Voter Card Name Correction Online 2026 Telugu – Form 8 ద్వారా పేరు సరిచేయడం (Step-by-Step Guide)

మీ Voter Card పేరు తప్పుగా ఉందా? స్పెల్లింగ్ తప్పు, ఇంటి పేరు పొరపాటు లేదా పెళ్లి తర్వాత పేరు మార్పు జరిగిందా? అయితే ఇది మీకోసమే! ఇప్పుడు Election Commission of India అందించిన Form 8 ద్వారా Voter Card Name correction telugu 2026 ద్వారా సులభంగా చేసుకోవచ్చు. ఈ గైడ్‌లో 2026 తాజా విధానం ప్రకారం Voter Card లో పేరు సరిచేయడం ఎలా అనే ప్రక్రియను తెలుగు లో step-by-step వివరించాము. ఈ గైడ్ అనుసరించి ఇంటి నుండే Online లో కొన్ని నిమిషాల్లో ఉచితంగా పేరు సవరించుకోవచ్చు.

Voter Card లో పేరు సరి చేయడం ఎలా - Form 8 Voter Card Name correction telugu

Quick Summary — Voter Card Name Correction Telugu 2026

DetailsInformation
Time Required10–15 నిమిషాలు
Feeపూర్తిగా ఉచితం (Free)
FormForm 8
PortalVoter Services Portal 
Processing Time15–30 రోజులు
Helpline1950 (Free, 24×7)

Voter Card లో పేరు తప్పుగా ఉంటే ఏం జరుగుతుంది?

చాలా మంది voter card spelling mistake ని పట్టించుకోరు — కానీ ఇది తర్వాత పెద్ద సమస్య అవుతుంది:

  • ఓటు వేయడానికి అనుమతి నిరాకరించవచ్చు.
  • Bank KYC, Passport, Aadhaar వంటి documents తో name mismatch అవుతుంది.
  • Government schemes మరియు benefits పొందడంలో ఇబ్బంది వస్తుంది.

అందుకే voter id name change వీలైనంత త్వరగా చేయడం మంచిది.

Form 8 అంటే ఏమిటి? | Form 8 Online Apply Telugu

Form 8 అనేది ఓటర్ కార్డ్‌లో ఉన్న వివరాలను సరిదిద్దడానికి ఉపయోగించే అధికారిక ఫారం. ఇది Election Commission of India ద్వారా అందించబడుతుంది. Election Commission name correction కోసం Form 8 అధికారిక ఫారం. దీన్నే “Correction of Entries in Electoral Roll” form అంటారు.

Form 8 ద్వారా మీరు:

  • పేరు సరిదిద్దుకోవచ్చు.
  • పుట్టిన తేదీ మార్చుకోవచ్చు.
  • అడ్రస్ సరిచేయవచ్చు.
  • ఫోటో అప్డేట్ చేయవచ్చు.
  • మొబైల్ నంబర్ మార్చుకోవచ్చు.

Voter Card పేరు మార్చడానికి కి కావలసిన Documents

Form 8 Name Correction Online కోసం ఈ క్రింది డాక్యుమెంట్స్‌లో ఏదైనా ఒకటి అప్లోడ్ చేయాలి: (Election Commission of India నిర్దేశించిన documents ఇవి)

  • EPIC Number (మీ Voter ID Number). ఒకవేళ మీ వద్ద Voter Card లేకపోయినా లేదా Voter Card Number తెలియక పోయిన చింతించనవసారం లేదు Electoral Roll Search ద్వారా ఎలా తెలుసుకోవలో ఈ గైడ్ లో వివరించబడింది.
  • Aadhaar Number (eSign కోసం).
  • Mobile Number – Aadhaar తో లింక్ అయినది (OTP verification కోసం).
  • పేరు రుజువు పత్రం (కింది వాటిలో ఏదైనా ఒకటి
  • ఆధార్ కార్డ్.
  • పాన్ కార్డ్.
  • పాస్‌పోర్ట్.
  • డ్రైవింగ్ లైసెన్స్.
  • గవర్నమెంట్ ఐడీ ప్రూఫ్.
  • గమనిక: eSign ప్రక్రియ పూర్తి చేయాలంటే, మీ ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్ తప్పనిసరిగా active గా ఉండాలి. అలాగే, ఆధార్‌లో ఉన్న పేరు మరియు ఓటర్ కార్డ్‌లో ఉన్న పేరు పూర్తిగా ఒకే విధంగా ఉండాలి.
  • Aadhaar Mobile Link లేకపోతే:
  • ఆధార్‌లో ఉన్న విధంగా కాకుండా, ఇతర డాక్యుమెంట్‌లో ఉన్న విధంగా ఓటర్ కార్డ్‌లో పేరు మార్చాలనుకుంటే – Step 5 లో ఆ ప్రక్రియను వివరంగా చెప్పడం జరిగింది.
    • అప్లోడ్ చేయబోయే డాక్యుమెంట్ కాపీ పై క్రింద బాగాన మీ సంతకం చేసి 2 MB లోపాల స్పష్టంగా PDF లేద JPEG రూపం లో అప్లోడు చెయ్యాలి.

    1. Voter ID Name Correction telugu Step by Step Process

    Step 1: Voter Service Portal లో Login లేద Sign-UP అవ్వండి

    Voter Service Portal లో Login మరియు Sign-UP చేయడం ఎలా - Step 1

    Form 8 online apply Telugu చేయడానికి మొదట మీ browser లో Voter Services Portal ను తెరవండి.

    • ఒకవేళ మీరు ఇప్పటి వరకు Voter Service Portal లో రిజిస్టర్ అవ్వకపోతే Sign-UP ఆప్షన్ పై క్లిక్ చెయ్యాలి.
    • అనంతరం మీకు Sign-UP పేజి ఓపెన్ అవుతుంది. అందులో Mobile Number, Email ID (తప్పనిసరి కాదు) మరియు Captcha నమోదు చేసి Continue పై క్లిక్ చెయ్యాలి.
    • తరువాత పేజి లో మీ First Name మరియు Last Name నమోదు చేసి Resend OTP పై క్లిక్ చెయ్యాలి. అనంతరం మీ ఫోన్ కి వచ్చిన OTP ని verify చెసి Voter Portal లో Register అవ్వగలరు.
    • ఒకవేళ మీకు ఇప్పటికే Voter Service Portal లో రిజిస్టర్ ఉంటే Login ఆప్షన్ పై క్లిక్ చేసి Indian Resident Elector వద్ద మీ Mobile Number/Email ID/EPIC No మరియు Captcha నమోదు చెసి Request OTP పై క్లిక్ చెయ్యాలి. అనంతరం మీ ఫోన్ కి వచ్చిన OTP ని verify చెసి Voter Portal లో Login అవ్వగలరు.

    Step 2: Correction Of Entries (Form 8) ను ఎంపిక చెయ్యండి

    Voter Service Portal లో Form 8 Correction of Entries ఎంపిక చేయడం - Step 2
    • Voter Service Portal dashboard లో Fill Form 8 పై క్లిక్ చెయ్యాలి.
    • తుదిపరి పేజి లో Application For Self or Other elector అని అడుగుతుంది. ఇక్కడ Self ను ఎంపిక చేసుకోండి. ఒకవేళ మీరు మీ వెరే వల్ల Voter card లో పేరు మార్పు చేయాలనుకుంటే Other elector ను ఎంపిక చేసుకోవాలి.
    • EPIC నెంబర్ ఎంటర్ చేసి Submit పై క్లిక్ చెయ్యండి.
      • ఒకవేళ మీకు మీ EPIC Number తెలియకపోతే, మీ “వివరాలు లేక ఫోన్ నెంబర్” తో Electoral Roll Search ద్వారా తెలుసుకోగలరు.
        Search in Electoral Roll
    • తుదిపరి పేజి లో మీకు Electoral Roll లో ఉన్న మీ డీటైల్స్ కనిపిస్తాయి, ఒకసారి verify చేసి ok పై క్లిక్ చెయ్యండి.

    Step 3: Correction of Entries in Existing Electoral Roll ఎంపిక చేయండి

    Form 8 లో Correction of Entries in Existing Electoral Roll సెలెక్ట్ చేయడం - Step 3
    • ఈ పేజి లో Application for దగ్గర “Correction of Entries in Existing Electoral Roll” ని టిక్ చేసి క్రింద ఉన్న ok పై క్లిక్ చెయ్యండి.
      • గమనిక: మీ మొబైలు నెంబర్ మీ Aadhaar తో తప్పనిసరిగా లింకు అయ్యి ఉండాలి. లేకుంటే Aadhar esign చేయలేము, Aadhaar తో మొబైలు లింకు లేకుంటే, మొదటిగా ఆధార్ తో మొబైలు నెంబర్ లింకు చేసుకొని, Form 8 online లో అప్లై చెయ్యండి, లేదు అనకుంటే Online లో ఫిల్ చేసిన Form ని మీ BLO కి సంబంధించిన Proof డాక్యుమెంట్స్ తో అందచేయగలరు.
      • Aadhaar Mobile Number Update Online via App – పూర్తి స్టెప్ బై స్టెప్ గైడ్ (2026)

    Step 4: Personal Details నమోదు చెయ్యండి

    A. Select State, District & Assembly/Parliamentary Constituency వద్ద already డీటైల్స్ ఫిల్ అయ్యి ఉంటాయి కనుకు వాటిని ఒకసారి verify చేసుకని క్రింద ఉన్న Next పై క్లిక్ చెయ్యండి.

    B.  Details వద్ద మీ పేరు మరియు EPIC నెంబర్ already ఫిల్ అయ్యి ఉంటుంది. Aadhaar Number వద్ద టిక్ చేసి క్రింద Aadhaar నెంబర్ ఎంటర్ ఎంటర్ చెయ్యండి, అలగే మొబైలు నెంబర్ మరియు Email ఉంటే ఎంటర్ చెయ్యండి లేదు అనుకూటే కాలి విడిచిపెట్టి Next పై క్లిక్ చెయ్యండి.

    C. I Submit application for (Tick any one of the following) దగ్గర “Correction of Entries in Existing Electoral Roll” సెలెక్ట్ చేసి ఉంటుంది.

    Step 5: Name Correction సర్విస్ ను ఎంపిక చెయ్యండి

    Voter Card Name Correction సర్విస్ ఎంపిక చేసి పేరు నమోదు చేయడం - Step 5
    • Application for Correction of Entries in Existing Electoral Roll దగ్గర Name దగ్గర టిక్ చెయ్యండి.
      • గమనిక: “Application for Correction of Entries in Existing Electoral Roll” ఆప్షన్ ద్వారా మనం ఒకేసారి 4 Voter Updates కి అప్లై చేయగలం. ఒకవేళ మీరు పేరు తో పాటుగా ఇతర డీటైల్స్ కూడా Update చేయాలనుకుంటే వాటి వద్ద కూడా టిక్ చెయ్యాలి, లేదుఅనుకుంటే Name దగ్గర టిక్ చేస్తే సరిపోతుంది.
    • తరువాత First Name మరియు Surname ఫీల్డ్‌లలో మీరు Supporting Document గా సమర్పించే డాక్యుమెంట్‌లో ఉన్న విధంగా మీ పేరును ఖచ్చితంగా నమోదు చేయాలి.
    • పేరు నమోదు చేసిన తర్వాత, మీరు ఎంటర్ చేసిన పేరు Voter Card లో ఎలా కనిపిస్తుందో పక్కన ఉన్న బాక్స్‌లో ప్రివ్యూ రూపంలో చూపిస్తుంది.
    • ఆ పేరును జాగ్రత్తగా Verify చేసి సరైనదే అయితే “OK” పై క్లిక్ చేయాలి.
    • ముఖ్యమైన గమనిక:
    • ఒకవేళ మీరు ఆధార్ ని సపోర్టింగ్ డాక్యుమెంట్ గా అప్లోడు చేయాలనుకూటే
      • మీ పేరు ఆధార్‌లో ఉన్న విధంగానే నమోదు చేయడం చాలా ముఖ్యం.
        • ఉదాహరణకు, మీ పేరు ఆధార్‌లో “సోమన చిన్న బాబు” అని ఉండి, కానీ ప్రస్తుతం ఓటర్ కార్డ్‌లో “చిన్న బాబు సోమన” లేదా వేరే విధంగా ఉంటే Aadhaar eSign సరిగ్గా పూర్తికాదు.
        • కనుక ప్రస్తుతం మనం ఓటర్ కార్డ్‌ రికార్డు లో నమోదు చేయబోయే పేరు, ఆధార్‌లో ఉన్న పేరుతో స్పెల్లింగ్ మరియు పేరు క్రమం సహా అన్ని విధాలుగా సరిపోవాలి.
        • First Name దగ్గర “సోమన చిన్న బాబు” అని ఆధార్‌లో ఉన్న విధంగా పూర్తి పేరును నమోదు చేసి, Surname ఖాళీగా వదిలేయాలి. ఈ విధంగా నమోదు చేస్తే Aadhaar eSign Process ను విజయవంతంగా పూర్తి చేయవచ్చు.
    • ఒకవేళ మీరు ఆధార్ కాకుండా వెరే సపోర్టింగ్ డాక్యుమెంట్ ని అప్లోడు చేయాలనుకూటే –
      • ఉదాహరణకు, మీరు PAN Card ను Supporting Document గా అప్లోడ్ చేయాలనుకుంటే, Aadhaar eSign విజయవంతంగా పూర్తవ్వాలంటే PAN Card లో ఉన్న పేరు, Aadhaar లో ఉన్న పేరుతో స్పెల్లింగ్ మరియు పేరు క్రమం సహా అన్ని విధాలుగా సరిపోవాలి
      • ఎందుకంటే మీరు PAN Card లో ఉన్న విధంగా పేరు‌ను First Name మరియు Surname ఫీల్డ్‌లలో నమోదు చేస్తారు. ఆ పేరు Aadhaar లో ఉన్న పేరుతో పూర్తిగా సరిపోతేనే Aadhaar eSign చేయగలం, లేకపోతే eSign పూర్తికాదు.
      • ఒకవేళ Aadhaar లో ఉన్న పేరుతో సరిపోకపోయినా, PAN Card (ఉదాహరణకి) లో ఉన్న విధంగానే పేరు నమోదు చేయాలనుకుంటే, Step 6 వరకు Online లో అప్లికేషన్ ఫిల్ చేసి Download చేసుకోవాలి.
      • ఆ తరువాత ఆ Filled Application తో పాటు PAN Card (ఉదాహరణకి) జిరాక్స్ కాపీని మీ సంబంధిత BLO కు సమర్పించాలి.
      • ఈ విధంగా Physical Verification ద్వారా అప్లికేషన్ ప్రాసెస్ చేయబడుతుంది.
    • Type of supporting document for Name దగ్గర మీ వద్ద ఉన్న Supporting Document Name ను డ్రాప్ డౌన్ లిస్ట్ లో ఎంపికచేసుకోని, పక్కన Upload Name Proof దగ్గర అప్లోడు చెయ్యాలి.
      • గమనిక: డాక్యుమెంట్ కాపీ పై మీ సంతకం చేసి సైజ్ 2 MB లోపు , PDF రూపం లో అప్లోడు చెయ్యడం ఉత్తమం.
    • తరువాత Next పై click చెయ్యండి.

    Step 6: Declaration

    • D. Declaration వద్ద Declaration పూర్తి గా చదివి Place దగ్గర మీ ఊరి పేరు నమోదు చేసి Next పై click చెయ్యండి.
    • E. Submission దగ్గర Captcha  నమోదు చెసి Preview and Submit పై క్లిక్ చెయ్యండి. తరువాత పేజి లో మీకు మనం ఇప్పటి వరకు నమోదు చేసిన డీటైల్స్ కనిపిస్తాయి, వాటిని ఒకసారి verify చేసుకొని, తప్పులు ఉంటే Keep Editing పై క్లిక్ చేసి సరిచేయండి లేకపోతే Download పై క్లిక్ చేసి Application సేవ్ చేసుకొని eSign & Submit పై క్లిక్ చెయ్యండి.
    • గమనిక:
      • ఒకవేళ మీ Aadhaar Card కు మొబైల్ నంబర్ లింక్ అయి ఉండి, అలాగే Aadhaar లో ఉన్న పేరు మరియు ప్రస్తుతం Voter Card రికార్డు లో నమోదు చేసిన పేరు పూర్తిగా ఒకే విధంగా ఉన్నట్లయితే, మీరు Step 7 ద్వారా మిగతా ప్రాసెస్‌ను పూర్తిగా Online లోనే పూర్తి చేయవచ్చు. ఈ సందర్భంలో Aadhaar eSign విజయవంతంగా జరుగుతుంది. BLO/ERO కు భౌతికంగా అప్లికేషన్ సమర్పించవలసిన పని లేదు.
      • అయితే, ఒకవేళ Aadhaar కు మొబైల్ నంబర్ లింక్ కాకపోయినా లేదా Voter Card రికార్డు లో నమోదు చేసిన పేరు Aadhaar లో ఉన్న పేరు ఒకే విధంగా లేకుంటే, eSign చేయడం సాధ్యం కాదు. అటువంటి పరిస్థితిలో ఇప్పటివరకు Online లో ఫిల్ చేసిన అప్లికేషన్‌ను ప్రింట్ తీసుకుని, మీ సంబంధిత BLO/ERO కు భౌతికంగా సమర్పించాలి.

    Step 7: eSign & Submit చేయండి

    Form 8 Aadhaar OTP ద్వారా eSign చేసి Submit చేయడం - Voter Card Name Correction Step 7
    • ఈ పేజి లో Enter Aadhaar వద్ద మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి Get OTP పై క్లిక్ చెయ్యాలి.
    • Enter Your Aadhaar OTP వద్ద మీ Mobile కి వచ్చిన OTP ఎంటర్ చేసి, క్రింద “I hereby state” పక్కన ఉన్న బాక్స్ పై టిక్ చేసి Submit పై క్లిక్ చెయ్యాలి.
    • ఈ పేజి లో మీకు Reference Number వస్తుంది, ఆ నెంబర్ ని Save చేసుకొని, Download Acknowledgement పై క్లిక్ చేసి Acknowledgement Slip ని save చేసుకోవాలి.
    • ఇక్కడి తో Voter ID లేక EPIC card name change process 2026 విజయవంతం గా పూర్తి అవుతుంది. Reference Number సహాయంతో మన Application status ను తెలుసుకోవోచ్చు .

    Track Voter ID Name Correction Application Status

    1. Voter Services Portal (Official Website)
      వెబ్‌సైట్‌ ను ఓపెన్ చేసి. Mobile నెంబర్ సహాయం తో లాగిన్ అవ్వండి.
    2. Voter Service Portal Dashboard లో “Track Application Status” ను ఎంపిక చేసుకోండి.
    3. మీ Reference Number లేదా Mobile Number ఎంటర్ చెసి, Submit పై క్లిక్ చెయ్యాలి.
    4. స్టేటస్ తక్షణమే కనిపిస్తుంది.

    లేదా నేరుగా కాల్ చేయండి: 1950 (Voter Helpline — ఉచితం, 24×7)

    ఓటర్ కార్డ్ పేరు మార్చడానికి ఎంత సమయం పడుతుంది?

    • సాధారణంగా: 15 – 30 రోజులు పడుతుంది.
    • BLO వెరిఫికేషన్ తర్వాత అప్రూవల్ జరుగుతుంది.

    సాధారణ తప్పులు | Common Voter Card Spelling Mistake Corrections

    • తప్పు డాక్యుమెంట్ అప్లోడ్ చేయడం.
    • స్పెల్లింగ్ మళ్లీ తప్పుగా టైప్ చేయడం.
    • అప్లోడు చేసిన డాక్యుమెంట్ తో పేరు మ్యాచ్ కాకపోవడం.
    • EPIC నంబర్ తప్పుగా ఇవ్వడం.

    Offline లో Voter Card లో పేరు సరి చేయడం ఎలా? | Offline Name Correction

    Internet access లేకపోయినా లేదా online process నచ్చకపోతే, offline లో కూడా voter id name change చేయవచ్చు.

    Step 1: Form 8 తీసుకోండి

    • Voter Services Portal (Official Website) వెబ్‌సైట్‌ లో Form 8 Download చేసుకోవోచ్చు .
    • లేదా దగ్గర్లో ఉన్న BLO (Booth Level Officer) దగ్గర తీసుకోండి

    Step 2: Form Fill చేయండి

    • అన్ని details clearly blue/black pen తో రాయండి
    • తప్పు పేరు మరియు correct name రాయండి
    • Photo అతికించండి, signature వేయండి

    Step 3: Documents జత చేయండి

    • Self-attested copies of Aadhaar మరియు name proof document జోడించండి.

    Step 4: Submit చేయండి

    • మీ BLO దగ్గర లేదా Electoral Registration Office (ERO) లో submit చేయండి.
    • Acknowledgment receipt తప్పకుండా తీసుకోండి

    Voter Card Name Correction – తరచూ అడిగే ప్రశ్నలు

    Q1: ఓటర్ కార్డ్ లో పేరు మార్పు కు ఎంత fee అవుతుంది?

    A: ఎటువంటి fee అవసరం లేదు. Voter id name correction పూర్తిగా ఉచితం .

    Q2: Name correction తర్వాత కొత్త voter card వస్తుందా?

    A: అవును. Voter card name change approve అయిన తర్వాత మీ registered address కి కొత్త EPIC card పంపిస్తారు.

    Q3: Married అయిన తర్వాత voter card లో పేరు మార్చుకోవాలంటే?

    A: Marriage Certificate జత చేసి Form 8 submit చేయండి.

    Q4: Mobile number లేకుండా online apply చేయవచ్చా?

    A: OTP verification కోసం mobile number తప్పనిసరి. Mobile లేకుంటే offline process వాడండి.

    Q5: తప్పుగా submit చేశాను, cancel చేయవచ్చా?

    A: Application submit చేసిన తర్వాత cancel చేయడం కష్టం. మీ BLO ని directly contact చేయండి.

    Q6: Voter card name correction rejected అయితే ఏం చేయాలి?

    A: Rejection reason చదివి, సరైన documents తో మళ్ళీ apply చేయండి. Helpline 1950 కి call చేసి కూడా help తీసుకోవచ్చు.

    ముఖ్యమైన Links | Important Links

    Portal / ServiceDetails
    Voter Helpline PortalVoter Services Portal (Official Website)
    Voter Helpline AppECINET
    Toll Free Number1950

    Related Articles

    AP Voter ID Apply Online Guide 2026
    Voter Card Download Telugu 2026

    సారాంశం | Conclusion

    Voter Card Name Correction Online ప్రక్రియ ఇప్పుడు చాలా సులభంగా మారింది. Election Commission of India అందించిన Form 8 ద్వారా ఇంటి నుండే కొన్ని నిమిషాల్లో అప్లై చేయవచ్చు.

    సరైన supporting documents ఉంటే సాధారణంగా 15–30 రోజుల్లో correction approve అవుతుంది. మీ Voter ID లో పేరు తప్పుగా ఉంటే వెంటనే సరిచేయడం మంచిది, ఎందుకంటే ఇది Bank KYC, Passport, Government Schemes వంటి సేవలకు కూడా అవసరం అవుతుంది.

    మీ voter id లో పేరు తప్పుగా ఉంటే ఇప్పుడే apply చేయండి — ఓటు మీ హక్కు, అది సరిగ్గా వాడుకోవాలంటే మీ పేరు సరిగ్గా ఉండాలి!

    ఈ గైడ్ అధికారికంగా Election Commission of India విడుదల చేసిన మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడింది. తాజా 2026 Form 8 విధానం ప్రకారం వివరాలు అందించబడ్డాయి.


    ఈ పోస్ట్ మీకు ఉపయోగపడిందా? మీ friends మరియు family తో share చేయండి. Government Schemes , Application Process and other useful information కి సంబంధించిన మరిన్ని సేవల కోసం మా Web site esachivalayam.in ను follow చేయండి.

    Leave a Comment

    Your email address will not be published. Required fields are marked *

    Scroll to Top