప్షన్ try చేయండి. అయినా రాకపోతే 1950 కి call చేయండి లేదా offline process వాడండి.
Q7: నా Aadhaar తో Mobile Number లింక్ లేదు, ఇప్పుడు ఏం చేయాలి?
A: ముందుగా దగ్గర్లో ఉన్న Aadhaar Seva Kendra లో లేదా UIDAI app ద్వారా Mobile Number లింక్ చేయించుకోండి. తర్వాత Form 8 online submit చేయండి.
ముఖ్యమైన Links | Important Links
| Portal / Service | Details |
|---|---|
| Voter Helpline Portal | Voter Services Portal (Official Website) |
| Voter Helpline App | ECINET |
| Toll Free Number | 1950 |
Related Articles
AP Voter ID Apply Online Guide 2026Voter Card Download Telugu 2026
Voter Card Name Correction Online 2026
సారాంశం | Conclusion
voter id mobile number link telugu – ఇప్పుడు మీకు పూర్తిగా అర్థమైందని భావిస్తున్నాం. Form 8 ద్వారా Electoral Roll లో Mobile Number Add లేదా Update చేయడం ఇప్పుడు చాలా సులభం — Online లేదా Offline రెండు పద్ధతుల్లో చేయవచ్చు.
సరైన Aadhaar మరియు EPIC details సిద్ధంగా ఉంటే, Online application 10–15 నిమిషాల్లో పూర్తి చేయవచ్చు. Approval కి సాధారణంగా 7–15 రోజులు పడుతుంది.
మీ Voter ID కి ఇంకా Mobile Number లింక్ కాలేదా? ఇప్పుడే Apply చేయండి — మీ ఓటు హక్కు సురక్షితంగా వాడుకోవాలంటే మీ contact details తాజాగా ఉండాలి!
ఈ గైడ్ అధికారికంగా Election Commission of India విడుదల చేసిన మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడింది. తాజా 2026 Form 8 విధానం ప్రకారం వివరాలు అందించబడ్డాయి.
ఈ పోస్ట్ మీకు ఉపయోగపడిందా? మీ friends మరియు family తో share చేయండి. Government Schemes , Application Process and other useful information కి సంబంధించిన మరిన్ని సేవల కోసం మా Web site esachivalayam.in ను follow చేయండి.