Electricity Meter Apply Online Telugu – New Current Connection పూర్తి స్టెప్ బై స్టెప్ గైడ్ 2026

Electricity Meter Apply Online Telugu 2026 అనేది ఇప్పుడు చాలా సులభమైన ప్రక్రియగా మారింది. ఇంటి కోసం కానీ, షాప్ లేదా బిజినెస్ కోసం కానీ కొత్త విద్యుత్ కనెక్షన్ కావాలంటే, ప్రభుత్వ విద్యుత్ శాఖ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లోనే అప్లై చేయవచ్చు. ఈ ఆర్టికల్‌లో New Electricity Connection Apply Online Telugu ప్రక్రియను పూర్తి వివరాలతో తెలుసుకుందాం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త Electric Meter (కరెంట్ మీటర్) అప్లికేషన్ ప్రక్రియను మూడు ప్రధాన విద్యుత్ పంపిణీ సంస్థలు (DISCOMs) నిర్వహిస్తున్నాయి. అవి APEPDCL (Eastern Power Distribution Company of Andhra Pradesh), APSPDCL (Southern Power Distribution Company of Andhra Pradesh) మరియు APCPDCL (Central Power Distribution Company of Andhra Pradesh). వినియోగదారులు తమ నివాస ప్రాంతానికి సంబంధించిన DISCOM ద్వారా మాత్రమే Electric Meter Apply చేయాలి.
ఈ ఆర్టికల్‌లో ప్రత్యేకంగా APEPDCL పరిధిలో (తూర్పు ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలు) కొత్త Electric Meter Apply Online / Offline విధానం, అవసరమైన డాక్యుమెంట్లు, ఫీజులు మరియు ఇన్‌స్టాలేషన్ ప్రక్రియను పూర్తిగా స్టెప్ బై స్టెప్‌గా వివరించాం. దాదాపుగా మిగిలిన DISCOMలు కొత్త Electric Meter Apply Online ప్రక్రియ కూడా ఈ విధంగానే ఉంటుంది.

DISCOMHeadquartersKey Districts Covered
APEPDCLVisakhapatnamSrikakulam, Vizianagaram, Parvathipuram Manyam, Anakapalli, Alluri Sitharama Raju, East Godavari, West Godavari, Kakinada, Dr. B.R. Ambedkar Konaseema, Eluru.
APCPDCLVijayawadaKrishna, NTR (Vijayawada), Guntur, Palnadu, Bapatla, Prakasam
APSPDCLTirupatiSri Potti Sriramulu Nellore, Tirupati, Chittoor, Kadapa, Annamayya, Kurnool, Nandyal, Ananthapuramu, Sri Sathya Sai

కొత్త విద్యుత్ మీటర్ ఎందుకు అవసరం?

  • కొత్త ఇల్లు నిర్మించినప్పుడు.
  • అద్దె ఇంటికి ప్రత్యేక మీటర్ అవసరమైనప్పుడు.
  • షాప్ / కమర్షియల్ అవసరాల కోసం.
  • పాత మీటర్ రద్దు అయి కొత్తది అవసరమైనప్పుడు.

ఈ అన్ని సందర్భాల్లో Electricity Meter Apply Online Telugu విధానం ఉపయోగపడుతుంది.


Electricity Meter Apply Online కోసం కావలసిన డాక్యుమెంట్స్

ఆన్‌లైన్ అప్లికేషన్ చేసే ముందు ఈ డాక్యుమెంట్స్ సిద్ధంగా ఉంచుకోండి:

  • ఆధార్ కార్డు.
  • ఇంటి అడ్రస్ ప్రూఫ్ (పట్టా / రిజిస్ట్రేషన్ / అద్దె ఒప్పందం/హౌస్ టాక్స్/Possession లెటర్ ).
  • Wiring లేక Self Declaration form.
  • పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో.
  • సంతకం ఫోటో .
  • మొబైల్ నంబర్.

Electricity Meter Apply Online Telugu – స్టెప్ బై స్టెప్ ప్రక్రియ

Step 1: New Electricity Connection ఆప్షన్ ఎంచుకొనుట

APEPDCL వెబ్‌సైట్‌లో New Electricity Connection ఆప్షన్ ఎంపిక చేసే విధానం
APEPDCL అధికారిక వెబ్‌సైట్
  • మీ ప్రాంతానికి సంబంధించిన విద్యుత్ శాఖ అధికారిక వెబ్‌సైట్‌ ఓపెన్ చెయ్యాలి (ఉదాహరణకు Visakhapatnam APEPDCL).
  • ఈ పేజి లో CUSTOMERS డ్రాప్ డౌన్ లో గల NEW CONNECTION సెలెక్ట్ చేసుకోవాలి.
  • అనంతరం ఆ లిస్ట్ లో కనిపించే LT NEW CONNECTION REGISTRATION లేద HT CONNECTION REGISTRATION ఎంపిక చేసుకోవాలి load ఆధారంగా.
Feature LT ConnectionHT Connection
Full FormLow TensionHigh Tension
Voltage Range1,000V (standard 230V/415V) కంటే తక్కువ 1,000V (standard 11kV/33kV) కంటే ఎక్కువ
Load Threshold 75 kW వరకు 75 kW కంటే ఎక్కువ
TariffGenerally lower per-unit rateHigher fixed charges; varied per-unit rates
InstallationSimple, indoor meteringExpensive, requires dedicated substation/transformer
  • సాధారణం గా ఇంటి కోసం కానీ, షాప్ కోసం కానీ లేద చిన్న అవసరాలకు LT NEW CONNECTION REGISTRATION ను ఎంపిక చేసుకోవాలి.
  • తరువాత పేజి లో మీకు  “Is the service location greater than 1 km from the nearest electric line” అనే ఆప్షన్ కనిపిస్తుంది.
    • Yes – మన ఇంటి నుండి దగ్గరి కరెంట్ పోల్ 1 KM దాటి ఉంటే.
    • No – మన ఇంటి నుండి దగ్గరి కరెంట్ పోల్ 1 KM లోపు ఉంటే.
  • Yes లేద No ఎంపిక చేసుకున్న తరువాత మీకు అదే పేజి లో సర్విస్ charges కనిపిస్తాయి, వాటి కింద ఉన్న Submit బటన్ క్లిక్ చెయ్యాలి.

Step 2: Mobile Verification చేయుట

Electricity Meter Apply Online కోసం మొబైల్ నెంబర్ OTP వెరిఫికేషన్ ప్రక్రియ
  • Enter Surname దగ్గర మీ ఇంటి పేరు, Name దగ్గర మీ పేరు, Email, Phone నెంబర్ Captcha నమోదు చేసి Submit పై క్లిక్ చేశాక మీ ఫోన్ కి OTP వస్తుంది, ఆ OTP వెరీఫి చేసి Submit పై క్లిక్ చెయ్యాలి.

Step 3: General Information నమోదు చేయుట

APEPDCL Electricity Meter Apply Online లో General Information ఫారం నమోదు
  • Connection for layout electrification దగ్గర No సెలెక్ట్ చేసుకోండి.
  • Purpose దగ్గర మనం ఏ అవసరం కోసం అయితే మీటర్ అప్లై చేయాలని అనుకుంటునమ్మొ ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఉదాహరనికి ఇంటి కోసం అయితే Domestic, షాప్ కోసం అయితే Commercial.
    • గమనిక : Purpose దగ్గర మనం సెలెక్ట్ చేసుకున్న అవసరం ఆధారం గా ఈ పేజి లో మిగిలిన సమాచారం ఫిల్ చేయవలసి ఉంటుంది.
  • Connection for farmhouse purpose? దగ్గర No సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ farmhouse కోసమే మీటర్ అయితే Yes సెలెక్ట్ చేసుకోండి.
  • Underground cable erection required? దగ్గర No సెలెక్ట్ చేసుకోండి.
  • ఒక ఇంటి కోసం – Individual సెలెక్ట్ చేసుకోవాలి లేద
    • Apartments మరియు Combined ఇల్లుల కోసం Group House/Apartment సెలెక్ట్ చేసుకోవాలి.
  • Phase దగ్గర 1 లేక 3, మీ అవసరానికి అనుగుణం గా ఎంపిక చేసుకోవాలి. సాదారణంగా ఇంటి కోసం 1 ఎంపిక చేసుకోవాలి.
  • Load Required in (KW ) దగ్గర 1 kw ఎంటర్ చెయ్యాలి.
  • Government Type దగ్గర Non Government ఎంపిక చేసుకోవాలి, గవర్నమెంట్ purpose అయితే దానికి తగ్గట్టుగా ఎంపిక చేసుకోవాలి.
  • Status దగ్గర Individual ఎంపికచేసుకోవాలి.
  • Materials Required from APEPDCL దగ్గర No పెట్టండి.
  • తరువాత Next పై క్లిక్ చెయ్యండి

Step 4: Applicant Details నమోదు చేయుట

Electricity Meter Apply Online లో Applicant Details నమోదు చేసే పేజీ
  • Father/Husband పేరు నమోదు చెయ్యాలి.
  • Social Group దగ్గర మీ Caste ని ఎంపిక చేసుకోవాలి.
  • Premises Address దగ్గర మీ District, మండలం, విలేజ్, Section, Door No, స్ట్రీట్ పేరు, Area, Pincode నమోదు చెయ్యాలి.
  • Communication Address కూడా Premises Address అయితే పక్కన ఉన్న చెక్ బాక్స్ పై క్లిక్ చెయ్యండి. లేక Communication Address వెరే గా ఉంటే, ఆ డీటైల్స్ ఎక్కడ నమోదు చెయ్యాలి.
  • Contact దగ్గర ఆల్రెడీ మనం రెండో స్టెప్ లో నమోదు చేసిన ఫోన్ నెంబర్, Email ID కనిపిస్తుంది. ID Proof దగ్గర Aadhaar ని సెలెక్ట్ చేసుకవాలి. పక్కనే ఉన్న ID నెంబర్ దగ్గర ఆధార్ నెంబర్ నమోదు చేయాయిలి.

Step 5: డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయుట

APEPDCL Electricity Meter Apply Online లో Aadhaar మరియు ఇతర డాక్యుమెంట్స్ అప్లోడ్
  • Aadhaar Card (Upload .jpg only) ఆప్షన్ వద్ద File Upload పై క్లిక్ చేసి, Choose File వద్ద .jpg ఫార్మాట్‌లో ఉన్న ఆధార్ కార్డ్ చిత్రాన్ని అప్లోడ్ చేయాలి. ఫైల్ సైజ్ 500 KB లోపు ఉండేలా చూసుకోవాలి. అప్లోడ్ చేసే ఫోటోలో ఆధార్ కార్డ్ మొత్తం స్పష్టంగా కనిపించేలా చూసుకోవాలి.
  • Passport Size Photo (Upload .jpg only) ఆప్షన్ వద్ద Choose File వద్ద .jpg ఫార్మాట్‌లో ఉన్న మీ Passport Size Photo అప్లోడ్ చేయాలి. ఫైల్ సైజ్ 500 KB లోపు ఉండేలా చూసుకోవాలి.
  • Upload Signature (Upload .jpg only) వద్ద మీ సిగ్నేచర్ ఫోటో 500 kb లోపు ఉండేలా అప్లోడు చెయ్యాలి.
  • Electrical Installation Copy (Upload .pdf only) వద్ద Wiring లేక Self Declaration form ని అప్లోడు చెయ్యాలి. Scan చేసిన కాపీ 3 mb లోపు స్పష్టంగా కనిపించేలా చూసుకోవాలి.
  • Proof of Ownership (Upload .pdf only) దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ లిస్ట్ లో మీ దగ్గర ఉన్న ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని, ఆ ఫైల్ స్పష్టంగా కనిపించేలా 3 mb లోపుల ఫైల్ size ఉండే విధంగా అప్లోడు చెయ్యాలి. ఒకవేళ మీవద్ద ఈ డ్రాప్ డౌన్ లో చూపించిన డాక్యుమెంట్స్ లేకపోతే మీ పంచాయతి సెక్రెటరీ/ అడ్మిన్ సెక్రెటరీ వద్ద నుండి దృవీకరణ పత్రం పొంది, అప్లోడు చేయగలరు.
  • Terms and Conditions వద్ద టిక్ చేసి Next పై క్లిక్ చెయ్యాలి.

Step 6: ఫీజు చెల్లింపు

APEPDCL Electricity Meter Apply Online ఫీజు చెల్లింపు పేమెంట్ గేట్‌వే
  • ఈ పేజి లో మీకు మీరు Pay చేయవాలిసిన fee కనిపిస్తుంది. క్రింద ఉన్న Pay ఆప్షన్ పై క్లిక్ చేసిన తరువాత మీకు Payment gate way ఓపెన్ అవుతుంది.
  • Payment ఆప్షన్ లలో (Debit card, Net Banking, QR code, UPI) మీకు సౌకర్యవంతమైన విధానాన్ని ఎంపిక చేసుకొని పేమెంట్ పూర్తి చేయగలరు.

చెల్లింపు విజయవంతమైన తరువాత Application Form ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడితో Electricity Meter Apply Online ముగుస్తుంది.

కొన్ని సందర్బలలో Application form, మరియు డాక్యుమెంట్ అప్లోడు సెక్షన్ లో అప్లోడు చేసిన డాక్యుమెంట్స్ జిరాక్స్ లు మీ పరిధి లో గల Linemen కి సబ్మిట్ చెయ్యవలసి వస్తుంది.


Electricity Meter Application Status ఎలా చెక్ చేయాలి?

APEPDCL Application Status
  • అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయండి
  • Application Number మరియు Captcha నమోదు చేసి, Submit పై క్లిక్ చెయ్యండి.

ఇలా మీ Electricity Meter Application Online Status సులభంగా చెక్ చేయవచ్చు.

మీటర్ రావడం ఆలస్యం అయితే, మీ పరిధి లో గల Lineman లేక Electrical AE ను సంప్రదించగలరు.


మీటర్ ఎన్ని రోజుల్లో వస్తుంది?

సాధారణంగా:

  • డొమెస్టిక్ కనెక్షన్: 7–15 రోజులు
  • కమర్షియల్ కనెక్షన్: 10–20 రోజులు

ఫీల్డ్ ఇన్‌స్పెక్షన్ పూర్తయిన తరువాత మీటర్ ఇన్‌స్టాల్ చేయబడుతుంది.


Electricity Meter Apply Online Telugu 2026 – ముఖ్యమైన సూచనలు

  • అప్లికేషన్ ఫారమ్‌లో తప్పులు చేయవద్దు.
  • సరైన డాక్యుమెంట్స్ మాత్రమే అప్‌లోడ్ చేయాలి.
  • అప్లికేషన్ నంబర్‌ను భద్రపరుచుకోండి.
  • అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్ ద్వారా మాత్రమే అప్లై చేయడం సురక్షితం.

Electricity Meter Apply Offline విధానం

కొత్త విద్యుత్ మీటర్ కోసం ఆన్‌లైన్ చేయలేని వారు తమ సమీపంలోని Grama/Ward Sachivalayam (Swarna Gramam/Ward), MeeSeva Center లేదా సంబంధిత Electricity Office (APEPDCL / APSPDCL / APCPDCL Sub-division Office) వద్ద అప్లికేషన్ ఫారం తీసుకుని ఆఫ్‌లైన్‌గా అప్లై చేయవచ్చు.

అవసరమైన డాక్యుమెంట్స్ జిరాక్స్‌లతో పాటు అప్లికేషన్ సమర్పించిన తర్వాత, ఫీల్డ్ ఇన్‌స్పెక్షన్ పూర్తయిన తరువాత మీటర్ ఇన్‌స్టాలేషన్ ప్రక్రియ కొనసాగుతుంది.

ఈ విషయాలు కూడా మీకు ఉపయోగపడతాయి:

Learner Licence (LLR) Apply Online – పూర్తి స్టెప్ బై స్టెప్ గైడ్ 2026.

Protean ద్వారా PAN Card Online అప్లై చేయడం ఎలా? (Scan, Upload & e-Sign) – పూర్తి గైడ్ 2026.


ముగింపు

Electricity Meter Apply Online Telugu 2026 ప్రక్రియ ద్వారా ఇప్పుడు కొత్త విద్యుత్ కనెక్షన్ పొందడం చాలా ఈజీ అయ్యింది. ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా, పూర్తిగా ఆన్‌లైన్‌లో అప్లై చేసి మీ అప్లికేషన్ స్టేటస్ కూడా ట్రాక్ చేయవచ్చు. ఈ గైడ్ మీకు ఉపయోగపడితే, మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి. అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్ ద్వారా మాత్రమే అప్లై చేయడం సురక్షితం

తరుచూ అడుగు ప్రశ్నలు

1. కొత్త Electricity Meter Apply Online లో చేయవచ్చా?

అవును. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త విద్యుత్ మీటర్ కోసం APEPDCL / APSPDCL / APCPDCL అధికారిక వెబ్‌సైట్‌ల ద్వారా పూర్తిగా ఆన్‌లైన్‌లో అప్లై చేయవచ్చు. అప్లికేషన్, డాక్యుమెంట్స్ అప్లోడ్ మరియు ఫీజు చెల్లింపు అన్ని ఆన్‌లైన్‌లోనే జరుగుతాయి.

2. APEPDCL పరిధిలో ఏ జిల్లాలకు ఈ విధానం వర్తిస్తుంది?

APEPDCL పరిధిలో Srikakulam, Vizianagaram, Parvathipuram Manyam, Anakapalli, Alluri Sitharama Raju, East Godavari, West Godavari, Kakinada, Dr. B.R. Ambedkar Konaseema మరియు Eluru జిల్లాలు ఉన్నాయి.

3.LT Connection మరియు HT Connection మధ్య తేడా ఏమిటి?

LT (Low Tension) కనెక్షన్ సాధారణంగా ఇళ్లకు, షాప్‌లకు మరియు చిన్న అవసరాలకు ఉపయోగిస్తారు (75 kW వరకు).
HT (High Tension) కనెక్షన్ పెద్ద పరిశ్రమలు లేదా ఎక్కువ లోడ్ అవసరమైన వాణిజ్య అవసరాల కోసం ఉపయోగిస్తారు (75 kW కంటే ఎక్కువ).

4. Electricity Meter Application Status ఎలా చెక్ చేయాలి?

APEPDCL అధికారిక వెబ్‌సైట్‌లో “Application Status” ఆప్షన్ ద్వారా Application Number మరియు Captcha నమోదు చేసి మీ అప్లికేషన్ స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో సులభంగా చెక్ చేయవచ్చు.

5. Aadhaar Card తప్పనిసరా Electricity Meter Apply Online చేయడానికి?

అవును. గుర్తింపు ధృవీకరణ కోసం Aadhaar Card తప్పనిసరి. Aadhaar లేకుండా ఆన్‌లైన్ అప్లికేషన్ సాధారణంగా స్వీకరించబడదు.

6. Electricity Meter Apply Online చేసిన తర్వాత ఇంకా AE Office కి వెళ్లాలా?

ఆన్‌లైన్ అప్లికేషన్ పూర్తయిన తర్వాత కొన్ని సందర్భాల్లో అప్లికేషన్ ఫారమ్ మరియు డాక్యుమెంట్స్ జిరాక్స్‌లను సమర్పించాల్సి రావచ్చు. సాధారణంగా Lineman లేదా Field Officer డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు సైట్ ఇన్‌స్పెక్షన్ కోసం వస్తారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top