1B Download Online అనేది ఆంధ్రప్రదేశ్ లో భూమి యాజమాన్య (Ownership) వివరాలను తెలుసుకోవడానికి ఉపయోగపడే ముఖ్యమైన ప్రక్రియ. 1B (ROR – Record of Rights) డాక్యుమెంట్ ద్వారా భూమి పట్టాదారు పేరు, సర్వే నంబర్, విస్తీర్ణం వంటి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ గైడ్ లో మీరు మీ భూమి portal ద్వారా 1B Download Online ఎలా చేయాలి అనే ప్రక్రియను స్టెప్ బై స్టెప్ గా తెలుసుకుంటారు.
Step 1: Mobile Number OTP తో Login అవ్వుట

- మీ భూమి official portal ఓపెన్ చెయ్యాలి.
- Login పేజి లో మీ మొబైలు నెంబర్ నమోదు చేసి Get OTP పై క్లిక్ చెయ్యాలి.
- మీ ఫోన్ కి వచ్చిన OTP మరియు Captcha ఎంటర్ చేసి Login అవ్వగలరు.
Step 2: మీ 1-బి / గ్రామ 1-బి ఆప్షన్ ఎంపిక చేసుకొనుట

- Login అయిన తరువాత,
- మీ భూమి వివరాలకోసం క్లిక్ చేయండి క్రింద ఉన్న మీ 1-బి/గ్రామ 1-బి పై క్లిక్ చెయ్యాలి.
- ఇది ROR 1B Download Online కోసం ఉపయోగించే ఆప్షన్.
Step 3: మీ అడంగల్ (గ్రామ లెక్కలు – 3) వివరాలు నమోదు చేయుట

- జిల్లా ఎంచుకోండి దగ్గర క్లిక్ చేసి డ్రాప్ డౌన్ లో మీ జిల్లని ఎంపిక చేసుకోవాలి.
- మండలం ఎంచుకోండి దగ్గర మీ మండలం ని ఎంపిక చేసుకోవాలి.
- గ్రామం ఎంచుకోండి దగ్గర మీ గ్రామం ను ఎంపిక చేసుకోవాలి.
- మీరు గ్రామం పేరు ఎంచుకున్న తరువాత మీకు Pattadar Name ఆప్షన్ ఓపెన్ అవుతుంది.
- Pattadar Name పక్కన ఉన్న చెక్ బాక్స్ పై క్లిక్ చేసిన తరువాత,
డ్రాప్ డౌన్ లో మీ పట్టాదారు పేరు ఎంచుకోవాలి. - క్రింద గ్రీన్ కలర్ లో ఉన్న క్లిక్ చెయ్యండి option పై క్లిక్ చెయ్యాలి.
Step 4: ROR-1B Report భద్ర పరుచుకొనుట (Download / Print)

- ఈ పేజి లో మీకు 1 బి రిపోర్ట్ కనిపిస్తుంది.
- 1B ని Print లేదా PDF Download చేయాలంటే, పేజీ కుడి భాగం పై మూలలో ఉన్న PDF symbol పై క్లిక్ చేయాలి.
- ఈ విధంగా మీరు మీ 1B Download Online ను సులభంగా పూర్తి చేయగలరు.
ముగింపు (Conclusion)
ఈ గైడ్ ద్వారా మీరు Meebhoomi Portal ఉపయోగించి 1B Download Online ఎలా చేయాలి అనే పూర్తి ప్రక్రియ తెలుసుకున్నారు. ఇంటి నుంచే మీ భూమి వివరాలను సులభంగా PDF రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. భవిష్యత్తులో portal updates ఉంటే ప్రక్రియలో చిన్న మార్పులు ఉండవచ్చు.
Aadhaar మరియు PAN కు సంబంధించిన సమస్యలపై మరింత సమాచారం కోసం మా స్వతంత్ర వెబ్సైట్ esachivalayam.in లో ఉన్న గైడ్లను చూడవచ్చు.
తరుచూ అడుగు ప్రశ్నలు (FAQs)
Q1: 1B Download Online ఫ్రీనా?
అవును. మీ భూమి portal ద్వారా 1B Download Online పూర్తిగా ఉచితం.
Q2: 1B మరియు Adangal ఒకటేనా?
కాదు. 1B (ROR) లో ownership వివరాలు ఉంటాయి.
Adangal లో పంటలు, సాగు వివరాలు ఉంటాయి.
Q3: Mobile OTP రాకపోతే ఏమి చేయాలి?
Network సమస్య ఉంటే కొంత సమయం తర్వాత మళ్లీ ప్రయత్నించండి.
సరైన మొబైల్ నెంబర్ నమోదు చేశారో లేదో చెక్ చేయండి.
Q4: 1B PDF ని అధికారిక డాక్యుమెంట్ గా వాడవచ్చా?
అవును. చాలా సందర్భాలలో 1B PDF Download కాపీ సరిపోతుంది.
కానీ లీగల్ అవసరాలకు MRO కార్యాలయం నుండి సర్టిఫైడ్ కాపీ అవసరం కావచ్చు.
Q5: Pattadar Name కనిపించకపోతే ఏమి చేయాలి?
గ్రామం లేదా జిల్లా తప్పుగా ఎంపిక చేస్తే Pattadar Name చూపించదు.
సరైన వివరాలతో మళ్లీ ప్రయత్నించండి.